నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రికి ఫస్ట్ మర్చంట్ నేవీ ఫ్లాగ్ ను ధరింపజేయడం ద్వారా ప్రారంభమైన వారం రోజుల జాతీయ మారిటైం ఉత్సవాలు


ఈ ఉత్సవాలు పురస్కరించుకుని జెండాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధరించిన
కోట్ పై కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అతికించారు

Posted On: 30 MAR 2023 6:48PM by PIB Hyderabad

ఏప్రిల్ 5 నుండి వారం రోజుల పాటు జరిగే జాతీయ సముద్ర వేడుకలకు సన్నద్ధమవుతున్నందున, 'ఫస్ట్ మర్చంట్ నేవీ ఫ్లాగ్'ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధరించిన కోట్ పై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పిన్ చేశారు. ఈరోజు న్యూ ఢిల్లీలో పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ (ఎంఓపిఎస్డబ్ల్యూ) మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్ష్ పంత్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో  ప్రధానికి జ్ఞాపికను కూడా అందించారు.

 

 

30.03.2023 నుండి 05.04.2023 వరకు జాతీయ సముద్ర వారోత్సవాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం జరుపుకుంటున్న రోజు ప్రాముఖ్యతను గుర్తించడానికి నావికుల సేవలకు నివాళులర్పించడం జరుగుతుంది. మొదటి ఇండియన్ స్టీమ్‌షిప్ ముంబై కి చెందిన సింధియా స్టీమ్, నావిగేషన్ కంపెనీ మొదటి సారిగా అంతర్జాతీయ సముద్ర జలాలలోకి తన తొలి షిప్ ని 1919 లో ఇదే సమయంలో విడుదల చేసింది  “ఎస్ ఎస్ లాయల్టీ” ముంబై నుండి లండన్ కి తన తొలి సముద్రయానంలో అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించింది. అదే రోజున "జాతీయ సముద్రతీర దినోత్సవం"గా జరుపుకుంటున్నారు. 

ఈ సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన  నావికులు గ్లోబల్ సప్లై చైన్‌ని ఆపరేట్ చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ జాతీయ సముద్ర వారోత్సవాలలో బయట ప్రపంచానికి తెలియని మన సముద్ర యాన వీరులు ఈ సందర్బంగా తమ సేవలను గుర్తు చేసుకుంటారని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఈ వారం రోజుల వేడుకల ప్రారంభానికి గుర్తుగా దేశంలోని మొట్టమొదటి మర్చంట్ నేవీ జెండాను ధరించి ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వడం తమకు ఆనందం కలిగిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

ఎంఓపిఎస్డబ్ల్యూ నావికుల సేవలను, దానితో అనుసంధానించబడిన ఇతర వ్యక్తుల సేవలను గుర్తిస్తుంది.  సముద్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు అవార్డులను అందిస్తోంది:

1. సాగర్ సమ్మాన్ వరుణ అవార్డు: భారతీయ షిప్పింగ్ మరియు/లేదా అనుబంధ మారిటైమ్ పరిశ్రమలకు వారి నిరంతర, అత్యుత్తమ సహకారం కోసం వ్యక్తులను గుర్తించి గౌరవించడం కోసం వరుణ అవార్డు.

2. సాగర్ సమ్మాన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్: షిప్పింగ్ బిజినెస్, కమర్షియల్ ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ రంగాలలో ఇండియన్ షిప్పింగ్ లేదా ఇండియన్ మారిటైమ్ ఇండస్ట్రీస్‌లో సీనియర్ ఫంక్షనల్ స్థాయిలో వారి జీవితకాల అసాధారణమైన, విశిష్ట విజయాలు లేదా పనితీరు కోసం వ్యక్తులను గుర్తించి గౌరవించడం.

3. గ్యాలెంట్రీ సాగర్ సమ్మాన్ అవార్డు: భారతదేశంలో లేదా మర్చంట్ నేవీలో మర్చంట్ నేవీలో వారి శ్రేష్టమైన శౌర్య చర్యలకు గుర్తింపుగా భారతీయ నావికులకు (అధికారులతో సహా) గ్యాలంట్రీ ఎట్ సీ అవార్డు.

4. భారత నౌకాశ్రయ శిక్షణ సంస్థ, అత్యుత్తమ భారతీయ షిప్పింగ్ కంపెనీ, అత్యుత్తమ భారతీయ నౌకాదళం, అత్యుత్తమ విదేశీ ఉద్యోగి నావికుడు, అత్యుత్తమ భారతీయ నౌకాశ్రయం, అత్యుత్తమ భారతీయ టెర్మినల్‌ను గుర్తించి, గౌరవించడం.

జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా, 1వ మరియు 2వ ప్రపంచ యుద్ధాలలో సముద్రంలో తమ ప్రాణాలను అర్పించిన నావికుల స్మారక చిహ్నాలకు ప్రభుత్వం నివాళులు అర్పిస్తోంది. వారి శౌర్యాన్ని, త్యాగాన్ని దేశానికి విస్తృతంగా గుర్తుచేస్తుంది. జాతీయ సముద్ర దినోత్సవ వేడుకల కమిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ మారిటైమ్ డే/మర్చంట్ నేవీ ఫ్లాగ్ డే వేడుకల కోసం వివిధ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయం కోసం ముంబైలో కమిటీని ఏర్పాటు చేసారు. నేషనల్ మారిటైమ్ డే సెలబ్రేషన్స్ కమిటీ వ్యవహారాలను సెంట్రల్ కమిటీ నిర్వహిస్తుంది. 

కమిటీ ఓడ యజమానులు, నౌకర్లు, పోర్ట్ ట్రస్ట్‌లు, సముద్ర తీరం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మొదలైన వారి ప్రతినిధులతో కూడి ఉంటుంది. 

 

*******(Release ID: 1912458) Visitor Counter : 136