మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్’ ప్రారంభం
- 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల 5.00 కోట్ల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా కార్యక్రమం
Posted On:
29 MAR 2023 4:43PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రారంభించింది, 2022-23 మొదలు కొని 2026-27 వరకు ఐదేండ్ల కాలం అమలు పరిచేలా “న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్” (ఎన్.ఎల్.పి.) ప్రారంభించింది.
మొత్తం రూ.1037.90 కోట్ల ఆర్థిక వ్యయంతో దీనిని అమలు చేయనున్నారు. ఇందులో కేంద్ర వాటా రూ. 700 కోట్లు. మరో రూ.337.90 కోట్లు రాష్ట్రాల వాటాగా దీనిని అమలు చేయనున్నారు. 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల 5.00 కోట్ల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు వీలుగా దీనిని అమలు చేయడం ఎన్.ఎల్.పి లక్ష్యం. ఈ పథకంలో ఐదు భాగాలు ఉన్నాయి: (i) ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం, (ii) క్లిష్టమైన జీవన నైపుణ్యాలు, (iii) వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, (iv) ప్రాథమిక విద్య మరియు (v) నిరంతర విద్య. ఈ పథకం లబ్ధిదారులను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోని సర్వేయర్లు మొబైల్ యాప్‌లో ఇంటింటికి సర్వే చేసి గుర్తిస్తారు. అక్షరాస్యులు కాని వారు మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా నేరుగా నమోదు చేసుకోవడం ద్వారా కూడా పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం ప్రధానంగా బోధన మరియు అభ్యాసం కోసం స్వచ్ఛంద సేవపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రయోజనం కోసం వాలంటీర్లు మొబైల్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రధానంగా ఆన్‌లైన్ మోడ్ ద్వారా అమలు చేయబడుతుంది. బోధనా అభ్యాస సామగ్రి మరియు వనరులు ఎన్.సి.ఇ.ఆర్.టి యొక్క దీక్షా ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. మొబైల్-యాప్‌ల ద్వారా వీటిని యాక్సెస్ చేయవచ్చు. ఇంకా, టీవీ, రేడియో, సామాజిక చేత్నా కేంద్రం మొదలైన ఇతర మోడ్‌లు కూడా ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం యొక్క వ్యాప్తికి ఉపయోగించబడతాయి. 15 ఏళ్లు పైబడిన అక్షరాస్యులు కాని వారందరూ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమాచారాన్ని విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతిఅన్నపూర్ణా దేవి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1912043)