బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు దేశీయ ఉత్పత్తి & దిగుమతి

Posted On: 03 APR 2023 4:36PM by PIB Hyderabad

దేశ బొగ్గు అవసరాల్లో చాలా భాగం స్వదేశీ ఉత్పత్తి ద్వారానే తీరుతోంది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన బొగ్గు దిగుమతులను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2021-22 సంవత్సరంలో, బొగ్గు ఉత్పత్తి అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 8.67% పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో ఫిబ్రవరి 2023 వరకు, దేశీయ బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరం ఇదే కాలం కంటే 15% పెరిగింది. 2023-24లో దేశీయ బొగ్గు ఉత్పత్తి 1 బీటీకి పైగా పెరుగుతుందని అంచనా.

గత ఐదేళ్లలో దేశీయంగా ఉత్పత్తి చేసిన బొగ్గు, దిగుమతి చేసుకున్న బొగ్గు గణాంకాలు వాటి విలువలతో సహా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:

 

(పరిమాణం మిలియన్ టన్నుల్లో & విలువ మిలియన్ రూ.ల్లో )

సంవత్సరం

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి

బొగ్గు దిగుమతి

 

పరిమాణం

విలువ

2017-18

635.25

161.25

789543.41

2018-19

687.59

183.51

988707.26

2019-20

677.94

196.7

914652.23

2020-21

671.3

164.05

706688.44

2021-22

726.49

151.77

1257459.99

 

బొగ్గు విషయంలో స్వయం ప్రతిపత్తిని సాధించడానికి దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఏక గవాక్ష అనుమతులు, గనులు & ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 సవరణ, క్యాప్టివ్ గనులు తమ సొంత కంపెనీల అవసరాలు తీర్చిన తర్వాత వార్షిక ఉత్పత్తిలో 50% వరకు విక్రయించడానికి అనుమతి, ఎండీవో మార్గంలో ఉత్పత్తి, భారీ ఉత్పత్తి సాంకేతికతల వినియోగం, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు & ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, ప్రైవేట్ కంపెనీలు/పీఎస్‌యూలకు బొగ్గు గనుల వేలం వంటి కొన్ని ప్రధాన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వాణిజ్యపరమైన తవ్వకాల కోసం 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా అనుమతించడం జరిగింది.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

****


(Release ID: 1913562) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Tamil