నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పీఎం-కుసుమ్ నుండి దాదాపు 21 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు: కేంద్ర విద్యుత్, ఎన్ఆర్ఈ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్
Posted On:
28 MAR 2023 5:01PM by PIB Hyderabad
పీఎం-కుసుమ్ లో ఈ మూడు భాగాలు ఉంటాయి:
- కాంపోనెంట్ -ఏ : మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న సౌర విద్యుత్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం, రైతుల బంజరు/బీడు/గడ్డి/చెట్టు/సాగు భూమిపై ఒక్కొక్కటి 2 మెగావాట్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది.
- కాంపోనెంట్ -బి : 20 లక్షల స్వతంత్ర సోలార్ వాటర్ పంపుల ఏర్పాటు;
- కాంపోనెంట్ -సి: ఫీడర్ స్థాయి సోలారైజేషన్ ద్వారా ఇప్పటికే ఉన్న 15 లక్షల గ్రిడ్-కనెక్ట్ అగ్రికల్చర్ పంపుల సోలారైజేషన్.
2020 నవంబర్‌లో 30,800 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ పథకాన్ని విస్తరించారు.
28.02.2023 నాటికి, కాంపోనెంట్-ఎ కింద మొత్తం 89.45 మెగావాట్ల సామర్థ్యం ఏర్పాటుచేశారు. కాంపోనెంట్-బి, కాంపోనెంట్-సి కింద దాదాపు 2.09 లక్షల పంపులు ఇన్‌స్టాల్ /సోలారైజ్ చేసినట్లు నివేదించారు. ఇది దాదాపు 1,140 మెగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యంతో సమానం. రాజస్థాన్ రాష్ట్రంతో సహా పథకం కింద లబ్ధి పొందిన రైతుల రాష్ట్ర/యుటి వారీగా వివరాలు ఈ కింద అనుబంధంలో ఉన్నాయి..
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్) అమలు వేగంపై గణనీయంగా ప్రభావం పడింది. ఈ పథకం కింద ప్రాజెక్టుల అమలు కోసం రాష్ట్ర ఏజెన్సీలు గడువును పొడిగించాలని కోరాయి. కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) పథకం మూడవ పార్టీ మూల్యాంకనాన్ని కూడా నిర్వహించింది. సిఫార్సుల ఆధారంగా, పథకం 31.3.2026 వరకు పొడిగించడం జరిగింది.
ఎన్ఆర్ఈ ప్రతి వారం/పక్షంవారీ ప్రాతిపదికన రాష్ట్రాలతో నిరంతర సమావేశాల ద్వారా పథకం అమలును పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర అమలు సంస్థలు కూడా నెలవారీ ప్రాతిపదికన పురోగతి నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధానాలు పథకం సమర్థవంతమైన పర్యవేక్షణకు తోడ్పడతాయి.
రాష్ట్ర/యుటి వారీగా పీఎం-కుసుమ్ పథకం కింద లబ్ధిదారుల వివరాలు (28.02.2023 నాటికి):
క్రమ సంఖ్య |
రాష్ట్రం
|
లబ్ది పొందిన రైతుల సంఖ్య
|
1
|
అరుణాచల్ ప్రదేశ్
|
126
|
2
|
గుజరాత్
|
2132
|
3
|
హర్యానా
|
44325
|
4
|
హిమాచల్ ప్రదేశ్
|
534
|
5
|
జమ్మూ కాశ్మీర్
|
499
|
6
|
ఝార్ఖండ్
|
12107
|
7
|
కర్ణాటక
|
314
|
8
|
కేరళ
|
51
|
9
|
మధ్యప్రదేశ్
|
6790
|
10
|
మహారాష్ట్ర
|
47978
|
11
|
మణిపూర్
|
28
|
12
|
మేఘాలయ
|
35
|
13
|
ఒడిశా
|
1223
|
14
|
పంజాబ్
|
12459
|
15
|
రాజస్థాన్
|
57692
|
16
|
తమిళ నాడు
|
2751
|
17
|
త్రిపుర
|
1654
|
18
|
ఉత్తర ప్రదేశ్
|
17614
|
19
|
ఉత్తరాఖండ్
|
316
|
20
|
పశ్చిమ బెంగాల్
|
20
|
|
మొత్తం
|
208648
|
ఈ సమాచారాన్ని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ. ఆర్.కె. సింగ్ రాజ్యసభలో వెల్లడించారు
*******
(Release ID: 1911715)
Visitor Counter : 190