నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

విధాన ప్రక్రియలు, హైడ్రోజన్ సర్టిఫికేషన్ కోసం ఉమ్మడి నిర్వహణ నియమాలు మరియు దేశాల మధ్య సహకారాలతో పాటు నియంత్రణ చట్రాలు హరిత హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను వేగవంతం చేయగలవని ఎం ఎన్ ఆర్ ఈ కార్యదర్శి శ్రీ బీ. ఎస్. భల్లా అన్నారు


అంతర్జాతీయ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు మరియు నియంత్రణ సంస్థల క్రియాశీల భాగస్వామ్యంతో ఎం ఎన్ ఆర్ ఈ 'హరిత హైడ్రోజన్ - నికర-శూన్య మార్గాలను వేగవంతం చేయడం' నిర్వహిస్తుంది.

Posted On: 02 APR 2023 7:12PM by PIB Hyderabad

రెండవ విద్యుత్శక్తి పరివర్తన వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) "హరిత హైడ్రోజన్ - నికర-శూన్య మార్గాలను వేగవంతం చేయడం'" అనే సైడ్ ఈవెంట్‌ను నిర్వహించింది.  కష్ట సాధ్యమైన రంగాలను డీకార్బనైజ్ చేయడంలో మరియు జీ 20 దేశాల నికర-సున్నా లక్ష్యాలను సాధించడంలో గ్రీన్ హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేయబడింది.

 

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) మరియు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) భాగస్వామ్యంతో వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా (WRI India) నాలెడ్జ్ పార్టనర్‌గా నిర్వహించబడిన ఈ సైడ్ ఈవెంట్ లో అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, పరిశ్రమలో భాగస్వాములు, నియంత్రణ సంస్థలు మరియు ఇతర కీలక వాటాదారులు. గ్రీన్ హైడ్రోజన్ విస్తరణను వేగవంతం చేయడానికి మరియు జీ 20 దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి విధానం, నియంత్రణ మరియు ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌ల చుట్టూ చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారతదేశపు మొట్టమొదటి హెచ్2 ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) ట్రక్కు ను కూడా ప్రదర్శించబడింది.

 

ఎం ఎన్ ఆర్ ఈ సెక్రటరీ శ్రీ భూపిందర్ సింగ్ భల్లా ప్రారంభ సెషన్‌లో ప్రధాన ప్రసంగంలో  మాట్లాడుతూ, “విధాన ప్రక్రియలు, హైడ్రోజన్ సర్టిఫికేషన్ కోసం ఉమ్మడి నిర్వహణ నియమాలు  మరియు దేశాల మధ్య సహకారాలతో పాటు నియంత్రణ చట్రాలు  హరిత హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను వేగవంతం చేయగలవు. ప్రపంచ హైడ్రోజన్ వాణిజ్యాన్ని ప్రారంభించడానికి హైడ్రోజన్ ధృవీకరణ కోసం ఒక సాధారణ ఫ్రేమ్‌వర్క్‌పై ఏకాభిప్రాయాన్ని అభివృద్ధి చేయడం చాలా కీలకం. జీ 20  చర్చలలో భాగంగా దీనిని సాధించడం చాలా ముఖ్యమైనది.

 

గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రపంచ దృష్టికోణాన్ని ఇస్తూ శ్రీమతి గౌరీ సింగ్ - డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఐ ఆర్ ఈ ఎన్ ఏ , “ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 MTs హైడ్రోజన్  ఉత్పత్తి చేయబడుతోంది మరియు అందులో 98% శిలాజ ఇంధనాల నుండి వస్తుంది. ప్రపంచంలోని ప్రస్తుత విద్యుత్ వినియోగం, 21,000 TWh, "గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీ"కి మారడానికి ఆరు రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేయాలి.

 

మాధవ్ పాయ్, మధ్యంతర సీ ఈ ఓ & ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - సస్టైనబుల్ సిటీస్ & ట్రాన్స్‌పోర్ట్, డబ్ల్యు ఆర్ ఐ  ఇండియా, మాట్లాడుతూ  "గ్రీన్ హైడ్రోజన్ హార్డ్-టు-అబేట్ సెక్టార్‌ల క్రాస్-సెక్టోరల్ డీకార్బనైజేషన్‌లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది స్థిరమైన, తక్కువ కార్బన్ భవిష్యత్తు కోసం ఇది చాలా కీలకమైన అంశం. ఆర్థిక మరియు సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మరియు ఒక యదా తద స్థితిస్థాపకమైన ప్రపంచ హైడ్రోజన్ విలువ వ్యవస్థ ను నిర్మించడానికి కీలకమైన సహకార మరియు సమన్వయ ప్రయత్నాలలో పాల్గొనడానికి ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి అని అన్నారు.

 

ఇంధన వనరులను వైవిధ్యపరచడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి పెరుగుతున్న ప్రయత్నాలు పర్యావరణ ప్రయోజనాలకు దారితీయడమే కాకుండా ఇంధన భద్రత మరియు  దిగుమతుల తగ్గుదలకు దారితీస్తాయి. పరిశుభ్ర ఇందన పరివర్తన లక్ష్యాలను చేరుకోవడానికి, జీ 20 దేశాలు పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల వంటి బహుముఖ వ్యూహాలను అవలంబించవలసి ఉంటుంది. శక్తి పరివర్తన కోసం గ్రీన్ హైడ్రోజన్‌ను కీలక సాధనం. ముఖ్యంగా కష్ట సాధ్యమైన పారిశ్రామిక రంగాలు, సుదూర మరియు భారీ రవాణా (విమానయానం మరియు షిప్పింగ్‌తో సహా) మరియు తాపన మరియు శక్తి నిల్వతో సహా ఇతర సంభావ్య అనువర్తనాల కోసం గణనీయమైన మరియు సమన్వయం సహకారం తో కూడిన ప్రపంచ ప్రయత్నాలు అవసరం.

 

డబ్ల్యు ఆర్ ఐ ఇండియా గురించి

 

డబ్ల్యు ఆర్ ఐ భారతదేశం లో పర్యావరణపరంగా ఉత్తమమైన మరియు సామాజికంగా సమానమైన అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యం గా సమాచారం మరియు ఆచరణాత్మక ప్రతిపాదనలను అందిస్తుంది. తన కార్యక్రమం లో భాగంగా స్థిరమైన మరియు జీవించదగిన నగరాలను నిర్మించడం మరియు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు పని చేయడంపై దృష్టి పెడుతుంది. పరిశోధన, విశ్లేషణ మరియు సిఫార్సుల ద్వారా, డబ్ల్యు ఆర్ ఐ భారతదేశ భూసంపదను రక్షించడానికి, జీవనోపాధిని ప్రోత్సహించడానికి మరియు మానవ శ్రేయస్సును మెరుగుపరచడానికి పరివర్తన పరిష్కారాలను రూపొందించడానికి ఆలోచనలను అమలులోకి తీసుకువస్తుంది. మరింత సమాచారం కోసం: www.wri-india.org

 

ఐ ఎస్ ఎ గురించి

 

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) సభ్య దేశాలలో సౌర విద్యుత్ శక్తిని అందుబాటు లోకి తీసుకురావడానికి, ఇంధన భద్రతను నిర్ధారించడానికి మరియు శక్తి పరివర్తనను ముందుకు నడపడానికి సౌర విద్యుత్ శక్తి టెక్నాలజీల విస్తరణ కోసం ఒక కార్య-ఆధారిత, సభ్యుల-ఆధారిత, సహకార వేదిక.

 

ఐ ఎస్ ఎ వర్ధమాన దేశాలు (LDCలు) మరియు  చిన్న ద్వీపంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభావాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, తక్కువ-కార్బన్ వృద్ధి పథాలను అభివృద్ధి చేయడంలో సభ్య దేశాలకు సహాయం చేయడానికి   సమర్థవంతమైన మరియు పరివర్తనాత్మక సౌర శక్తి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది.  బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (MDBలు), అభివృద్ధి ఆర్థిక సంస్థలు (DFIలు), ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజం మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలతో  భాగస్వామ్యాల ద్వారా ప్రపంచంలో సౌర శక్తి పరిష్కారాల విస్తరణ ద్వారా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రయత్నాలను సమీకరించడానికి భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్త ప్రయత్నంగా ఐ ఎస్ ఎ రూపొందించబడింది. 

 

ఇది 2015లో పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC)కి సంబంధించిన 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP21) సందర్భంగా రూపొందించబడింది. 2020లో దాని ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం యొక్క సవరణతో, ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్య దేశాలు ఇప్పుడు ఐ ఎస్ ఎలో చేరడానికి అర్హులు. ప్రస్తుతం, 110 దేశాలు ఐ ఎస్ ఎ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి సంతకం చేశాయి, వీటిలో 90 దేశాలు ఐ ఎస్ ఎ లో పూర్తి సభ్యులు కావడానికి అవసరమైన ధృవీకరణ సాధన పత్రాలను సమర్పించాయి. మరింత సమాచారం కోసం: www.isolaralliance.org

 

ఎస్ ఈ సీ ఐ గురించి

 

"సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్" (SECI) నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) యొక్క అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇది నేషనల్ సోలార్ మిషన్ (NSM) అమలు మరియు సాధనను సులభతరం చేయడానికి 20 సెప్టెంబర్, 2011న ఏర్పాటు చేయబడింది.  పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధికి నిర్దేశించబడిన లక్ష్యాలకు అంకితమైన ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది  కంపెనీల చట్టం, 1956 ప్రకారం సెక్షన్-25 (లాభ రహిత) కంపెనీగా చేర్చబడింది. మరింత సమాచారం కోసం: www.seci.co.in

 

 

*****



(Release ID: 1913248) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Marathi , Hindi