గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2023 మార్చి 27న సమావేశమైన సలహా సంప్రదింపుల కమిటీ
Posted On:
28 MAR 2023 5:05PM by PIB Hyderabad
దేశంలో 97 శాతం వార్డులలో ఇంటింటిటికి తిరిగి చెత్త సేకరించే వ్యవస్థ ఉందని, మొత్తం వ్యర్థాలలో 75 శాతం వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నారని, కేంద్ర
గృహ , పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు. 90 శాతం వార్డులలో మూలంలోనే చెత్తను వేరు చేస్తున్నారని తెలిపారు.
స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రారంభించినపుడు కంపోస్టింగ్, బయో మీథేన్, ఆర్.డి.ఎఫ్, వ్యర్థాలనుంచి ఇంధన తయారీ ప్లాంట్ల సామర్ధ్యం
రోజుకు 95 లక్షల టన్నులు (అంటే రోజుకు 26,027 టన్నులు) గా ఉండేదని తెలిపారు.గడచిన 8 సంవత్సరాలలో ఇది గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం వ్యర్థాలనుంచి ఇంధన తయారీ కానీ ,
వ్యర్థాల నుంచి కంపోస్టు ప్లాంటులకు చేరుతున్నది కానీ సుమారు 1 లక్ష టిపిడిలు. (ఇందులో సిఅండ్ డి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లుకూడా కలసి ఉన్నాయి.)
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు అనుబంధంగా ఉన్న సంప్రదింపుల కమిటీ సమావేశంలో సభ్యులనుద్దేసించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
శ్రీ కౌశల్ కిషోర్ , ఎం.ఒ.హెచ్ యుఎ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, ఢిల్లీ ఎన్సిటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నరేష్ కుమార్, డిడిఎ కమిషనర్, ఎం.సి.డి కమిషనర్, ఎస్బిఎం నుంచి ఇతర ఎం.ఒ.హెచ్ యు ఎ నుంచి ఇతర
సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ రమేష్ బిధూరి, డాక్టర్ కల్పనా సైనీ, తిరు ఎ.కెపి.చిన్రాజ్ శ్రీ పర్వేష్ సాహిబ్ సింగ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీహర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ఇప్పటివరకు 2,285 వేస్ట్ టు కంపోస్ట్ సెంట్రలైజ్డ్ ప్లాంట్లు , రోజుకు 71,682 టన్నుల వ్యర్థాలను కంపోస్టు చేస్తున్నాయని, మరో 73 ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వీటి ఇన్‌పుట్ సామర్ధ్యం రోజుకు సుమారు 1,084 టన్నులు. మనకు 124 వేస్ట్ టు ఎనర్జీ (వేస్ట్‌టు ఎలక్ట్రిసిటీ, బయో గ్యాస్, బయో మీథనేషన్)ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఇన్‌పుట్ సామర్ధ్యం రోజుకు 5,296 టన్నులు. మరో 8ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటి ప్రాసెసింగ్ సామర్ధ్యం 2,788 టిపిడి వ్యర్థాలు. మనకు 2,028 ఫంక్షనల్ మెటీరియల్ రికవరీ వ్యవస్థలు (ఎం.ఆర్.ఎఫ్‌లు) ఉన్నాయి. వీటి ప్రాసెసింగ్ సామర్ధ్యం రోజుకు 42,478 టన్నులు. మరో 129 ఎంఆర్‌ఎఫ్‌లు నిర్మాణంలో ఉన్నాయి. మనకు 24 ప్రత్యేక ఆర్.డి.ఎఫ్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి సామర్ధ్యం రోజుకు 12,430 టన్నులు. రాష్ట్రాలు, నగరాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుం 387 ఫంక్షనల్ సిఅండ్ డి ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఇన్‌పుట్ కెపాసిటీ రోజుకు 14,786 టన్నులు. మరో ఏడు ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటి ఇన్‌పుట్ కెపాసిటీ రోజుకు 107టన్నులు.స్వచ్చభారత్ మిషన్ అర్బన్, ఎస్‌బిఎం 2.0పై తన ప్రజెంటేషన్ ఇస్తూ, కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకుచెందిన జాయింట్ సెక్రటరీ శ్రీ మతి రూపా మిశ్రా, ఈ సమావేశంలో మాట్లాడుతూ, ఎస్.బి.ఎం యు 2.0 కింద, ఈ కార్యక్రమం అమలు అంచనా తలసరి వ్యయం 1,41,600కోట్ల రూపాయలని చెప్పారు. ఇందులో భారతప్రభుత్వ వాటా రూ 36,465 కోట్ల రూపాయలు.మిగిలిన మొత్తాన్ని వ్యక్తులు లబ్దిదారుల వాటా కింద చెల్లిస్తారన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థలు , ప్రైవేట్ రంగం పిపిపి కింద వ్యక్తిగత లబ్ధిదారుల తరఫున చెల్లిస్తాయన్నారు.ప్రైవేటు రంగం ఫండిరగ్ అందుబాటులో లేని చోట రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన నిధులు అందించాల్సి ఉంది. మిగిలిన నిధులను వివిధ ఇతర మార్గాల ద్వారా, అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్) నిధుల నుంచి , పబ్లిక్, ప్రైవేటు రంగం నుంచి, విదేశీ సహాయం నుంచి సమకూర్చుకుంటారు.
2026 లో ఈ కార్యక్రమం పూర్తయ్యేనాటికి కింది లక్ష్యాలను సాధించడం జరుగుతుందని సబ్యులకు వివరించారు.
` అన్ని పట్టణాలు కనీసం ఒడిఎఫ్ ప్లస్‌గా మారుతాయి.
`లక్ష కన్న తక్కువ జనాభా గల అన్ని చట్టబద్ధ పట్టణాలు కనీసం ఒడిఎఫ్ ప్లస్, ప్లస్‌గామారుతాయి.
`లక్ష కన్నతక్కువ జనాభాగల చట్టబద్ధ పట్టణాలలో కనీసం 50 శాతం పట్టణాలు వాటర్ ప్లస్‌గా రూపుదిద్దుకుంటాయి.
`అన్ని చట్టబద్ధ పట్టణాలు కనీసం 3స్టార్ గుర్తుతో చెత్త రహిత పట్టణాలుగా లేదా అంతకంటే ఎక్కువ స్థాయి గుర్తింపును పొందుతాయి.
`ఎస్‌బిఎం `అర్బన్‌కింద , స్థూలంగా నిధుల అందజేత కింది విధంగా ఉంటుంది.
ఇళ్లలో టాయిలెట్లకు , అంటే మామూలు ఇన్‌శానిటరీ లెట్రిన్లను, ఫ్లష్ టాయిలెట్లుగా మార్చేందుకు , ఒక్కొక్క టాయిలెట్‌కు రూ4000 వంతున,ఈశాన్యరాష్ట్రాలు, కొండ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాలలో చెల్లిస్తారు. ఈశాన్య, కొండ ప్రాంతాలలో ఈ మొత్తం పది వేల రూపాయలుగా ఉంటుంది.
`కమ్యూనిటీ టాయిలెట్లకు ( గరిష్ఠంగా 40 శాతం విజిఎఫ్)
`పబ్లిక్ టాయిలెట్లకు ( గరిష్ఠంగా 40 శాతం విజిఎఫ్)
`సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (గరిష్ఠంగా 35 శాతం విజిఎఫ్)
`ఐఇసి, ప్రజలకు అవగాహన (15 శాతం)
`సామర్ధ్యాల నిర్మాణం, పాలనాపరమైన, ఇతర ఖర్చులు (ఎఅండ్ ఒఇ) ( 5 శాతం)
` ఎస్‌బిఎం కింద ` అర్బన్ 2.0, ఉపయోగించిన నీటి యాజమాన్యానికి సంబంధించిన కాంపొనెంట్‌ను కూడా చేర్చారు. ఇందులో వృధా జలాలను సురక్షిత జలాలుగా శుభ్రపరచడం, ఎస్.బి.ఎం అర్బన్ 1.0 కు చెందిన ఇతర కాంపొనెంట్ లు ఉన్నాయి.
ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు ఢల్లీిలో జల వనరుల పునరుద్ధరణ గురించి, ఢల్లీిలో టాయిలెట్ల నిర్వహణ,తమిళనాడులో వ్యక్తిగత టాయిలెట్ల నిర్వహణ తదితర అంశాలను ప్రస్తావించారు.
కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ మాట్లాడుతూ, అర్బన్‌ప్లానింగ్ సంస్కరణల కింద కేటాయించే నిధులను పెంచినట్టు చెప్పారు. అలాగే విధానపరమైన అంశాలకు, స్వచ్ఛతా సంబంధిత అంశాలకు మరిన్న నిధులు అందుతాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఇవి మంచి ఫలితాలు ఇవ్వనున్నాయని ఆయన తెలిపారు.
ఇటీవల తీసుకున్న పలుచర్యల గురించి ప్రస్తావిస్తూ శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి, కేంద్ర గృహ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఐహెచ్‌హెచ్‌ఎల్ ల నిర్మాణానికి సంబంధించి మార్గదర్శకాలను మార్చిందని చెప్పారు. ఇందుకు సంబందించి కేంద్ర ప్రభుత్వ వాటా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్‌రాష్ట్రాలకు ఎస్.బి.ఎం గ్రామీణ్ కు అనుగుణంగా, యూనిట్ కు రూ 4,000 లనుంచి, రూ 10,800కు పెరిగిందన్నారు. ఎస్.బిఎం.మార్గదర్శకాలను సవరించి, పబ్లిక్ టాయిలెట్లు, మూత్రశాలలకు కూడా వర్తించేలా చేశారు. నిధుల మంజూరు కింద, కమ్యూనిటీ టాయిలెట్లకు నిధులు అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఏర్పాటుతోపాటు, కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ, పబ్లిక్‌టాయిలెట్ బ్లాకులనిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇందులో 40 శాతం గ్రాంటు, విజిఎఫ్‌గా ఒక్కొక్క, టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి అందజేస్తుంది. కేంద్ర గృహ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒడిఎఫ్ ప్రొటోకాల్‌ను ప్రవేశపెట్టింది. ఆయా పట్టణాలలో పూర్తిగా శానిటేషన్ సదుపాయాలు ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈప్రోటోకాల్‌లో, ఒడిఎఫ్ క్లెయిమ్‌లను స్వతంత్ర, థర్డ్‌పార్టీ చేత పరిశీలింపచేయనున్నారు. వారు ఒడిఎఫ్ సిటీలుగా సర్టిఫై చేస్తారు. ఈ సర్టిఫికేషన్ 12 నెలలు పనికి వస్తుంది. ఒడిఎఫ్ స్టేటస్ కొనసాగాలంటే, ఈ సిటీలు తిరిగి రీ సర్టిఫై చేయించుకోవలసి ఉంటుంది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒడిఎప్ ప్లస్, ఒడిఎఫ్ ప్లస్,ప్లస్‌లకు సంబంధించి ప్రొటోకాల్స్‌ను విడుదల చేసింది. సంపూర్ణ పారిశుధ్యం సాధన దిశగా వీటిని విడుదల చేశారు.
ఒడిఎఫ్ ప్లస్ ప్రోటోకాల్ కమ్యూనిటీ ఒఅండ్ ఎం, పబ్లిక్ టాయిలెట్లు, సిటి,పిటిల తగిన నిర్వహణ, వాటినిరంతర వినియోగం, వంటి అంశాలపై దృష్టిపెడుతుండగా, ఒడిఎఫ్ ప్లస్,ప్లస్ ప్రోటోకాల్స్, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండడం, మురుగునీరు బయటకు వదలకుండా ఉండడం, జలవనరులలోకి వ్యర్థాలు కలవకుండా చూడడం బహిరంగ జలవనరులను పరిశుభ్రంగా ఉండేలా చూడడం వంటి వాటిపై దృష్టిపెడుతుంది, ఇప్పటివరకు 3,547 పట్టనాలు ఒడిఎఫ్ ప్లస్‌గా సర్టిఫై అయ్యాయి. 1 వెయ్యి 191 పట్టణాలు ఒడిఎఫ్ ప్లస్ ప్లస్‌గా రూపుదిద్దుకున్నాయి. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, వాటర్ ప్లస్ ప్రొటోకాల్‌ను రూపొందించింది. దీని ప్రకారం గృహఅవసరాలకు వాడిన నీటిని, ఇంటి నుంచి విడుదలైన వాడిని నీటిని వాణిజ్య సంస్థలు ఉపయోగించిన నీటిని సేకరించి శుద్ధిచేసి. సంతృప్తికర స్థాయికి తీసుకువచ్చి వాటిని శుద్ధిచేసి తిరిగి పర్యావరణంలోకి , చేరేట్టుచేస్తారు. ఇప్పటివరకు 14 నగరాలు వాటర్ ప్లస్ గా గుర్తింపు పొందాయి
***
(Release ID: 1911907)
Visitor Counter : 121