పర్యటక మంత్రిత్వ శాఖ

రెండవ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ లో హరిత పర్యాటకాన్ని (గ్రీన్ టూరిజం) అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతగా ఏకగ్రీవంగా ఆమోదించిన దేశాలు


మొదటి రెండు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలలో జరిగిన చర్చలు తుది గోవా ప్రకటనను రూపొందించడానికి సరైన దిశలో పురోగమిస్తున్నాయి: శ్రీ అరవింద్ సింగ్

Posted On: 06 APR 2023 7:46PM by PIB Hyderabad

డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురిలో 2023 ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగిన 2వ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం విజయవంతంగా ముగిసిన అనంతరం పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

ఈ కార్యవర్గ బృందం సమావేశానికి 17 సభ్యదేశాలు, 8 ఆహ్వానిత దేశాలు, 4 అంతర్జాతీయ సంస్థల నుంచి 56 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జపాన్, సింగపూర్, మెక్సికో, ఇండోనేషియా, కొరియా మొదలైన ఏడు జీ20 దేశాల రాయబారులు కూడా హాజరయ్యారు. ప్రారంభ సమావేశంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ జాన్ బర్లా పాల్గొన్నారు.

 

సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు,

యు ఎన్ ఇ పి, ఐఎల్ఓ,

యు ఎన్ డబ్ల్యూ టి ఒ వంటి అంతర్జాతీయ సంస్థలతో జరిగిన వర్కింగ్ గ్రూప్ సమావేశాల గురించి పర్యాటక శాఖ కార్యదర్శి మీడియాకు వివరించారు.

 

టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం మొదటి సెషన్ లో యు ఎన్ ఇ పి  'ట్రావెల్ ఫర్ లైఫ్‘ ఎల్ పై, యు ఎన్ డబ్ల్యూ టి ఒ ' మొదటి డ్రాఫ్ట్ అవుట్ కమ్ డాక్యుమెంట్ - గోవా రోడ్ మ్యాప్ 'పై ప్రజెంటేషన్ లు ఇచ్చాయని శ్రీ అరవింద్ సింగ్ మీడియాకు వివరించారు. జి20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గోవా రోడ్ మ్యాప్ మొదటి ముసాయిదాపై తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. 2023 జూన్ లో గోవాలో జరిగే టూరిజం మినిస్టీరియల్ మీటింగ్ లో గోవా రోడ్ మ్యాప్ ను ఆమోదించనున్నారు.

వర్కింగ్ గ్రూప్ సమావేశంలో తుర్కియే, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇటలీ వరుసగా గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, టూరిజం ఎంఎస్ఎం లు, డెస్టినేషన్ మేనేజ్ మెంట్ అనే ఐదు ప్రాధాన్యతలపై ప్రజెంటేషన్లు ఇచ్చాయి. ఈ సమావేశంలో ప్రతి ప్రాధాన్య అంశంపై విస్తృతంగా చర్చించారు. భాగస్వామ్య దేశాలన్నింటికీ హరిత పర్యాటకం (గ్రీన్ టూరిజం)  అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యమని అన్ని దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించినట్టు కార్యదర్శి వెల్లడించారు.

 

జూన్ లో గోవాలో జరిగే టూరిజం మినిస్టీరియల్ మీటింగ్ లో తుది గోవా ప్రకటనను రూపొందించడానికి మొదటి రెండు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో చర్చలు సరైన దిశలో సాగుతున్నాయనే వ్యాఖ్యలతో పర్యాటక శాఖ కార్యదర్శి మీడియా సమావేశాన్ని ముగించారు.

 

వర్కింగ్ గ్రూప్ సమావేశాలలో భాగంగా, భారతదేశం , ఈశాన్య ప్రాంత పర్యాటక పటంలో అడ్వెంచర్ టూరిజం సామర్థ్యాన్ని హైలైట్ చేయడానికి అడ్వెంచర్ టూరిజంపై రెండు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (ఎటిఎ) కు చెందిన శ్రీమతి గాబ్రియెల్లా స్టోవెల్ (వైస్ ప్రెసిడెంట్) , అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎటిఒఎఐ) అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ అజిత్ బజాజ్  అడ్వెంచర్ టూరిజంపై ప్రపంచ, భారతీయ దృక్పధాలను సమర్పించారు.

 

దేశీయ పారిశ్రామిక భాగస్వాములు,  భారత దేశ రాష్ట్రాల కోసం స్థానిక వాటాదారుల తో కలసి  'టూరిజం ఇన్ మిషన్ మోడ్: అడ్వాంటేజ్ అడ్వెంచర్ టూరిజం' అనే అంశంతో రెండవ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ పధ్ధతులు, నేషనల్ స్ట్రాటజీ ఆఫ్ అడ్వెంచర్ టూరిజం, అడ్వెంచర్ డెస్టినేషన్ గా ఇండియా, అడ్వెంచర్ సేఫ్టీ మోడ్రన్ లా, రిస్క్ మిటిగేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్, వైబ్రెంట్ విలేజెస్ ను అడ్వెంచర్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో అడ్వెంచర్ టూరిజంను అభివృద్ధి చేయడంపై చర్చించారు.

 

అడ్వెంచర్ టూరిజం సైట్ల కోసం స్టేట్ ర్యాంకింగ్ ప్రమాణాలు, మోడల్ అడ్వెంచర్ టూరిజం చట్టం, మెగా ట్రైల్స్ అభివృద్ధి, అడ్వెంచర్ యాక్టివిటీ గైడ్ లైన్స్ అభివృద్ధి, అడ్వెంచర్ టూరిజం రెస్క్యూ సెంటర్లు, అడ్వెంచర్ టూరిజం కోసం ప్రత్యేక వెబ్ సైట్ ,సోషల్ మీడియా పేజీల అభివృద్ధి వంటి కార్యక్రమాలను భారత ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక , డోనర్ మంత్రి తన ప్రారంభ ప్రసంగంలో పంచుకున్నారు.

 

ఈ ప్రాంత సుసంపన్నమైన స్థానిక సంప్రదాయాలను అనుభూతి చెందేలా అంతర్జాతీయ ప్రతినిధులకు  మూన్ లైట్ తేయాకు ను తీసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారితో పాటు స్థానిక టీ ప్లకర్లు,  సంప్రదాయ వాద్యాల సంగీతకారులు వారిని ఉత్సాహపరిచారు. మూన్ లైట్ తేయాకు తీయడం ప్రపంచంలోని అత్యంత సాంప్రదాయ తేయాకు తీసే పద్ధతులలో ఒకటి. 'పొలం నుంచి కర్మాగారానికి' తేయాకు ఆకుల ప్రాసెసింగ్ విధానాన్ని చూసేందుకు వారు మకైబరి టీ ఫ్యాక్టరీని సందర్శించారు.  టీ ఫ్యాక్టరీలో సాయంత్రం , సైడ్ ఈవెంట్ తరువాత టీ టేస్టింగ్ సెషన్ నిర్వహించారు. ఇది ప్రతినిధులందరి ప్రశంసలు అందుకుంది.

 

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో ప్రయాణించడంతో వర్కింగ్ గ్రూప్ సమావేశం ముగిసింది. భారతదేశపు ఎత్తైన ఘుమ్ రైల్వే స్టేషన్  నుండి ఈ ప్రయాణం ప్రారంభమైంది. రైలు ప్రయాణంలో మొదటి స్టాప్ బటాసియా లూప్ వద్ద ఉంది, అక్కడ సైనిక్ బోర్డు ప్రత్యేక ఖుకురి నృత్యాన్ని నిర్వహించింది. రైలు ప్రయాణం డార్జిలింగ్ స్టేషన్ లో ముగిసింది. అనంతరం డార్జిలింగ్ లోని రాజ్ భవన్ ను పశ్చిమబెంగాల్ గవర్నర్ శ్రీ సి.వి.ఆనందబోస్ తో కలిసి సందర్శించారు.

 

రాష్ట్రప్రభుత్వం ఈ సందర్భంగా డిఐవై యాక్టివిటీస్ ద్వారా కమ్యూనిటీ భాగస్వామ్యం ప్రాముఖ్యతను తెలియజేస్తూ స్థానిక చేతి వృత్తులు, హస్త కళాకారుల ప్రతిభ ను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ ను ప్రతినిధులు సందర్శించారు. వారి ఆసక్తి, ప్రోత్సాహం స్థానిక కళాకారులను ఉత్సాహపరిచింది

 

***

 

 



(Release ID: 1914513) Visitor Counter : 171


Read this release in: Urdu , English , Hindi