ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ


చార్ ధామ్ యాత్ర సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వానికి అన్ని రకాల సహాయం కేంద్ర ఆరోగ్య శాఖ అందిస్తుంది : డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ

చమోలి జిల్లాలో మలారి గ్రామాన్ని సందర్శించి అమలులో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ

డూన్ వైద్య కళాశాల కొత్త భవనంలో 500 పడకల ఆస్పత్రి, రుద్ర ప్రయాగ, నైనిటాల్, శ్రీనగర్, ఉత్తరాఖండ్ లలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ల ఏర్పాటు వంటి ఆరోగ్య సంబంధిత పథకాలకు శంకుస్థాపన చేయనున్న డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ

మలారి గ్రామాన్ని, పరిసర ప్రాంతాలను వైబ్రెంట్ విలేజ్ గా అభివృద్ధి చేసే కార్యక్రమం పురోగతిని సమీక్షించిన డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ

Posted On: 30 MAR 2023 7:59PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ;  రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్  మన్  సుఖ్  మాండవీయ గురువారం నుంచి ఉత్తరాఖండ్  ను సందర్శించారు. తొలి రోజు సందర్శనలో డెహ్రాడూన్ లోని జన్ ఔషధి కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి తనిఖీ చేశారు. జన్ ఔషధి కేంద్రంలోని ఆరోగ్య కార్యకర్తలు, లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.

సామాన్య ప్రజలకు చౌక ధరల్లో ఔషధాలు అందించడానికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఔషధాలు అందుబాటులో లేక ఏ ఒక్కరూ మరణించకూడదని అంటూ అందుకే జన్ ఔషధి కేంద్రాలను తెరుస్తున్నారని ఆయన చెప్పారు. జన్  ఔషధి కేంద్రాల్లో ప్రజలు చౌక ధరల్లో చౌకగా ఔషధాలు పొందుతున్నారని చెబుతూ జన్ ఔషధి కేంద్రాల్లో ప్రజల విశ్వాసం కూడా పెరిగిందన్నారు. జన్ ఔషధి కేంద్రాలతో ప్రజల అవసరాలు తీరడంతో పాటు ప్రజలు సొమ్ము ఆదా కూడా చేసుకుంటున్నారని కేంద్రమంత్రి అన్నారు.

దేశ రాజధాని నుంచి జిల్లా ప్రధాన కేంద్రాల స్థాయి వరకు విభిన్న ప్రాంతాల్లో 9500 పైగా జన్ ఔషధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజూ 20 లక్షల మంది ప్రజలు జన్ ఔషధి కేంద్రాలను సందర్శిస్తూ ఉంటారు. బహిరంగ మార్కెట్లో రూ.800 పలికే కేన్సర్  ఔషధం బైకాలుటామైడ్  జన్ ఔషధి కేంద్రంలో రూ.137కే అందుబాటులో ఉన్నట్టు  డాక్టర్  మన్  సుఖ్  మాండవీయ చెప్పారు. అలాగే బహిరంగ మార్కెట్లో రూ.400 పలికే సిటాగ్లిప్టిన్    జన్ ఔషధి కేంద్రంలో రూ.60కే అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

డాక్టర్  మన్  సుఖ్  మాండవీయ ప్రజారోగ్యానికి చెందిన ఫార్మాస్యూటికల్ అంశం. వివిధ కంపెనీలు   తయారుచేసే ఔషధాల నాణ్యత విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఏ కంపెనీ అయినా ఔషధ నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా చూస్తుంది. డిసిజిఐ, దేశవ్యాప్తంగా రాష్ర్ట స్థాయి డ్రగ్  కంట్రోలర్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ తప్పు చేసే వారిపై తగు చర్యలు తీసుకుంటూ ఉంటారు.

త్వరలో ప్రారంభం  కాబోయే చార్ ధామ్  యాత్ర గురించి ప్రస్తావిస్తూ యాత్ర సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ర్ట ప్రభుత్వానికి అన్ని రకాల సహాయం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. యాత్రకు వచ్చే ఏ వ్యక్తి కూడా ఎలాంటి ఆరోగ్య ఎదుర్కొనకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శక్తివంచన లేకుండా కృషి  చేస్తుందని ఆయన చెప్పారు. చార్  ధామ్  యాత్రలో పని చేసే డాక్టర్లు, పారా మెడికల్  సిబ్బంది, ఇతర సిబ్బందికి ప్రోత్సాహకంగా అలవెన్స్  అందించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిపారు.  

మలారి గ్రామానికి బయలుదేరే ముందు జిటిసి హెలీపాడ్  వద్ద ఉత్తరాఖండ్  ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్  సింగ్  ధమిని కేంద్ర ఆరోగ్య మంత్రి కలిశారు. మలారిలో కేంద్ర ఆరోగ్య మంత్రికి సాంప్రదాయిక దుస్తులు ధరించిన మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీతి వేలీ గ్రామ హెడ్ ఆయనకు పుష్పమాల ధరింపచేసి భోజ్  పాత్ర, స్వయం-సహాయక బృందాలు తయారుచేసిన విసనకర్రలు అందించి స్వాగతం పలికారు. జిల్లా మెజిస్ర్టేట్ శ్రీ హిమాంశు ఖురానా ఆర్గానిక్  హిల్  ఉత్పత్తులను అందచేశారు. స్థానిక మహిళలు అద్భుతమైన నాట్యప్రదర్శన చేశారు.

బద్రి కేదార్  భూమిలో తనకు లభించిన అద్భుత స్వాగతంపై హర్షం ప్రకటిస్తూ సాంప్రదాయిక దుస్తులు, జీవనశైలితో స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్  భారత్  సహా ప్రభుత్వ నిర్వహణలోని వివిధ పథకాల పనితీరు గురించి, కోవిడ్  టీకాల కార్యక్రమం, ఉచిత రేషన్, విద్యుత్,  నీరు, మొబైల్  కనెక్టివిటీల గురించి అడిగి తెలుసుకున్నారు.

మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో మంచి రోడ్లు, నెట్  వర్క్  కనెక్టివిటీ, విద్యుత్, నీరు, ఆరోగ్య వసతులు మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. హెల్త్,  వెల్  నెస్  కేంద్రాల ద్వారా ఆరోగ్య సదుపాయాలు అందించడంతో పాటు టెలీ-కన్సల్టెన్సీ ద్వారా అగ్రశ్రేణి వైద్యులు నేరుగా చికిత్స అందిస్తున్నారని, ఆయుష్మాన్  భారత్  ద్వారా ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందుతున్నారని, ప్రధానమంత్రి హౌసింగ్  ద్వారా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ప్రజల జీవితం సరళం అవుతోందని;  ప్రతీ ఇంటికీ విద్యుత్, నీరు అందుబాటులోకి తెస్తున్నారని  మంత్రి వివరించారు. ఫలితంగా వలసలు కూడా క్రమంగా తగ్గుతున్నట్టు ఆయన తెలిపారు. వైబ్రెంట్  విలేజ్  కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నట్టు చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సరిహద్దు ప్రాంతాలు మరింత ఉత్సాహంగా మారుతున్నాయన్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో సాహస క్రీడల పట్ల ప్రజలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.

ప్రయోగాత్మకంగా వార్మ్  వుడ్  మార్కెట్  ఏర్పాటు చేయడంతో పాటు దానికి గౌరాదేవి పేరిట జోషిమఠ్  ఆరోగ్య కేంద్రంగా నామకరణం చేసేందుకు అంగీకరించినట్టు ఆయన తెలిపారు. అక్కడ మొబైల్   కనెక్టివిటీ కూడా మెరుగుపడుతున్నదని చెప్పారు.

అనంతరం జిల్లా స్థాయి అధికారులతో వైబ్రెంట్  విలేజ్  కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మలారి ప్రాంతం గురించి చీఫ్  డెవలప్  మెంట్   ఆఫీసర్ మరిన్ని వివరాలు అందచేస్తూ ఇక్కడ పండిస్తున్న వనమూలికలు, యాపిల్స్, కిడ్నీ బీన్స్  సహా ఈ ప్రాంతంలోని అభివృద్ధి అవకాశాలన్నింటి గురించి తెలియచేశారు.  ఒక గ్రామం, ఒక ఉత్పత్తి పథకం కింద మలారి గ్రామంలో వులెన్  దుస్తులు తయారుచేస్తున్నట్టు సిడిఓ తెలిపారు. ఇక్కడ ఒక ఫ్రూట్  బార్, మార్కెటింగ్  కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఒక గెస్ట్  హౌస్  కూడా ఏర్పాటు కానున్నదని ఆయన తెలిపారు.

సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం, గ్రామీణ ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచడం; స్థానిక సంస్కృతి, సాంప్రదాయిక పరిజ్ఞానం, వారసత్వం ప్రోత్సహించడం ద్వారా పర్యాటక సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం;  సామాజిక సంఘాలు, సహకార సంస్థలు, ఎన్  జిఓల ద్వారా ఒక గ్రామం, ఒకే ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ సుస్థిర పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలను అభివృద్ధి పరచడం వైబ్రెంట్  విలేజ్ లక్ష్యమని చెప్పారు. గ్రామ పంచాయతీల సహకారంలో జిల్లా యంత్రాంగం వైబ్రెంట్  విలేజ్  కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు.  

ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యల గురించి చర్చించారు. మలారిలో ఆశా కార్యకర్తలను కూడా డాక్టర్ మాండవీయ కలిశారు. తమ పని గురించి కార్యకర్తలు కేంద్ర  ఆరోగ్య శాఖ మంత్రికి వివరించారు. ఆ తర్వాత డాక్టర్ మాండవీయ మలారిలో వైబ్రెంట్  విలేజ్  కార్యక్రమం కింద పని చేస్తున్న వివిధ శాఖల అధికారులతో సమావేశమై అభివృద్ధి పనుల గురించి సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు.

శుక్రవారం నాడు  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ;  రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్  మన్  సుఖ్  మాండవీయ రాష్ర్ట ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి డాక్టర్  ధమితో కలిసి  పలు ఆరోగ్య సంబంధి పథకాలకు శంకుస్థాపన చేశారు. డూన్  వైద్య కళాశాల కొత్త భవనంలో 500 పడకల ఆస్పత్రికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.

ఫొటో 1 : డెహ్రాడూన్ లోని జఖాన్ లో జన్ ఔషధి కేంద్ర ఆరోగ్య కార్యకర్తలతో సంభాషిస్తున్నర కేంద్ర ఆరోగ్య మంత్రి

ఫొటో 2 : చమోలి జిల్లా మలారి గ్రామంలో కేంద్ర ఆరోగ్య మంత్రికి స్వాగతం

ఫొటో 3 : మలారి గ్రామంలో ప్రజలు, ఆశా కార్యకర్తలతో సంభాషిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి

ఫొటో 4 : మలారి గ్రామాన్ని వైబ్రెంట్  విలేజ్  గా తీర్చి దిద్దడంలో భాగంగా అమలు జరుగుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష

***


(Release ID: 1912547) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Punjabi