నీతి ఆయోగ్

సిక్కింలోని గాంగ్‌టక్‌లో విజయవంతంగా ముగిసిన స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ 2వ సమావేశం

Posted On: 28 MAR 2023 4:39PM by PIB Hyderabad

కొత్తగా ఏర్పాటైన స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్  2వ సమావేశం సిక్కింలోని గాంగ్‌టక్‌లో 2023 మార్చి 18,19 తేదీల్లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా  స్టార్టప్ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులతో చర్చలు జరిపి స్టార్టప్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సమస్యల పరిష్కారానికి అమలు చేయాల్సిన చర్యలను జీ-20 దేశాల నాయకులకు స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ అందజేస్తుంది. రెండురోజుల పాటు  సిక్కింలోని గాంగ్‌టక్‌లో జరిగిన సమావేశంలో జీ-20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలకు చెందిన దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యుల ప్రసంగాలతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

సిక్కిం సభ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమన్ పాల్గొన్నారు. "స్టార్టప్ 20 ద్వారా ఈ రంగంలో పనిచేస్తున్న అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి, వారితో చర్చలు జరపడానికి అవకాశం అందిస్తుంది. " అని పేర్కొన్నారు.

దేశంలో స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ వివరించారు. ' ప్రపంచంలో ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్న స్టార్టప్ రంగం ఉపాధి అవకాశాలు అందిస్తోంది' అని ఆయన అన్నారు.

 సిక్కిం సభ ప్రాధాన్యతను స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ చైర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ వివరించారు. స్టార్టప్ రంగం అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా జీ 20 దేశాల   స్టార్టప్ రంగంలో పనిచేస్తున్న వారందరిని ఒక వేదికపైకి తీసుకు రావడానికి స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ కృషి చేస్తున్నదని అన్నారు. దీనివల్ల స్టార్టప్ 2రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. 

సిక్కిం ముఖ్య కార్యదర్శి శ్రీ వి బి పాఠక్, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం (డిపిఐఐటి) ప్రమోషన్ విభాగం ప్రిన్సిపల్ అడ్వైజర్ శ్రీమతి రూప దత్తా, విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఆశిష్ సిన్హా కూడా  ప్రసంగించారు. డీపీఐఐటీ  అదనపు కార్యదర్శి  శ్రీ సచిన్ ధనియా వందన సమర్పణ చేశారు.

 ప్రారంభోత్సవ కార్యక్రమం   తర్వాత టాస్క్‌ఫోర్స్ సభ్యులు  స్టార్టప్ 20 బృందంతో కలిసి ముసాయిదా విధాన నిర్ణయంపై చర్చలు జరిపారు. చింతన్ భవన్‌లో డాక్టర్ చింతన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.   ఎంజి మార్గ్‌లో  ఎకోటూరిజం, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ, విద్య,  టెక్నాలజీ రంగానికి చెందిన స్టార్టప్‌ సంస్థలు ఏర్పాటు చేసిన  ప్రదర్శనశాలలను ప్రతినిధులు సందర్శించారు. 

మొదటి రోజున  స్టార్టప్ 20 ఎక్స్ పై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీ ఆశిష్ సిన్హా, O2 హిమాలయ వ్యవస్థాపకుడు శ్రీమతి మందిరా చెత్రీ, నిబియా డివైజెస్ వ్యవస్థాపకుడు శ్రీ ఏరోషిల్ నమీరక్‌పం, హవాయి డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ శ్రీ క్రిస్ రాచల్ ,  భారతదేశంలో  యుఎన్ ఉమెన్ డిప్యూటీ కంట్రీ రిప్రజెంటేటివ్ శ్రీమతి కాంతా సింగ్ పాల్గొని ప్రసంగించారు.. గ్యాంగ్‌టక్‌లోని మేఫెయిర్ రిసార్ట్‌లో విందు తో మొదటి రోజు కార్యక్రమాలు ముగిసాయి.   ప్రతినిధులు సిక్కిం  సాంస్కృతిక ప్రదర్శనలు మరియు రుచికరమైన వంటకాలు ఆస్వాదించారు.

సమావేశం 2వ రోజున టాస్క్ ఫోర్స్ సభ్యులు, అధ్యక్షులు, సహ అధ్యక్షులు, స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ 5 బృందాలుగా విడిపోయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. స్టార్టప్ విధాన నిర్ణయం, స్టార్టప్ రంగం అభివృద్ధికి అమలు చేయాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా ప్రతినిధులు చర్చలు జరిపారు. 

 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తమ టాస్క్‌ఫోర్స్‌ల లక్ష్యాలు, చర్చలు, అభివృద్ధి సాధించడానికి అమలు చేయాల్సిన అంశాలపై నివేదికలు  సమర్పించారు.

 స్టార్టప్ 20 చైర్ డాక్టర్ చింతన్ వైషవ్ తన ముగింపు ఉపన్యాసం లో తుది సమావేశం వివరాలు అందించారు. స్టార్టప్ 20 లక్ష్యాన్ని సాధించడానికి సలహాలు సూచనలు అందించాలని ఆయన కోరారు.  . సిక్కిం సభ రెండవ రోజు రుంటెక్ మొనాస్టరీ ని  సందర్శించిన  ప్రతినిధులు  అక్కడ  బౌద్ధ దేవాలయాలు సందర్శించారు.  మఠం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. 

స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ మూడు టాస్క్‌ఫోర్స్‌ల ద్వారా పనిచేస్తుంది.  ఫౌండేషన్ , అలయన్స్, ఫైనాన్స్ ఇన్‌క్లూజన్ అండ్  సస్టైనబిలిటీ రంగాలపై . టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా   స్టార్టప్  రంగం అభివృద్ధి సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలను టాస్క్‌ఫోర్స్‌లు సిఫార్సు చేస్తాయి.  స్టార్టప్ 20 చివరి శిఖరాగ్ర సమావేశం జూలైలో గురుగ్రామ్‌లో జరగనుంది.

***



(Release ID: 1911643) Visitor Counter : 114


Read this release in: Kannada , English , Urdu , Hindi