మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

19 మార్చి, 2023న మొదటి లిటరసీ అండ్ న్యూమరాసీ అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహణ


పరీక్షకు హాజరైన 15 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యాసకులు

Posted On: 30 MAR 2023 4:45PM by PIB Hyderabad

నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్) కింద 19.03.2023న దేశంలోని 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షరాస్యుల ప్రాథమిక పఠనం, రాయడం మరియు సంఖ్యా నైపుణ్యాలను అంచనా వేయడానికి పరీక్ష నిర్వహించబడింది. టీచింగ్ లెర్నింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి పాఠశాలలు మరియు కళాశాలల యువత మరియు విద్యార్థులు స్వచ్ఛంద ఉపాధ్యాయులుగా పాల్గొన్నారు.

22.70 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యాసకులు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరాసీ అసెస్‌మెంట్ టెస్ట్ (ఎఫ్‌ఎల్ఎన్‌ఏటి) కార్యక్రమంలో పాల్గొన్నారు. తద్వారా వారు  అక్షరాస్యులుగా ప్రకటించబడతారు. 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల అక్షరాస్యులు కాని వారిలో 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు మరియు మహిళలు ఉన్నారు. వారు ఇప్పుడు పెన్ను పట్టుకోవడం గర్వంగా ఉంది. అభ్యాసకులు మూల్యాంకన పరీక్షలో హాజరు కావడానికి చాలా ప్రేరేపించబడ్డారు. మధ్యప్రదేశ్‌లో 5,35,000  లక్ష్యం నిర్దేశించుకోగా గరిష్టంగా 9,25,854 మంది (స్త్రీలు-5,91,421 పురుషులు-3,34,433) హాజరయ్యారు. మొత్తం 52 జిల్లాల్లో అసెస్‌మెంట్ పరీక్ష జరిగింది. స్పూర్తిదాయకమైన సంఘటనలో మధ్యప్రదేశ్‌లోని గిరిజన జిల్లా ఝబువాలో గరిష్టంగా 58470 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యారు. నవాపాడా గ్రామానికి చెందిన నీలేస్ అనే వ్యక్తి తన పెళ్లి ఊరేగింపును ఆపివేసి మూల్యాంకన పరీక్షకు హాజరయ్యాడు.

రాజస్థాన్‌లో 5,48,352 మంది అభ్యాసకులు (మహిళలు 3,98,418 మరియు పురుషులు 1,49,934) అసెస్‌మెంట్ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల పాఠశాలల్లో మూల్యాంకన పరీక్ష నిర్వహించారు. తమిళనాడులో మొత్తం 38 జిల్లాల్లో పరీక్ష నిర్వహించబడింది. ఇందులో 5,28,416 మంది అభ్యాసకులు (మహిళలు 4,36,020, పురుషులు 92,371 మరియు) హాజరయ్యారు. 13 జిల్లాలకు చెందిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా పరీక్షకు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 75 జిల్లాల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ఏటీ జరిగింది.మొత్తం 1,46,055 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యారు.కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ పరిధిలోని లేహ్ మరియు కార్గిల్ జిల్లాల్లో 7,366 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యారు.

ఇక ఇతర రాష్ట్రాలైన ఒడిశాలో 44,702, జార్ఖండ్‌లో 48,691, పంజాబ్‌లో 10,013, మేఘాలయలో 3000 మరియు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో 2,596 మంది అభ్యాసకులు ఎఫ్‌ఎల్‌ఎన్ఏటీలో పాల్గొన్నారు.

నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం లేదా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది 2022-27 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయడానికి భారత ప్రభుత్వంచే ఆమోదించబడిన కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకం జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 యొక్క సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ఈ పథకం దేశంలోని 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల అక్షరాస్యులు కాని వారందరినీ లక్ష్యంగా చేసుకుంటుంది, మహిళలు మరియు విద్యాపరంగా వెనుకబడిన రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది ఐదు భాగాలను కలిగి ఉంది, అవి; i) పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం, ii) క్రిటికల్ లైఫ్ స్కిల్స్, iii) ప్రాథమిక విద్య, iv) వృత్తి నైపుణ్యాలు, (v) నిరంతర విద్య. వాలంటీర్ టీచర్ల ద్వారా ఈ పథకం అమలవుతోంది.ఎన్‌వైకెస్‌ వాలంటీర్లు, కమ్యూనిటీ, పాఠశాలల విద్యార్థులు మరియు ఉన్నత విద్యా సంస్థలు మరియు టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లు దేశంలో దాని ప్రభావవంతమైన అమలు కోసం బోధనా అభ్యాస కార్యకలాపాలలో పాల్గొంటాయి.

ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసి) జనవరి 27, 2023న దేశంలోని అన్ని కళాశాలల విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌లు మరియు ప్రిన్సిపాల్‌లకు జారీ చేసిన డి.ఓ.నెం 2-2/2023సిపిపి-II ఆదేశాల ప్రకారం విద్యార్థులు/ఉన్నత విద్యా సంస్థలు ఈ స్వచ్ఛంద కార్యకలాపానికి క్రెడిట్‌లు ఉండాలి మరియు ఉపాధ్యాయ శిక్షణా సంస్థల విద్యార్థులు ఎన్‌ఐఎల్‌పి కోసం తప్పనిసరిగా కోర్సు పనిని కలిగి ఉండాలని నిర్దేశించింది.

ఎన్‌సిఈఆర్‌టికి చెంది దీక్షా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో స్థానిక భాషలలో నేర్చుకునే కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యాసకులు ప్రోత్సహించబడ్డారు.యూడీఐఎస్‌ఈ కింద నమోదైన ప్రభుత్వ/సహాయక పాఠశాలలు ఈ పథకం అమలు యూనిట్లు.ఎన్‌ఐఓఎస్ సహకారంతో ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరాసీ అసెస్‌మెంట్ టెస్ట్‌లను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించడం ద్వారా అభ్యాసకులకు సర్టిఫికేట్లను అందిస్తుంది.


 

*******



(Release ID: 1912301) Visitor Counter : 178