వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పప్పుల ధరలు పెంచడం ద్వారా ప్రజల వినియోగ స్థాయికి ఇబ్బంది కలిగించవద్దని చిల్లర వ్యాపారులను ఆదేశించిన వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శి


రిటైల్ మార్జిన్లను అసమంజస స్థాయి నుంచి తగ్గించండి: డీవోసీఏ కార్యదర్శి

Posted On: 31 MAR 2023 4:36PM by PIB Hyderabad

రిటైల్ మార్జిన్లను సాధారణీకరించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ చిల్లర వర్తకులకు సూచించారు. దీనివల్ల పప్పుల ధరలు పెరిగి ప్రజలను ఇబ్బంది పెట్టవని చెప్పారు. ఈరోజు ఇక్కడ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ), ప్రధాన వ్యవస్థీకృత రిటైలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. పప్పుధాన్యాల రిటైల్ మార్జిన్లు, ముఖ్యంగా కందిపప్పు మార్జిన్లు అసమంజసమైన స్థాయిలో లేకుండా తగ్గించాలని నిర్దేశించారు.

ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించడానికి చిల్లర పరిశ్రమ వర్గాలు సమ్మతి తెలియజేశాయి. పప్పుల ధరలను అదుపులో ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చాయి.

దేశంలో పప్పుల లభ్యత, సరసమైన ధరలు ఉండేలా చూడడానికి పప్పుధాన్యాల విలువ గొలుసులోని వాటాదార్లతో జరుపుతున్న సమావేశాల పరంపరలో ఈ సమావేశం కూడా ఒక భాగం.

 

***


(Release ID: 1912766) Visitor Counter : 173