పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిర్దేశిత లక్ష్యాల సాధనలో మిషన్‌మోడ్‌ లో పర్యాటకరంగం, వివిధ విభాగాలమధ్య సమన్వయం, ప్రైవేటు భాగస్వామ్యం అనే అంశంపై ముగిసిన రెండురోజుల చింతన్‌ శిబిరం.


పర్యాటక రంగంలో సవాళ్లు, అవకాశాలపై ఫలప్రదంగా ముగిసిన చర్చలు.

Posted On: 30 MAR 2023 7:13PM by PIB Hyderabad

నిర్ద్దేశిత లక్ష్యాల సాధనలో పర్యాటకరంగం,  వివిధ విభాగాలమధ్య సమన్వయం, ప్రైవేటు భాగస్వామ్యం అనే అంశంపై జరిగిన రెండురోజుల సమావేశం 2023 మార్చి30న ఫలప్రదంగా ముగిసింది.  పర్యాటకరంగంలోని సవాళ్లు, ఈ రంగంలో గల అవకాశాలపై ఈ సమావవేశంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయి. రాష్ట్రాలు, పరిశ్రమ వర్గాలు, పరిశ్రమ అసోసియేషన్లు, పరిశ్రమ నాయకులు క్రియాశీలంగా పాల్గొన్న ఈ సమావేశంలో  ఈ రంగం అభివృద్ధికిగల అవకాశాలను చర్చించారు. ఈ సందర్భంగా రెండు రోజులపాటు జరిగిన వర్క్‌షాప్‌లో  11 నాలెడ్జ్‌ సెషన్‌ లు నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు.

చింతన్‌ శిబిర్‌ లో భాగంగా జరిగిన సదస్సులలో పాల్గొన్న వారిని కేంద్రపర్యాటక,సాంస్కృతిక, డి.ఒ.ఎన్‌.ఇ.ఆర్‌ శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి అభినందించారు. దేశంలో పర్యాటక రంగంలో  మిషన్‌మోడ్‌లో  నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత కాల వ్యవధిలో సాధించేందుకు తమ అమూల్యమైన సలహాలను , సూచనలను, వ్యూహాలను తెలియజేసినందుకు ఆయన వారని అభినందించారు. రెండు రోజుల పాటు జరిగిన చింతన్‌ శిబిర్‌ముగింపు సమావేశంలో పర్యాటక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అరవింద్‌ సింగ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, రానున్న తొలి గ్లోబల్‌ టూరిజం ఇన్వెస్టర్ల శిఖరాగ్ర సమ్మేళనం గురించి ప్రస్తావించి, దాని వివరాలు తెలిపారు.  భారతదేశ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు మిషన్‌మోడ్‌ లో తీసుకువెళ్లేందుకు స్టేక్‌హోల్డర్లనుంచి సూచనలు , విలువైన సలహాలను స్వీకరించారు.

పర్యాటక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అరవింద్‌ సింగ్‌ రెండోరోజు చింతన్‌ శిబిరం ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ, 2023 సంవత్సరం భారతదేశానికి ఎంతో కీలకమైనదని చెప్పారు. 2023 లో ఇండియా జి20 అధ్యక్షబాధ్యతలు చేపట్టిందన్నారు. అలాగే ఇండియా , షాంఘై సహకార సంస్థ (ఎస్‌.సి.ఒ) ఛెయిర్‌  బాధ్యతలను నిర్వర్తిస్తోందన్నారు. ఇటీవల భారత పర్యాటక మంత్రిత్వశాఖ, ఎస్‌.సి.ఒ టూరిజం మంత్రుల సమావేశాన్ని కాశీ (వారణాసి) లో నిర్వహించినట్టు తెలిపారు.  వారణాశిని ఎస్‌.సి.ఒ తొలి సాంస్కృతిక రాజధానిగా ప్రకటించినట్టు తెలిపారు. ఇండియా జి`20 అధ్యక్షతన తొలి గ్లోబల్‌ టూరిజం ఇన్వెస్టర్ల శిఖరాగ్ర సమ్మేళనం (జిటిఐఎస్‌) 2023 మే 17 నుంచి 19 వ తేదీ వరకు న్యూఢల్లీిలో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఇది అంతర్జాతీయ, దేశీయ వ్యాపార వర్గాల మధ్య సంప్రదింపులకు వీలు కల్పిస్తుందని, దేశంలో పర్యాటక, ఆతిథ్యరంగంలో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుందని చెపÊఆపరు. అలాగే ఈ చింతన్‌ శిబిరం త్వరలో జరగనున్న గ్లోబల్‌ టూరిజం ఇన్వెస్టర్ల శిఖరాగ్ర సమ్మేళనానికి అవసరమైన కీలక సమాచారాన్ని,ఆలోచనలను అందించినట్టు చెప్పారు.

రెండోరోజు జరిగిన చింతన్‌ శిబిర్‌లో వివిధ రంగాలలో ప్రభుత్వ పథకాలతో అనుసంధానం గురించి చర్చించారు. పర్యాటక రంగం అనేది వివిధ రంగాలతో ముడిపడినది. వివిధ విభాగాలు, మంత్రిత్వశాఖల మద్దతు దీనికి అవసరం. రెండో రోజు జరిగిన చర్చలలో వివిధ మంత్రిత్వశాఖలతో సమన్వయం గురించి, అనుసంధానత, మౌలికసదుపాయాల పెంపు, పర్యాటక కేంద్రాల సామర్ధ్యం పెంపు, వంటి వాటి గురించి చర్చించారు. ఉదాహరణకు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, రోడ్డు,రవాణా, జాతీయ రహదారులు, పోర్టులు, షిప్పింగ్‌, జలవనరులు, రైల్వే మంత్రిత్వశాఖ, హౌసింగ్‌, పట్టణ వ్యవహారాలు, జలశక్తి మంత్రిత్వశాఖలు తమ పరిధిలో పర్యాటక రంగానికి తోడ్పడే అంశాలను పర్యాటక మంత్రిత్వశాఖతో కలిసి అభివృద్ది చేయడం గురించి తెలియజేశాయి. దీనిని మార్కెట్‌చేయడం గురించి, దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రోత్సహించడం గురించి కూడా ఆలోచనలు పంచుకున్నారు.

చింతన్‌ శిబిర్‌లో వివిధ సెషన్‌లలో వివిధ ప్రభుత్వ పథకాల అనుసంధానం, పర్యాటకులకు తమ ఇళ్ళలో ఆతిథ్యం ఇవ్వడం, సావనీర్లఉ, టూరిస్టుగైడ్లు, సాహసపర్యాటకాన్ని , గ్రామీణ పర్యాటకానికి ప్రోత్సహించడం వంటి విష
యాలను చర్చించారు. పర్యాటక అసోసియేషన్లయిన అడ్వెంచర్‌టూర్‌ ఆపరేటర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎటిఒఎఐ), కేరళ , మహారాష్ట్ర, కర్ణాటక,పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, బీహార్‌, మేఘాలయ, త్రిపుర, మణిపూర్‌, ఉత్తరాఖండÊ, కేంద్రపాలిత ప్రాంతాలైన లద్దాక్‌లు ఈ సమావేశంలో పాల్గొని కేస్‌ స్టడీస్‌ను ప్రదర్శించాయి. చింతన్‌ శిబిర్‌ ముగింపు సమావేశంలో పర్యాటకులకు ఆయా ప్రాంతాలలో ప్రజలు తమ ఇళ్లలో ఆతిథ్యం ఇవ్వడాన్ని ప్రోత్సహించడం, సావనీర్లు, టూరిస్టుగైడ్లు, సాహస పర్యాటకం, గ్రామీణ పర్యాటకం గురించిన ఆలోచనలు ముందుకు వచ్చాయి.

చింతన్‌శిబిర్‌ చర్చలలో ముందుకువచ్చిన పలు అంశాలు కింది విధంగా ఉన్నాయి.
1. 2047 నాటికి  3 ట్రిలియన్‌ యుఎస్‌డి జిడిపి సాధించాలని పరిశ్రమ ఆకాంక్ష
2.పర్యాటకం,ఆతిథ్యరంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తూ రాజస్తాన్‌ తీసుకున్న నిర్ణయాన్ని , అలాగే ఇలాంటి  మెరుగైన విధానాలను మిగిలిన రాష్ట్రాలుకూడా స్వీకరించడం.
3. పర్యాటక రంగంపై మరింత ప్రత్యేక దృష్టితో ప్రభుత్వ విధానాలు చేపట్టడం, మరింత లోతైన విశ్లేషణతో వీటినిచేపట్టడం.
4.పర్యాటక రంగంలో  ఆతిథ్యరంగంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి  వర్కింగ్‌ గ్రూప్‌ పరిశీలన
5.ప్రైవేట్‌రంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా పర్యాటక ప్రాంతాల ప్రొఫైల్స్‌ సిద్ధం చేయడం.
6.పిపిపి విజయవంతమైన లక్షద్వీప్‌ నమూనాను ఇతర చోట్ల అనుసరించడం.

7.ఇండియా ఎంఐసిఇ, వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ కాంపెయిన్‌ నిర్వహించడం.
8. ఎంఐసిఇ కి సంబంధించి హైదరాబాద్‌ కన్వెన్షన్‌ ప్రమోషన్‌ బ్యూరో ఒక మంచి నమూనా.డెస్టినేషన్‌ స్థాయి కన్వెన్షన్‌ బ్యూరోకు ఇది మంచి నమూనా. దీనిని సవివరంగా అధ్యయనం చేసి ఈ నమూనాను అనుసరించవచ్చు.
9.పర్యాటకరంగ పెట్టుబడుల వ్యూహ సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు పర్యాటక మంత్రిత్వశాఖ యుఎన్‌డబ్ల్యుటిఒ తో సంప్రదింపులు జరపడం.
10.పర్యాటక, ఆతిథ్యరంగంలో స్టార్టప్‌లతో కలిసి పర్యాటక మంత్రిత్వశాఖ పనిచేయడం.
11. నిధిప్లస్‌ను నేషనల్‌ టూరిస్ట్‌ సర్వీసెస్‌ పోర్టల్‌గా తీర్చిదిద్దడం, దీనిని ఎస్‌.ఇ.ఒ కోసం ఇంక్రెడిబుల్‌ ఇండియా తో అనుసంధానం చేయడం.

12. గుజరాత్‌ పర్యాటక రంగంనుంచి వచ్చిన గొప్ప పరివర్తనాత్మక కార్యక్రం`ఆతిథ్యం. దీనిని జాతీయ స్థాయిలో అమలు పరచడం.
13.అనుసంధానత, మౌలికసదుపాయాలు, పర్యాటక ఉత్పత్తులు, అనుభవాలు, నైపుణ్యాభివృద్ధి, రెగ్యులేటరీ సంస్కరణలు,సులభతర వ్యాపారం వంటి అంశాలకు సంబంధించి అంతర్‌ మంత్రిత్వశాఖ వర్కింగ్‌గ్రూప్‌ ఏర్పాటుచేసి, ఇందుకు సంబంధించిన ప్రమాణాలు రూపొందించడం.
14.హోం స్టే కి సంబంధించి వన్‌నేషన్‌ వన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం అమలు చేయడం.
15. ఆయా రాష్ట్రాలు, పరిశ్రమలు అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకునేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సుల గురించి పరిశీలించడం.

16. గ్రామీణ పర్యాటక క్లస్టర్‌ అభివృద్ధి నమూనాను అభివృద్ధిచేయడం.
17. ఎం.ఒ.ఇఎఫ్సఇసి,ఎంహెచ్‌ఎ, పౌరవిమానయానం, రాష్ట్రాల భాగస్వామ్యంతో మెగా అడ్వంచర్‌ యాత్రలునిర్వహించడం.
18. అడ్వంచర్‌ టూరిజానికి సంబంధించి నమూనా చట్టానికి రూపకల్పన, దానిని వీలైనంత త్వరగా ఖరారుచేయడం.
19. అడ్వంచర్‌ టూరిజం రెస్క్యూ కేంద్రాలను వీలైనంత త్వరగా ఖరారుచేయడం.
20.బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా 50 పర్యాటక కేంద్రాలను ఛాలెంజ్‌ మోడ్‌ లో రాష్ట్రాల ఎంపిక. ఇందుక ఐదు ప్రమాణాలను నిర్దేశించడం, వాటిని త్వరగా ఖరారుచేయడం.

****


(Release ID: 1913557) Visitor Counter : 122


Read this release in: Urdu , Hindi , Punjabi , English