సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల సాంస్కృతిక మంత్రుల 20వ సదస్సు నేడు వర్చువల్‌గా జరిగింది


సంస్కృతిక సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు ఎస్‌సీఓ దేశాల భాగస్వామ్య చరిత్రలను పునరుద్ధరించడానికి బుద్ధ భగవానుడు బోధించిన ప్రేమ మరియు అహింస నిజమైన విలువలు మరియు అభ్యాసాలను అవలంబించాల్సిన అవసరం ఉంది: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 03 APR 2023 4:47PM by PIB Hyderabad

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల సాంస్కృతిక మంత్రుల 20వ సెషన్‌ను సంస్కృతిక, పర్యాటకం మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏప్రిల్ 3, 2023న నిర్వహించారు.

కజకిస్థాన్, చైనా, కిర్గిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల సాంస్కృతిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్‌సీఓ సభ్య దేశ ప్రభుత్వాల మధ్య సంస్కృతి రంగంలో సహకారం మరియు ఎస్‌సీఓ క్రింద అటువంటి  ఒప్పందాల పరిధిలో ఎస్‌సీఓ ఫ్రేమ్‌వర్క్‌లో సాంస్కృతిక రంగంలో సహకారాన్ని పెంపొందించడంపై సభ్యదేశాల సాంస్కృతిక మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 

సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి తన ప్రారంభ ప్రసంగంలో ఎస్‌సీఓ దేశాల మధ్య చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలను ప్రస్తావించారు. పరస్పర గౌరవం, వైవిధ్యం మరియు సమగ్రత ద్వారా శాంతియుత సహజీవనాన్ని ప్రచారం చేయడంలో సాంస్కృతిక సహకారాలు మరియు సంభాషణల ప్రాముఖ్యతను ఆయన ఉదహరించారు. ఈ సందర్భంగా ఎస్‌సీఓ దేశాల భాగస్వామ్య బౌద్ధ వారసత్వంపై ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు.


భారతదేశ  ఎస్‌సీఓ ఛైర్మన్‌షిప్ థీమ్ సముచితతను వివరిస్తూ' భద్రత, ఆర్థిక సహకారం, కనెక్టివిటీ, ఐక్యత, సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు గౌరవం మరియు పర్యావరణం', సంస్కృతి ఈ థీమ్‌కు నేరుగా కట్టుబడి ఉండే శక్తిగా ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యాలన్నింటినీ సాధించడంలో తోడ్పడుతుందన్నారు. సమిష్టిగా 'జీవితానికి సరసమైన మరియు సురక్షితమైన సంస్కృతి'ని స్థాపించడం ద్వారా మాత్రమే మనం ఈ ప్రాంతంలో మొత్తం శ్రేయస్సు కోసం నిర్మాణాత్మకంగా దోహదపడగలమని చెప్పారు.

2023 మార్చి 14-15 తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన ఎస్‌సీఓ భాగస్వామ్య బౌద్ధ వారసత్వంపై ఇటీవల జరిగిన సదస్సులో పరిశీక రాష్ట్రాలు మరియు సంభాషణ భాగస్వాములతో ఎస్‌సీఓ దేశాలు పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బుద్ధుని బోధనలను హైలైట్ చేశారు. సంస్కృతిక సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు ఎస్‌సీఓ దేశాల భాగస్వామ్య చరిత్రలు మరియు సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఈ విలువలు మరియు అభ్యాసాల అవసరాన్ని నొక్కి చెప్పారు.

సమావేశం ముగింపులో ఎస్‌సీఓ సభ్య దేశాల సాంస్కృతిక మంత్రులందరూ ప్రోటోకాల్‌ను ఆమోదించారు. అనంతరం సంతకం చేశారు.

జూన్, 2017లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)లో భారతదేశం పూర్తి సభ్యత్వం పొందింది.


ఎస్‌సీఓ సాంస్కృతిక మంత్రుల సమావేశానికి సంబంధించిన పత్రాలను చర్చించడానికి మరియు రూపొందించడానికి భారతదేశం 3.2.2023 మరియు 31.3.2023 తేదీలలో వర్చువల్ ఫార్మాట్‌లో రెండు ఎస్‌సీఓ సీనియర్ కల్చర్ అధికారుల సమావేశాన్ని నిర్వహించింది. సంస్కృతిక మంత్రిత్వశాఖ ఎస్‌సీఓ సభ్య దేశాలు, పరిశీలకుల రాష్ట్రాలు మరియు సంభాషణ భాగస్వామి యొక్క భాగస్వామ్య బౌద్ధ వారసత్వంపై 14-15 మార్చి, 2023న న్యూఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించింది. ఎస్‌సీఓ దేశాల నుండి బౌద్ధ పండితులు మరియు ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న "ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్" ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా నేపథ్యంలో ఎస్‌సీఓ ద్వారా వ్యక్తీకరించబడిన 'సెక్యూర్' (భద్రత, ఆర్థిక సహకారం, కనెక్టివిటీ, ఐక్యత, సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు గౌరవం, మరియు పర్యావరణం) థీమ్‌ను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. 2018లో కింగ్‌డావోలో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్‌లో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.



****



(Release ID: 1913568) Visitor Counter : 160