ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
లక్ష్యిత జిల్లాల్లో ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంపై తాజా సమాచారం
ఆరోగ్యం, పౌష్టికాహార సూచీలలో మెరుగుదలను చూపిన ఆకాంక్షిత జిల్లాలు
Posted On:
28 MAR 2023 4:57PM by PIB Hyderabad
ఎంపిక చేసిన జిల్లాల్లో సామాజిక ఆర్థిక సూచీల మెరుగుదల కోసం నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాల (ఎడి) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆరోగ్యం, పోషకాహార సూచీలకు సంబంధించి సాధారణంగా ఆకాంక్షత్మక జిల్లాలు అభివృద్ధిని కనబరిచాయి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించిన వార్షిక కార్యక్రమలు అమలు ప్రణాళిక (ఎపిఐపి) ఆధారంగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) కింద ఆరోగ్యసంరక్షణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం (ఎంఒహెచ్ఎఫ్‌డబ్ల్యు) మంత్రిత్వ శాఖ పలు పథకాలు/ చొరవలను అమలులో తోడ్పాటును అందిస్తుంది.
నీతీ అయోగ్ ఇచ్చిన సమాచారం మేరకు, ఎడి (ఆకాంక్షిత జిల్లాల) కార్యక్రమం అన్నది ఉనికిలో ఉన్న పథకాల కేంద్రీకరణ పై ఆధారపడి ఉంటుంది. పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి, క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడం తమ స్వంత నిధుల ఏర్పాటు ఉన్న పథకాలకు సవాళ్ళ మార్గం ద్వారా నీతి ఆయోగ్ అదనపు నిధులను సమకూరుస్తుంది. నెలవారీ పురోగతి ఆధారంగా, గుర్తించిన ఐదురంగాలలో ప్రతి ఒక్కదానిలోనూ, మొత్తంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న జిల్లాల ప్రతి నెలా జిల్లాలను మూల్యాంకనం చేస్తుంది. మొత్తంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న మొదటి, రెండవ ర్యాంకర్లకు రూ. 10 కోట్లను, రూ. 5 కోట్లను అందిస్తుంది. ఆరోగ్యం, పౌష్టికాహార రంగం సహా ఎడిలలో చేపట్టిన ఐదు రంగాలలో ప్రతిదానిలోనూ తొలి ర్యాంకర్ అయినవారికి ఒక్కొక్కదానికీ రూ. 3 కోట్లను ప్రదానం చేస్తుంది. దేశంలో ఆకాంక్షిత జిల్లాల ఎంపికలో ఆరోగ్యం & పౌష్టికాహారానికి 30% వరకు ప్రధానంగా ప్రాముఖ్యతను ఇస్తుంది.
కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ విషయాన్ని మంగళవారం రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1911647)
Visitor Counter : 155