నీతి ఆయోగ్
భారతదేశ యువత ఆలోచనలకు సాధఙకారత కల్పించడానికి ఉపయోగపడే కరికులమ్, మాన్యువల్, కార్యకలాపాల కాలండర్‌ను విడుదల చేసిన అటల్ ఇన్నొవేషన్ మిషన్.
2023`24 కు అటల్ టింకరింగ్ కరికులమ్, ఎక్విప్‌మెంట్ మాన్యువల్, కాలండర్ విడుదల
प्रविष्टि तिथि:
31 MAR 2023 3:05PM by PIB Hyderabad
నీతి ఆయోగ్‌కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), మూడు కొత్త రిసోర్సులను విడుదల చేసింది. ఇవి భారతదేశ యువతలో వినూత్న ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు వీలు కల్పించేందుకు ఉద్దేశించినవి. ఇందుకు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎటిఎల్ టింకరింగ్ కరికులమ్, ఎక్విప్‌మెంట్ మాన్యువల్, 2023`24 సంవత్సరానికి కార్యకలాపాల కాలండర్‌ను విడుదల చేశారు.టిఎల్ టింకరింగ్ కరికులమ్, విద్యార్థులు వినూత్న ఆవిష్కరణల నైపుణ్యాలకు పదునుపెట్టేది. మేకర్‌ఘాట్‌తో కలిసి కరికులమ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో విస్తృత కాన్సెప్ట్‌లను అభివృద్ది చేయడం జరిగింది. ఇందులో మౌలిక ఎలక్ట్రానిక్స్ నుంచి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు, 3డి ప్రింటింగ్ నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వరకు ఉన్నాయి. ఈ పాఠ్యప్రణాళికతో విద్యార్థులు, రోజువారి సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనడానికి వీలు కలుగుతుంది. అలాగే వీరికి అనుభవం, అనుభవంతోపాటు విజ్ఞానం అందుతుంది.
ఎక్విప్‌మెంట్ మాన్యువల్ లో దేశవ్యాప్తంగాగల పాఠశాలలోని అటల్ టింకరింగ్ లాబ్‌లలోని పరికరాల గురించిన సమగ్ర మార్గదర్శకాలు ఉంటాయి. ఈ మాన్యవల్‌లో ఒక్కోపరికరం, ఉపకరణం ఉపయోగాలు, దాని వివరాలు, అది ఏఏ ప్రయోగాలకు ఉపయోగపడుతుంది వంటి వివరాలు ఉంటాయి. అలాగే ఈ మాసపు కార్యకలాపాలు అంటూ ప్రత్యేక వివరాలు కూడా ఉన్నాయి. ఎటిఎల్ ప్రయోగశాలలోని పరికరాల ద్వారా విద్యార్థులు సృజనాత్మక పరిశోధనలు , ప్రయోగాలు చేయడానికి వీలు కలుగుతుంది. వినూత్న ఆవిష్కరణలు, వివిధ సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది..
2023`24 కాలండర్ ఈవెంట్స్‌లో సంవత్సరం పొడవునా చేపట్టదలచిన ఈవెంట్లు, వర్క్‌షాపులు, పోటీలు, ఆవిష్కరణల ప్రమోషన్, విద్యార్థులలో ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ ఆలోచనలను పెంపొందించడం వంటివి ఉన్నాయి. ఈ కాలండర్‌తో తాజా టింకరింగ్ కరికులమ్, ఎక్విప్‌మెంట్ మాన్యువల్‌లను అనుసంధానం చేశారు. ఇందులో ప్రత్యేకంగా ఈ మాసపు కార్యకలాపం అనే సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా ఎటిఎల్ లో చేసే ప్రయోగాలను పొందుపరిచారు. ప్రతి నెలకు సంబంధించి వీటిని ఇచ్చారు.
కరికులమ్, మాన్యువల్, కాలెండర్ ల విడుదల సందర్భంగా మాట్లాడుతూ ఎఐఎం మిషన్ కు చెందిన డాక్టర్ చింతన్ వైష్ణవ్, ఈ కొత్త రిసోర్సులను విడుదల చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇది ప్రబుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉందని, స్వావలంబిత భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు అనువుగా ఉందని అన్నారు. ఈ చర్యలు భవిష్యత్తులో దేశ యువత సాధికారత పొందడానికి, రేపటి అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరణలకు సంబంధించిన నైపుణ్యాలను సంతరించుకోవడానికి ఉపయోగపడతాయని , ఆ రకంగా వారు మార్పుకు సారధులు కాగలుగుతారని చెప్పారు.
అటల్ ఇన్నొవేషన్ మిషన్, ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యుయర్ షిప్ సంస్కృతిని యువతలో పెంపొందింప చేసేందుకు కట్టుబడి ఉంది. ప్రస్తుతం ప్రారంభించిన ఈ వనరులు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తాయి.
ఈ వనరులతో దేశవ్యాప్తంగా గల ఉపాధ్యాయులు, మెంటార్లు, విద్యార్థులు మెరుగైన భారతదేశానికి అవసరమైన ఆవిష్కరణలు, నైపుణ్యాలు సాధించడానికి వీలుకలుగుతుంది.
***
(रिलीज़ आईडी: 1912758)
आगंतुक पटल : 242