వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఐఎస్‌ఐ గుర్తు లేని బొమ్మల కోసం 114 సోదా & స్వాధీనత ఆపరేషన్లు
బీఐఎస్ ప్రామాణిక ముద్రను దుర్వినియోగం చేసిన రెండు సంస్థల నుంచి 4178 బొమ్మలు సహా 2021-2023లో 41,489 బొమ్మలు స్వాధీనం
Posted On:
29 MAR 2023 5:02PM by PIB Hyderabad
కేంద్ర వినియోగదార్ల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధాన రూపంలో ఈ సమాచారాన్ని అందించారు. బొమ్మల నాణ్యత నియంత్రణ ఆదేశం 2020 అమల్లో భాగంగా, ఐఎస్‌ఐ గుర్తు లేని బొమ్మల విక్రయాలను అరికట్టడానికి 114 సోదా & స్వాధీనత ఆపరేషన్లు నిర్వహించారు. దీనిద్వారా, 2021-22 సంవత్సరంలో మొత్తం 41,489 బొమ్మలు స్వాధీనం చేసుకున్నారు. 2022-2023 (23-03-2023 వరకు) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రామాణిక ముద్రను దుర్వినియోగం చేసినందుకు రెండు సంస్థల నుంచి 4178 బొమ్మలు స్వాధీనం చేసుకున్నారు.
బీఐఎస్ చట్టం 2016లోని సెక్షన్ 16 ప్రకారం కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ (డిపార్ట్‌మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) జారీ చేసిన బొమ్మల (నాణ్యత నియంత్రణ) ఆదేశం 2020 ప్రకారం 1 జనవరి 2021 నుంచి బొమ్మల భద్రత తప్పనిసరి. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా బొమ్మలు ఉండటం, బీఐఎస్ నిబంధనలు 2018లోని షెడ్యూల్ -IIలోని స్కీమ్-I ప్రకారం, బీఐఎస్ లైసెన్స్‌ను నిర్ధరించే బీఐఎస్ ప్రామాణిక ముద్రను కలిగి ఉండటం తప్పనిసరి.
నాణ్యత నియంత్రణ ఆదేశం, బీఐఎస్ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం, ఐఎస్‌ఐ గుర్తు లేని బొమ్మలను తయారు చేయడం, దిగుమతి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం, అద్దెకు లేదా లీజుకు ఇవ్వడం, నిల్వ చేయడం, అమ్మకానికి ప్రదర్శించడం వంటివి ఏ వ్యక్తి చేయకూడదు. బీఐఎస్ ఉత్పత్తి ధృవీకరణ పథకం, అంటే బీఐఎస్ నిబంధనలు 2018లోని షెడ్యూల్–IIలోని స్కీమ్-I కింద, సంబంధిత భారతీయ ప్రమాణాల ప్రకారం ఉత్పత్తిపై ప్రామాణిక గుర్తును ఉపయోగించడానికి తయారీ కేంద్రాలకు అనుమతి మంజూరు అవుతుంది. దీని ప్రకారం, భారతదేశానికి బొమ్మలను ఎగుమతి చేసే విదేశీ తయారీ కేంద్రాలు సహా బొమ్మల తయారీ కర్మాగారాలు ఆయా ఉత్పత్తుల భద్రత కోసం బీఐఎస్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది.
కర్మాగారాల్లో, మార్కెట్‌లోనూ బీఐఎస్ నిఘా ఉంటుంది. ఈ కార్యక్రమం కింద, వినియోగదార్లకు అందుబాటులో ఉన్న ఐఎస్‌ఐ గుర్తు ఉన్న బొమ్మలు సురక్షితం, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధరించడానికి ఆయా బొమ్మల నమూనాలను కర్మాగారాలు, మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకుని పరీక్ష కేంద్రాల్లో ల్యాబ్‌లలో పరీక్షిస్తుంది.
*****
(Release ID: 1912050)