భారత పోటీ ప్రోత్సాహక సంఘం

బివిలో పెట్టుబ‌డులు క‌లిగిన హెచ్ఎల్ టెర్మిన‌ల్ ద్వారా జెఎం బాక్సీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ వాటాల కొనుగోలును ఆమోదించిన సిసిఐ

Posted On: 27 MAR 2023 7:26PM by PIB Hyderabad

 హ‌ప‌గ్ లాయిడ్ అక్తీన్‌గెసెల్‌షాఫ్ట పూర్తి యాజ‌మాన్య అనుబంధ సంస్థ అయిన హెచ్ఎల్ టెర్మిన‌ల్ హోల్డింగ్ బివి ద్వారా జెఎం బాక్సి పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ లోని వాటాల కొనుగోలును కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదించింది. 
ప్ర‌తిపాదిత క‌ల‌యిక జెఎం బాక్సీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ల‌క్ష్యిత) (ప్ర‌తిపాదిత క‌ల‌యిక(లో భాగంగా కొన్ని నిర్ధిష్ట వాటాల‌ను  హెచ్ఎల్ టెర్మిన‌ల్ ఆధీనంలోని బివి (కొనుగోలు సంస్థ‌) కొనుగోలుకు సంబంధించింది. 

కొనుగోలు సంస్థ‌

కొనుగోలు సంస్థను హ‌పాగ్ లాయిడ్ అక్తీన్‌గెసెల్‌షాఫ్ట్ (హెచ్ఎల్ఎజి) పోర్ట్ టెర్మిన‌ల్ వ్యాపారం కోసం వ్యూహాత్మ‌క‌/  పెట్టుబ‌డి హోల్డింగ్ కంపెనీగా ప‌ని చేయ‌డానికి ఉద్దేశించిన కొత్త‌గా విలీనం చేసిన సంస్థ‌.
జ‌ర్మ‌నీలో కేంద్ర కార్యాల‌యం క‌లిగిన హెచ్ఎల్ఎజి అనేది  కొనుగోలు సంస్త‌కు మాతృ సంస్థ‌. కొనుగోలు గ్రూపుకు స‌ముద్ర రంగంలో చురుకైన అంత‌ర్జాతీయ కంపెనీల స‌మూహం. ఇది హ‌పాగ్ లాయిడ్ ఎజి బ్రాండ్ ఆదీనంలోని కంటైన‌రైజ్డ్ కార్గో (అంటే  పొడి స‌రుకు, స‌ముద్రంలో ర‌వాణా సేవ‌ల‌ను అందించే స‌ముద్ర‌లోతుల్లో, షార్ట్ సీ కంటైన‌ర్ షిప్పింగ్  సంస్థ‌).

ల‌క్ష్యిత సంస్థ‌

ల‌క్ష్యిత సంస్థ భార‌త‌దేశంలో దేశీయ ర‌వాణా, ప్రైవేట్ టెర్మిన‌ల్ సేవ‌ల‌ను అందించే సంస్థ. దీని కార్య‌క‌లాపాల‌లో కంటైన‌ర్ టెర్మిన‌ల్ సేవ‌లు (సిటిఎస్‌), బ‌హుళార్ధ‌సాధ‌క టెర్మిన‌ల్ నిర్వ‌హ‌ణ‌, అంత‌ర్గ‌త కంటైన‌ర్ డిపోలు, కంటైన‌ర్ స‌రుకు కేంద్రాలు, భార‌త‌దేశం అంత‌టా రైలు ర‌వాణా సేవ‌ల వంటి అద‌న‌పు లాజిస్టిక్స్ కార్య‌క‌లాపాలు క‌లిగిన సంస్థ‌. 

సిసిఐ వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్నాయి. 


***



(Release ID: 1911324) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Hindi