రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ః రూ. 1,700 కోట్ల విలువైన తర్వాతి తరం మారిటైం మొబైల్ కోస్టల్ బ్యాటరీలు (దీర్ఘ పరిధి) & బ్రహ్మోస్ క్షిపణుల కోసం బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందంపై సంతకం చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
30 MAR 2023 6:56PM by PIB Hyderabad
బై ఇండియా కేటగిరీ కింద ఆధునిక తరం మారిటైం మొబైల్ కోస్టల్ బ్యాటరీలు (దూరప్రాంత) (ఎన్‌జిఎంఎంసిబి (ఎల్ఆర్)లను, బ్రహ్మోస్ క్షిపణులను రూ. 2,700 కోట్ల తగిన ధరతో కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఎయిరోస్పస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఎపిఎల్)తో 30 మార్చి 2023న ఒప్పందంపై సంతకాలు చేసింది. ఎన్‌జిఎంఎంసిబిల అప్పగింత 2027 నుంచి ప్రారంభం కానుంది. ఈ వ్యవస్థలు సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులతో సన్నద్ధంగా ఉండటమే కాక, భారతీయ నావికాదళ బహుళ దిశాత్మక సముద్ర దాడి సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.
మెరుగుపరిచిన పరిధులతో కూడిన ఉపరితలం నుంచి ఉపరితల నూతన తరం క్షిపణులను రూపొందించేందుకు కీలకంగా దోహదం చేస్తున్న బిఎపిఎల్, భారత్, రష్యాల మధ్య జాయింట్ వెంచర్. ఈ ఒప్పందం దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో కీలకమైన ఆయుధ వ్యవస్థ, మందుగుండు సామాగ్రి దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు నాలుగు సంవత్సరాల కాలంలో 90.000 పనిదినాలతో ఉపాధిని సృష్టిస్తుంది. ఎక్కువశాతం పరికరాలు, ఉప-వ్యవస్థలు దేశీయ తయారీ దారుల నుంచి లభిస్తుండడంతో, ఈ వ్యవస్థలు ఆత్మనిర్భర్ భారత్‌కు సగర్వమైన పతాకధారులుగా నిలుస్తాయి.
***
(Release ID: 1912349)
Visitor Counter : 183