పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

గాంధీనగర్ లో జరిగిన రెండవ ఎన్విరాన్ మెంట్ క్లైమేట్ సస్టెయినబిలిటీ వర్కింగ్ గ్రూప్ (ఇసిఎస్ డబ్ల్యుజి) సమావేశంలో సమ్మిళిత, కార్యాచరణ ఆధారిత ఫలితాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి, గుర్తించిన ప్రాధాన్యతలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించిన జి 20 ప్రతినిధులు


నాణ్యత , పరిమాణం పరంగా తగినంత నీటి కేటాయింపులను నిర్ధారించడానికి నీటి వనరుల సంరక్షణ , సుస్థిర అభివృద్ధి కీలక పాత్రను గుర్తించడానికి సమగ్ర విధానం అవసరం

Posted On: 28 MAR 2023 4:56PM by PIB Hyderabad

గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న రెండవ ఎన్విరాన్ మెంట్ అండ్ క్లైమేట్ సస్టెయినబిలిటీ వర్కింగ్ గ్రూప్ (ఈసీఎస్ డబ్ల్యూజీ) సమావేశం రెండో రోజు  భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రిచా శర్మ ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సమ్మిళిత, ఏకాభిప్రాయ ఆధారిత విధానం, చర్యలతో జీ20 దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

మొదటి ఇ సి ఎస్ డబ్ల్యూ జి

సమావేశం , రెండు వర్కింగ్ గ్రూపు సమావేశాల మధ్య మూడు థీమ్ ప్రాధాన్యాలపై ఫోకస్ గ్రూప్ చర్చల్లో చురుకుగా పాల్గొన్నందుకు ఆమె ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

బ్రెజిల్ కు జి 20 అధ్యక్ష పీఠాన్ని అప్పగించే ముందు బలమైన పునాదిని నిర్మించడానికి స్పష్టమైన ఫలితాలను సులభతరం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు.

 

గత ప్రెసిడెన్సీల పనితీరును, 1వ ఇసిఎస్ డబ్ల్యుజి సందర్భంగా మూడు ప్రాధాన్యాలపై జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, సాంకేతిక సెషన్ ల సమయంలో ఇన్ పుట్ లను తీసుకోవలసిన ప్రాముఖ్యతను శ్రీమతి శర్మ ప్రముఖంగా వివరించారు. ఇది ప్రతి ప్రాధాన్యతకు ఫలితాలను రూపొందించడంలో దోహదపడుతుంది.

ప్రతినిధులందరూ స్థిరంగా, ఉత్సాహంగా పాల్గొనడం ముసాయిదా ప్రకటనను ఖరారు చేసే ప్రక్రియను ఎంతగానో సులభతరం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. జి 20 భారత ప్రెసిడెన్సీ నుండి ఆశించిన ఫలితాలపై కో-చైర్ చేసిన వ్యాఖ్యలకు ట్రోయికా (ఇండోనేషియా, బ్రెజిల్) ప్రతినిధులు మద్దతు పలికారు.

 

అనంతరం జల వనరుల నిర్వహణపై జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన తొలి టెక్నికల్ సెషన్ జరిగింది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని, వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, పెరుగుతున్న నీటి డిమాండ్ వంటి ప్రపంచ నీటి సవాళ్లను కూడా ఈ సెషన్ లో చేసిన ప్రజెంటేషన్లు వివరించాయి. కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, గంగానది పరిరక్షణ, పునరుజ్జీవనం, వాతావరణ స్థితిస్థాపక మౌలిక సదుపాయాలు - నీటి నిల్వ/ ఆనకట్ట పునరావాసం ,మెరుగుదల ప్రాజెక్టు (డ్రిప్), భాగస్వామ్య భూగర్భ జల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ - 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు సురక్షితమైన , తగినంత తాగునీటిని అందించే ప్రాజెక్టు అయిన నమామి గంగే , స్వచ్ఛ భారత్ - నీటి  పరిశుభ్రత, పారిశుధ్యం సార్వజనీనీకరణ -  దాని ప్రభావాలపై ప్రాజెక్ట్ లపై

ధిమాటిక్ ప్రజెంటేషన్ లు ఇచ్చారు. ఆందోళనకర స్థాయిలో క్షీణిస్తున్న భూగర్భ జలాల సమస్యను పరిష్కరించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం అవసరమని ఈ ప్రజెంటేషన్లు మరింత ధృవీకరించాయి. ఈ అంశం పై జి 20 దేశాలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి- పాల్గొన్నవారి నుండి కొన్ని కీలక సూచనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

*జల్ జీవన్ మిషన్ , ఇతర భారతీయ జోక్యాలు చాలా ప్రశంసించబడ్డాయి.

 

*సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ (డబ్ల్యుఆర్ఎమ్) లో సాధ్యమైన అన్ని స్థాయిలలో సహకారం పాత్ర కీలకం.

 

*నీరు ,భూగర్భజలాలపై ఉమ్మడి అవగాహన ,డబ్ల్యుఆర్ఎమ్ అమలులో సుస్థిర అభివృద్ధి సూత్రాలను సమ్మిళితం చేయడం కీలకం.

 

*ఇండోనేషియా 2024లో వరల్డ్ వాటర్ ఫోరమ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. నీటి సహకారానికి ఇండోనేషియా ప్రాముఖ్యతను వివరించారు.

 

*నీటి వనరుల సంరక్షణ ,సుస్థిర అభివృద్ధి కీలక పాత్రను గుర్తించడానికి, నాణ్యత, పరిమాణం పరంగా తగినంత నీటి కేటాయింపులను నిర్ధారించడానికి సమగ్ర విధానం అవసరం.

 

*నీటి పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షించడం ,మదింపు చేయడంలో జోక్యం ముఖ్యమైనది.

 

*డబ్లూ ఆర్ ఎం లో వ్యూహాల నియంత్రణ, అమలుకు బలమైన చట్టపరమైన,విధాన సాధనాలు అవసరం.

 

*విజయవంతమైన డబ్లూ ఆర్ ఎం కోసం సాంకేతికత, సహకారం ,ఉమ్మడి పరిశోధన కీలకం.

 

*కీలకమైన పర్యావరణ వ్యవస్థకు రక్షణ చర్యలను ప్రోత్సహించవచ్చు.

నీటిపై మానవ హక్కు, మంచి పారిశుధ్యం, పరిశుభ్రమైన నీటి అందుబాటు, నీటిని వనరుగా కవర్ చేసే గ్రీన్ రికవరీ ప్రణాళికలు మొదలైన డబ్లూ ఆర్ ఎం  చర్యలను అమలు చేయడంలో కమ్యూనిటీల పాత్ర కీలకం.

 

*సుస్థిర జాతీయ నీటి వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.

 

రెండో టెక్నికల్ సెషన్ లో భూ పునరుద్ధరణ, ఈ అంశంపై ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై దృష్టి సారించారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ బివాష్ రంజన్ సెషన్ ప్రారంభోపన్యాసంలో, 1వ ఇసిఎస్ డబ్ల్యుజి చర్చల నుండి సేకరించిన కీలక సమాచారం, కేంద్రీకృత సమూహ చర్చలు ,సభ్య దేశాలు పంచుకున్న రాతపూర్వక ఇన్ పుట్ లను వివరించారు. ఈ అంశంపై చర్చలు సహకార, ఏకాభిప్రాయంతో నడిచే విధానానికి అనుకూలంగా ఉన్నాయి, భారత ప్రెసిడెన్సీలో ప్రతిపాదిత ఫలితాల అభివృద్ధిలో కీలకమైన ఇన్‌పుట్‌లు ఎలా పొందుపరచబడుతున్నాయి అనే దానిపై నిర్దేశించబడ్డాయి. అంతేకాక, ప్రెసిడెన్సీ ప్రతిపాదించిన ఫలితాలను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్య దేశాల నిర్మాణాత్మక ఇన్పుట్ లను ,క్రియాశీలక భాగస్వామ్యాన్ని శ్రీ బివాష్ రంజన్ ప్రశంసించారు. ఈ సెషన్ లో భారతదేశ ప్రెసిడెన్సీ కింద గుర్తించిన రెండు ప్రాధాన్య అంశాలపై ప్రతినిధులు చర్చించారు, అవి అటవీ మంటల ప్రభావిత ప్రాంతాలు, మైనింగ్ ప్రభావిత ప్రాంతాలు.

 

యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్  (యుఎన్ సిసిడి), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసిఎఫ్ ఆర్ ఇ) వంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిపుణులు వాతావరణ మార్పుల ఉపశమనం ,అనుసరణ చర్యలకు సంబంధించి భూ పునరుద్ధరణపై ప్రతిపాదిత గాంధీనగర్ ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ (జిఐఆర్) పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా ఉత్తమ పద్ధతులు , విజ్ఞాన భాగస్వామ్య వేదిక అభివృద్ధి సంకలనంగా ముసాయిదా ప్రచురణలను ప్రతిపాదించారు. 

 

రిసోర్స్ ఎఫిషియెన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ప్రాధాన్యత కింద గుర్తించిన నాలుగు సబ్ థీమ్ లపై ప్రజెంటేషన్లు, ముసాయిదా జీ20 డాక్యుమెంట్ల విడుదలతో రిసోర్స్ ఎఫిషియెన్సీ, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడంపై టెక్నికల్ సెషన్ తో రెండో అర్ధభాగం ప్రారంభమైంది.  ఉక్కు రంగంలో సర్క్యులర్ ఎకానమీలో జి 20 నాలెడ్జ్ ఎక్స్ఛేంజీలు, సర్క్యులర్ ఎకానమీ, సర్క్యులర్ బయో ఎకానమీ కోసం

ఎక్స్ టెన్డెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఇపిఆర్), ప్రతిపాదిత జి 20 రిసోర్స్ ఎఫిషియెన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీ కూటమి అనే నాలుగు  సబ్ థీమ్ లపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. జీ20 ఈసీఎస్ డబ్ల్యూజీ సమావేశాలతో పాటు జీ20 రిసోర్స్ ఎఫిషియెన్సీ డైలాగ్ లోనూ చర్చనీయాంశమైన సహజ వనరులను సమర్థవంతంగా, సుస్థిరంగా వినియోగించుకునేందుకు భారత్ జీ20 ప్రెసిడెన్సీ కట్టుబడి ఉందని ఈ సెషన్ సహ చైర్మన్ శ్రీ నరేష్ పాల్ గంగ్వార్ పునరుద్ఘాటించారు. జి 20 దేశాల ప్రతినిధులు , ఇతర భాగస్వాములు ప్రతి ఉప అంశంపై చర్చించారు.  ఏకాభిప్రాయాన్ని నిర్మించే దిశగా సమ్మిళిత విధానాన్ని అవలంబించినందుకు సభ్య దేశాలతో భారతదేశంl చురుకైన భాగస్వామ్యం నిమగ్నతను ప్రశంసించారు.

 

ఉదయం యోగా సెషన్ లో ప్రతినిధులు పాల్గొన్నారు.

 

వనరుల సుస్థిర వినియోగం , పర్యావరణం మొత్తం ప్రయోజనం కోసం భవిష్యత్తు అధ్యక్షులు ముందుకు తీసుకెళ్లగల స్పష్టమైన ఫలితాల దిశగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి జి 20 ను ఒక వేదికగా ఉపయోగించాలన్న ఉత్సాహభరిత విశ్వాసంతో కూడిన మీడియా ఇంటరాక్షన్ తో సమావేశాల రెండవ రోజు ముగిసింది.

 

*******



(Release ID: 1911645) Visitor Counter : 170