జల శక్తి మంత్రిత్వ శాఖ
భూగర్భ జలవనరుల సుస్థిర నిర్వహణ కోసం పటిష్ట చర్యలు
Posted On:
03 APR 2023 5:00PM by PIB Hyderabad
భూగర్భ జలాల వినియోగాన్ని అంచనా వేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో దేశంలో బ్లాక్/ మండలం/ తాలూకా/వాటర్‌షెడ్/ ఫిర్కా వారీగా కేంద్ర భూగర్భ జల మండలి తరచూ దేశంలో భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేస్తుంది. 2022 లో 7,089 ప్రాంతాల్లో కేంద్ర భూగర్భ జల మండలి అధ్యయనం నిర్వహించింది.15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 1006 అధ్యయన కేంద్రాలలో(14%) భూగర్భ జలాల వినియోగం మితిమీరి ఉందని బోర్డు గుర్తించింది. ఇక్కడ లభ్యత కంటే భూగర్భ జల వనరుల వార్ధిక వినియోగం ఎక్కువగా ఉంది. అందుబాటులో ఉన్న వార్షిక భూగర్భ జల వనరు. డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్‌మెంట్ 2022 ప్రకారం (తాజా) హర్యానా, పంజాబ్, రాజస్థాన్, దాద్రా,నగర్ హవేలీ, డామన్ డయ్యూ లో భూగర్భ జలాల వెలికితీత 100% కి మించి ఉంది. 2022 అంచనా ప్రకారం, 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోకి వచ్చే 102 జిల్లాలలో ఉన్న మొత్తం అసెస్‌మెంట్ యూనిట్లలో భూగర్భ జలవనరుల వినియోగం 50% కి మించి ఉంది.
దేశంలో నీటిపారుదల, గృహ వినియోగం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం లాంటి వివిధ అవసరాలకు భూగర్భ జల వనరులను వినియోగిస్తున్నారు. పట్టణీకరణ,.పరిశ్రమలు, పెరుగుతున్న జనాభా, వర్షాలు సక్రమంగా కురవకపోవడం లాంటి వివిధ కారణాల వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. జలవనరులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. భూగర్భ జలవనరులపై ఎక్కువగా ఆధారపడకుండా చూసి భూగర్భ జల వనరుల స్థాయి పెరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. భూగర్భ జల వనరుల పరిరక్షణ కోసం అమలు జరుగుతున్న వివిధ చర్యల వివరాలు http://jalshakti-dowr.gov.in/sites/default/files/Steps%20taken%20by%20the%20Central%20Govt%20for%20water_depletion_july2022.pdf. ద్వారా తెలుసుకోవచ్చు.
దేశంలో అమలు జరుగుతున్న ముఖ్య చర్యలు:
i. కేంద్ర ప్రభుత్వం దేశంలో జల్ శక్తి అభియాన్ (JSA)ని అమలు చేస్తోంది. కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలు, వాటర్‌షెడ్ సృష్టించడం ద్వారా రుతుపవన వర్షపాతాన్ని రక్షించాలన్న లక్ష్యంతో 2021, 2022 సంవత్సరాల్లో (దేశవ్యాప్తంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో) 256 జిల్లాల పరిధిలో మొదటి జల్ శక్తి అభియాన్ 2019లో ప్రారంభమయింది. దీనిలో జలవనరుల .నిర్వహణ, రీఛార్జ్, పునర్వినియోగ నిర్మాణాలు, అడవుల పెంపకం, అవగాహన కల్పన మొదలైన కార్యక్రమాలు అమలు జరిగాయి. 2023 సంవత్సరానికి జల్ శక్తి అభియాన్ ను రాష్ట్రపతి 04 మార్చి 2023న “ తాగునీటికి మూలాధారం” అనే ఇతివృత్తంతో ప్రారంభించారు.
ii.2022 ఏప్రిల్ 24 న అమృత్ సరోవర్ మిషన్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 నీటి వనరులను అభివృద్ధి చేయడం , పునరుజ్జీవింపచేయడం లక్ష్యంగా మిషన్ అమలు జరుగుతుంది.
iii. అటల్ భుజల్ యోజన పథకాన్ని గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో రాష్ట్రాల సహకారంతో 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు చేస్తోంది. స్థానిక ప్రజల సహకారంతో గ్రామ స్థాయిలో జలవనరుల వినియోగం, పరిరక్షణ అంశాలకు ప్రాధాన్యత పధకాన్ని అమలు చేస్తారు.
iv. దేశంలో పరిశ్రమలు, మైనింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మొదలైన వాటి ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడం కోసం "పర్యావరణ (రక్షణ) చట్టం, 1986"లోని సెక్షన్ 3(3) ప్రకారం కేంద్ర భూగర్భ జల మండలి ఏర్పాటు అయ్యింది. జాతీయ స్థాయిలో వర్తించే విధంగా తాజా మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ 24 సెప్టెంబర్ 2020 న విడుదల చేసింది. మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రాలు వివిధ పరిశ్రమలు/ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు భూగర్భ జలాల వెలికితీత కోసం నిరభ్యంతర సర్టిఫికెట్ (NOC) జారీ చేస్తాయి.
v. కేంద్ర భూగర్భ జల మండలి దేశంలో నేషనల్ అక్విఫర్ మ్యాపింగ్ ప్రోగ్రామ్ (NAQUIM)ని అమలు చేస్తోంది. 25.15 లక్షల చదరపు కి.మీ (అందుబాటులో ఉన్న మ్యాప్ చేయదగిన ప్రాంతం) NAQUIM అధ్యయనాల కింద కవర్ చేయబడింది. NAQUIM అధ్యయన నివేదిక నిర్వహణ ప్రణాళిక తో పాటు తగిన చర్యల కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడం జరిగింది.
vi. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కోసం గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మోడల్ బిల్డింగ్ బై లాస్ 2016 ను రూపొందించింది. వర్షపు నీటి సంరక్షణ, నీటి సంరక్షణ చర్యలకు దీనిలో ప్రాధాన్యత ఇచ్చారు. మోడల్ బిల్డింగ్ బై లాస్ ప్రకారం, 100 చదరపు మీటర్ల ప్లాట్ సైజు ఉన్న అన్ని భవనాలు. లేదా, మరిన్ని తప్పనిసరిగా వర్షం నీటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. . 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మోడల్ బై లాస్ అమలుకు అంగీకరించాయి.
vii. ఉపరితల జలాలు, భూగర్భ జలాల ఉమ్మడి వినియోగాన్ని మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. భూగర్భ జలాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో దేశంలో PMKSY-AIBP పథకం కింద ఉపరితల నీటి ఆధారిత మేజర్, మీడియం నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి.
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1913559)
Visitor Counter : 284