రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలో 11 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు
భారతీయ రైల్వేని ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు - శ్రీ అశ్వని వైష్ణవ్
Posted On:
29 MAR 2023 4:26PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలో 2023 ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి మొత్తం 11,75,925 మంది ఉద్యోగులు ఉన్నారు.
భారతీయ రైల్వేని ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు. అయితే, ట్రాక్, రోలింగ్ స్టాక్ తయారీ, ప్రయాణీకుల సరుకు రవాణా సేవలను వేగంగా అభివృద్ధి చేయడం, పూర్తి చేయడం కోసం, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి) కి చెందిన వివిధ పథకాల కింద నెట్‌వర్క్ విస్తరణ, లోకోమోటివ్ ఫ్యాక్టరీల ఏర్పాటు, రైల్వే వ్యాగన్ల ఇండక్షన్, స్టేషన్ అభివృద్ధి, సరకు రవాణా టెర్మినల్స్ నిర్మాణం వంటి వివిధ ప్రాంతాల్లో వాటాదారులు, వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అదేవిధంగా, స్టేషన్ శుభ్రం చేయడం, చెల్లించి, ఉపయోగించుకునే మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, వాహనాల పార్కింగు, ఆస్తుల నిర్వహణ మొదలైన కొన్ని సేవలను మెరుగుపరచడం కోసం అవసరం మేరకు అవుట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించడం జరుగుతోంది.
ప్రస్తుతం, భారతీయ రైల్వే నిర్వహిస్తున్న ఏ రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసులను ప్రైవేట్ రంగం ద్వారా నిర్వహించడం లేదు.
రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1912037)
Visitor Counter : 130