మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం పథకాలు
प्रविष्टि तिथि:
29 MAR 2023 5:04PM by PIB Hyderabad
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ పథకాల ద్వారా మైనారిటీలు, ప్రత్యేకించి సమాజంలోని ఆర్థికంగా బలహీనమైన, తక్కువ ప్రాధాన్యత కలిగిన వర్గాలతో సహా ప్రతి వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. నోటిఫై చేసిన ఆరు మైనారిటీ కమ్యూనిటీల సామాజిక-ఆర్థిక, విద్యా సాధికారత కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా వివిధ పథకాలను అమలు చేస్తుంది. మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలు/కార్యక్రమాలు క్రింది విధంగా ఉన్నాయి:
(ఎ) విద్యా సాధికారత కార్యక్రమాలు
(1) ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం
(2) పోస్ట్-ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం
(3) మెరిట్-కమ్-మీన్స్ ఆధారిత స్కాలర్‌షిప్ పథకం
(బి) ఉపాథి, ఆర్థిక సాధికారత పథకాలు
(4) ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్ (పీఎంవికాస్)
(5) మైనారిటీలకు రాయితీ రుణాలు అందించడానికి నేషనల్ మైనారిటీ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్ఎండిఎఫ్సి )కి ఈక్విటీ
(సి) ప్రత్యేక పథకాలు
(6)జియో పార్సీ: భారతదేశంలో పార్సీల జనాభా క్షీణతను నియంత్రించే పథకం.
(7) క్వామీ వక్ఫ్ బోర్డ్ తారక్కియాతి పథకం (క్యూడబ్ల్యూబిటిఎస్), షహరీ వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన (ఎస్డబ్ల్యూఎస్వివై).
(డి) మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలు
(8) ప్రధానమంత్రి వికాస్ కార్యక్రమం (పీఎంజెవికె)
డీబీటీ విధానంలో లబ్ధిదారులకు నిధులు విడుదల చేసిన పథకాలలో గత మూడు సంవత్సరాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
| క్రమ సంఖ్య |
పథకం పేరు
|
మొత్తం విడుదలైన నిధులు (రూ.కోట్లలో )
|
|
1
|
ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం
|
4001.37
|
|
2
|
పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం
|
1353.45
|
|
3
|
మెరిట్-కమ్-మీన్స్ ఆధారిత స్కాలర్‌షిప్ పథకం
|
1027.74
|
|
4
|
మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ పథకం
|
247.50
|
|
5
|
పధో పరదేశ్ పథకం
|
56.77
|
|
6
|
నయా ఉడాన్
|
20.13
|
ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
****
(रिलीज़ आईडी: 1912139)
आगंतुक पटल : 183