ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌కు జపాన్ నుంచి 'అధికారిక అభివృద్ధి సాయం' (ఓడీఏ)

Posted On: 29 MAR 2023 12:00PM by PIB Hyderabad

సుమారు 98.612 బిలియన్ల జపానీస్‌ యెన్‌ (దాదాపు రూ.5,509 కోట్లు) వ్యయంతో పట్నా మెట్రో రైల్‌ నిర్మాణ ప్రాజెక్ట్ (I), 612 బిలియన్ల జపానీస్‌ యెన్‌ (సుమారు రూ.5,509 కోట్లు), 9.308 బిలియన్ల జపనీస్‌ యెన్‌లతో (సుమారు రూ.520 కోట్లు) పశ్చిమ బంగాల్‌లో అటవీ & జీవ వైవిధ్య పరిరక్షణ కోసం వాతావరణ మార్పుల అధ్యయన ప్రాజెక్ట్, 18.894 బిలియన్ల జపానీస్‌ యెన్‌లతో (సుమారు రూ.1,055.53 కోట్లు) రాజస్థాన్ నీటి రంగ జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్ (II) కోసం భారత ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ.రజత్ కుమార్ మిశ్రా, భారతదేశంలో జపాన్ రాయబారి సుజుకి హిరోషి మధ్య ఈ రోజు ఒప్పందం జరిగింది.

కొత్త మెట్రో కారిడార్ 1 & 2ను నిర్మించడం ద్వారా పాట్నాలో వాహన రద్దీ పెరుగుదలకు పరిష్కారం చూపడం పట్నా మెట్రో రైల్‌ నిర్మాణ ప్రాజెక్ట్ లక్ష్యం. తద్వారా, పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేయడం, వాతావరణ మార్పులను నియంత్రించడానికి ఇది దోహదపడుతుంది.

రాష్ట్రంలో వాతావరణ మార్పులను నియంత్రించడం, పర్యావరణ వ్యవస్థ ఆధారిత వాతావరణ మార్పుల చర్యలు, జీవవైవిధ్య పరిరక్షణ & పునరుద్ధరణ, జీవనోపాధి మెరుగుదల కార్యకలాపాలు, సంస్థాగతంగా బలోపేతం చేస్తూ పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడం & పునరుద్ధరించడం, తద్వారా స్థిరమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడడం పశ్చిమ బెంగాల్‌లో వాతావరణ మార్పుల కోసం అటవీ & జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాజెక్ట్ ఉద్దేశం.

రాజస్థాన్ నీటి రంగ జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతోపాటు రాష్ట్రంలో వ్యవసాయం, నీటిపారుదల రంగంలో  స్త్రీ, పురుష రైతుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. నీటి వినియోగ సామర్థ్యం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా, ప్రస్తుతం ఉన్న నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా, స్త్రీ & పురుష రైతుల భాగస్వామ్యం ఆధారంగా వ్యవసాయ మద్దతు సేవలను అందించడం ద్వారా రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్‌ తోడ్పడుతుంది. ఇది, ఈ ప్రాజెక్ట్ కోసం రెండో విడత రుణం.

ద్వైపాక్షిక సహకారంలో భారతదేశం, జపాన్ 1958 నుంచి సుదీర్ఘమైన, ఫలవంతమైన చరిత్రను కలిగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో భారత్‌-జపాన్ మధ్య ఆర్థిక సహకారం వృద్ధి చెందుతోంది. ఇది, భారత్‌-జపాన్ మధ్య వ్యూహాత్మక, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది, బలోపేతం చేస్తుంది.

 

****



(Release ID: 1912053) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi