జల శక్తి మంత్రిత్వ శాఖ
దాదాపు 60% గృహాలకు పంపునీటి కనెక్షన్లు
Posted On:
03 APR 2023 5:06PM by PIB Hyderabad
దేశంలోని డైనమిక్ (చలనాత్మక) భూగర్భ జల వనరులను కాలానుగుణంగా కేంద్ర భూగర్భ జలాల బోర్డు (సిజిడబ్ల్యుబి), రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మదింపు చేస్తున్నారు.దేశంలోని మొత్తం 6,965 యూనిట్లు (బ్లాకులు/ తాలూకాలు/ మండలాలు/ వాటర్‌షెడ్‌లు (పరీవాహక ప్రాంతాల మధ్య ఉండే స్థలం)/ ఫిర్కాలను 2020లో చేసిన మదింపు ప్రకారం 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోని 1114 యూనిట్లను అతి వినియోగం (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) చేసినట్టుగా వర్గీకరించారు. ఇక్కడ వార్షిక భూగర్భ జలాల వెలికితీత అన్నది వార్షిక వెలికితీయదగ్గ భూగర్భ జల వనరుల కన్నా ఎక్కువగా ఉంది. మొత్తం దేశంలో (రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా) అతిగా వినియోగించినట్టుగా మదింపు చేసిన యూనిట్లు సహా భూగర్భ జల వనరులకు సంబంధించిన సంపూర్ణ సమాచారం బహిరంగ డొమైన్‌లో ఉంది. దానిని http://cgwb.gov.in/documents/2021-08-02-GWRA_India_2020.pdf అన్న లింక్ ద్వారా చూడవచ్చు.
దేశంలోని ప్రతి గ్రామీణ ఆవాసానికి కచ్ఛితంగా పంపునీటి కనెక్షన్ ద్వారా మంచినీరు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, ఆగస్టు 2019 నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం జల జీవన్ మిషన్‌ను (జెజెఎం) - హర్‌ఘర్ జల్‌ను అమలు చేస్తోంది.
జలజీవన్ మిషన్‌ను ఆగస్టు 2019లో ప్రకటించిన సమయంలో 3.23 కోట్ల గ్రామీణ ఆవాసాలకు పంపునీటి కనెక్షన్లు ఉన్నాయని గణాంకాలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు, అంటే 29.03.2023 నాటికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన సమాచారం మేరకు జెజెఎం కింద గత మూడున్నరేళ్ళలో అదనంగా 8.63 కోట్ల గ్రామీణ ఆవాసాలకు పంపు నీటి కనెక్షన్లను అందించడం జరిగింది. కనుక, 29.03.2023 నాటికి దేశంలోని మొత్తం 19.43 కోట్ల గ్రామీణ ఆవాసాలలో దాదాపు 11.59 కోట్ల (59%) ఆవాసాలకు పంపుద్వారా వారి ఇంటికి నీటి సరఫరా జరుగుతోంది. రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా, సంవత్సరాల వారీగా వివరాలను జతపరచడమైంది.
ఈ సమాచారాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియచేశారు.
*****
(Release ID: 1913569)
Visitor Counter : 194