మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో 8 శాతం దోహదం చేస్తూ మూడవ అతిపెద్ద మత్స్య ఉత్పాదక దేశంగా నిలవడమే కాక ఆక్వా కల్చర్ (చేపల పెంపకం, జలవ్యవసాయం) ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచిన భారత్
పిఎంఎంఎస్‌వై కింద దేశంలో మొత్తం మత్స్య ఉత్పత్తి 2019-20లో ఉన్న 141.64 లక్షల నుంచి 162.48 లక్షల టన్నుల పెరుగుదలను నమోదు చేసింది
Posted On:
24 MAR 2023 6:05PM by PIB Hyderabad
ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో 8 శాతం దోహదం చేస్తూ మూడవ అతిపెద్ద మత్స్య ఉత్పాదక దేశంగా నిలవడమే కాక ఆక్వా కల్చర్ (చేపల పెంపకం, జలవ్యవసాయం) ఉత్పత్తిలో రెండవ స్థానంలో భారత్ నిలుస్తోంది. 2021-22లో చేపల ఉత్పత్తిలో 4.12 మిలియన్ టన్నుల సముద్ర చేపల ఉత్పత్తి,12.12 మిలియన్ టన్నుల చపల పెంపకం నుంచి వచ్చిన ఉత్పత్తితో 16.42 మిలియన్ టన్నుల ఉత్పాదన అయింది. నాణ్యత కలిగిన విత్తనాల అందుబాటు, శీతల గిడ్డంగులు, అవసరమైన మౌలికసదుపాయాల ఏర్పాటు, దిగుబడి అనంతర మౌలికసదుపాయాలు పెంచడం అన్న సవాళ్ళను కొంత వరకు ఎదుర్కొన్నారు.
2020-21వ సంవత్సరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై)ను ప్రారంభించిన అనంతరం, దేశంలో మత్స్య ఉత్పత్తి , 2019-20లో ఉన్న 141.64 లక్షల నుంచి 162.48 లక్షల టన్నులను నమోదు చేసుకుని పెరుగుదల సరళిని చూపింది.
ఈ సమాచారాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి శాఖ మంత్రి శ్రీ పరషోత్తమ్ రూపాల శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా ఇచ్చారు.
***
(Release ID: 1910557)