ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వ్యవస్థాపకతకు ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
03 APR 2023 3:23PM by PIB Hyderabad
ఈశాన్యప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మార్కెటింగ్ & లాజిస్టిక్స్(వ్యూహ) అభివృద్ధి పథకం (పిటిపి- ఎన్ఇఆర్) కింద, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉత్పత్తుల సేకరణ, లాజిస్టిక్స్, మార్కెటింగ్‌లో అధిక సామర్ధ్యం ద్వారా గిరిజన హస్తకళాకారుల జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టిఆర్ఐఎఫ్ఇడి- ట్రైఫెడ్- భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య) ఈశాన్యప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈశాన్య హాండీక్రాఫ్ట్స్ & హ్యాండ్లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఇహెచ్‌హెచ్‌డిసి)తో 01.02.2023న ఈశాన్య ప్రాంతంలో (ఎన్ఇఆర్)ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవగామనా ఒప్పందం చేసుకుంది. మొత్తం 14 ట్రైఫెడ్ ప్రాంతీయ కార్యాలయాలు ట్రైబ్స్ ఇండియా ఇ-కామర్స్‌పోర్టల్‌పై వచ్చిన ఆర్డర్లను బట్వాడా చేసేందుకు తమ లాజిస్టిక్స్ భాగస్వామిగా ఇండియా పోస్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
పిటిపి-ఎన్ఇఆర్ పథకం ఈశాన్యప్రాంతం వ్యాప్తంగా అదనంగా 6000మంది గిరిజన హస్తకళాకారులు, గిరిజన ఉత్పత్తిదారుల జీవనోపాదిని నేరుగా మెరుగుపరచాలని భావిస్తోంది.
ఈ సమాచారాన్ని ఈశాన్యప్రాంత అబివృద్ధి మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సోమవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారంలో పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1913573)
आगंतुक पटल : 147