భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ఎన్ఎస్‌పిఐఆర్ఎ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని మూల‌ధన వాటాను మిస్ట‌ర్ పునీత్ కోత‌ప‌, శ్రీ‌మ‌తి పొంగూరు సింధూరా, శ్రీ‌మ‌తి పొంగూరు శ‌ర‌ణి కొనుగోలు చేయ‌టానికి ఆమోదాన్ని తెలిపిన కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ)

Posted On: 27 MAR 2023 7:27PM by PIB Hyderabad

కాంపిటీష‌న్ యాక్ట్, 2002లోని సెక్ష‌న్ 31 (1) కింద ఎన్ఎస్‌పిఐఆర్ఎ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని మూల‌ధన వాటాను మిస్ట‌ర్ పునీత్ కోత‌ప‌, శ్రీ‌మ‌తి పొంగూరు సింధూరా, శ్రీ‌మ‌తి పొంగూరు శ‌ర‌ణి కొనుగోలు చేయ‌టానికి కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదాన్ని తెలిపింది. 
ఎన్ఎస్‌పిఐఆర్ఎ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎస్‌పిఐఆర్ఎ/ ల‌క్ష్యిత సంస్థ‌)లోని మొత్తం జారీ చేసిన, వాటా పెట్టుడిని పూర్తిగా చెల్లించిన  (పూర్తి డైల్యూటెడ్ బేసిస్‌)లోని , బివిలో పెట్టుబ‌డులు క‌లిగిన ఎన్‌హెచ్‌పిఇఎ మినెర్వా  నుంచి 18.23%న్నికొనుగోలు చేసేందుకు, (2) ల‌క్ష్యిత సంస్థ  మొత్తం జారీ చేసిన‌, కొనుగోలు చేసిన వాటా మూల‌ధ‌నం (పూర్తిగా డైల్యూటెడ్ బేసిస్‌) ఆధారంగా బ‌న్యాన్ ట్రీ గ్రోత్ కాపిట‌ల్ II, ఎల్ఎల్‌సి (ప్ర‌తిపాదిత క‌ల‌యిక‌) నుంచి మిస్ట‌ర్ పునీత్ కొత‌పా, శ్రీ‌మ‌తి పొంగురూ సింధూరా, శ్రీ‌మ‌తి పొంగూరు శ‌ర‌ణి (స‌మిష్టిగా కొనుగోలుదారులుగా ప్ర‌స్తావించే) కొనుగోలుకు సంబంధించిన ప్ర‌తిపాదిత క‌ల‌యిక‌కు సంబంధించింది. 

కొనుగోలుదారులు
ల‌క్ష్యిత సంస్థ‌లో ప్ర‌స్తుతం కొనుగోలుదారులు స‌మిష్టిగా 79.48% వాటాల‌ను క‌లిగి ఉన్నారు. ల‌క్ష్యిత సంస్థ‌కు మిస్ట‌ర్ పునీత్ కొత‌ప మేనేజింగ్ డైరెక్ట‌ర్ కాగా, పి. సింధూర డైరెక్ట‌ర్‌. వారు ల‌క్ష్యిత సంస్థ ప్ర‌మోట‌ర్లు. కాగా, శ్రీ‌మ‌తి శ‌రణి ల‌క్ష్యిత సంస్థ‌లో  (పూర్తిగా డైల్యూటెడ్ బేసిస్‌పై)  25.83% వాటాల‌ను క‌లిగి ఉన్నారు. 

ఎన్ఎస్‌పిఐఆర్ఎ

విద్యా సంస్ట‌త‌ల‌కు, ప్ర‌ధానంగా నారాయ‌ణ గ్రూప్ (అంటే, నారాయ‌ణ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ (ఎన్ఇఎస్‌), నారాయ‌ణ ఎడ్యుకేష‌న్ ట్ర‌స్టు, నారాయ‌ణ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్‌)కు మేనేజ్‌మెంట్ సేవ‌ల‌ను అందించే ల‌క్ష్యంతో 2013లో ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్ సేవ‌ల‌ను అందించే సంస్థ ఎన్ఎస్‌పిఐఆర్ఎ. ఈ మేనేజ్‌మెంట్ సేవ‌ల‌లో పాల‌నా మ‌ద్ద‌తు, కంటెంట్ డెవ‌ల‌ప్‌మెంట్ (విష‌యాంశాల అభివృద్ధి), ప‌రీక్ష‌లు, ప్ర‌వేశాలు, మౌలిక స‌దుపాయాల నిర్వ‌హ‌ణ‌, ఐటి ప‌రిష్కారాలు, హౌజ్‌కీపింగ్‌, భ‌ద్ర‌త‌, ఆస్తుల‌ను అద్దెకు ఇవ్వ‌డం, లీజుకు ఇవ్వ‌డం చేయ‌డం వంటి సేవ‌ల‌ను ఎన్ఎస్‌పిఐఆర్ఎ అందిస్తుంది. 

సిసిఐ వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్నాయి. 


***


(Release ID: 1911498) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi