కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంఘటిత మరియు అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులందరికీ సామాజిక భద్రత విస్తరణ కోసం - సామాజిక భద్రత-2020 పై కోడ్

Posted On: 06 APR 2023 8:04PM by PIB Hyderabad

కాంట్రాక్టు కార్మికుల (నియంత్రణ, రద్దు) చట్టం, 1970 ని కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థల్లో కాంట్రాక్టు కార్మికుల ఉపాధిని నియంత్రించడానికి, కొన్ని పరిస్థితులలో దానిని రద్దు చేయడానికి రూపొందించింది.  సంఘటిత మరియు అసంఘటిత రంగాల్లోని కాంట్రాక్టు కార్మికులు / కూలీలు / ఉద్యోగులతో సహా కార్మికులందరికీ సామాజిక భద్రతతో పాటు, సంక్షేమ ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం వివిధ చట్టాలు, పథకాలను అమలు చేస్తోంది.  సంఘటిత రంగంలో కార్మికులకు ప్రధానంగా ఐదు కేంద్ర చట్టాల ద్వారా సామాజిక భద్రత అందించడం జరుగుతోంది.  వీటిలో కార్మికుల అర్హత ననుసరించి, ఉద్యోగుల రాజ్య బీమా చట్టం-1948; ఉద్యోగుల భవిష్యనిధి, ఇతర నిబంధనల చట్టం-1952; ఉద్యోగుల పరిహార చట్టం-1923;  ప్రసూతి ప్రయోజన చట్టం-1961; గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-1972 మొదలైనవి ఉన్నాయి. 

అసంఘటిత రంగంలో కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో భాగంగా, అసంఘటిత కార్మికులకు జీవిత, వైకల్య రక్షణ, ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలతో పాటు, వృద్ధాప్య రక్షణకు సంబంధించిన విషయాలలో సంక్షేమ పథకాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం-2008 ని అమలు చేస్తోంది.  కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు కూడా వృద్ధాప్య సామాజిక భద్రత ను నెలవారీ పింఛను రూపంలో (కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ) అందించడానికి ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్-ధన్ పింఛను పథకం (పి.ఎం-ఎస్.వై.ఎం); ఆరోగ్యం, ప్రసూతి పథకం (ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ) వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేస్తున్నాయి.  అసంఘటిత కార్మికులకు వారి అర్హతను బట్టి జీవిత, వైకల్య ప్రయోజనాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి.ఎం.జె.జె.బి.వై); ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.ఎస్.బి.వై) వంటి పథకాలను కూడా అమలు చేస్తోంది.

సంఘటిత మరియు అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ సామాజిక భద్రతను విస్తరించడానికి వీలుగా ప్రభుత్వం సామాజిక భద్రత, 2020పై కోడ్‌ ను కూడా రూపొందించింది.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

*****

 


(Release ID: 1914608) Visitor Counter : 407


Read this release in: English , Urdu