గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో ఉపాధి నివేదిక - ఒక అధికారిక ఉపాధి దృక్పథం

Posted On: 24 MAR 2023 3:44PM by PIB Hyderabad

కేంద్ర గ‌ణాంకాలు, కార్యక్రమాల అమ‌లు శాఖ ప‌రిధిలోని జాతీయ గ‌ణాంకాల కార్యాల‌యం (ఎన్ఎస్‌వో), దేశంలో ఉపాధి దృక్పథంపై ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2023 జనవరి కాలానికి ఈ నివేదికను విడుదల చేసింది. పురోగతిని కొన్ని కోణాల్లో అంచనా వేయడానికి, ఎంచుకున్న ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న పరిపాలన దస్త్రాలను ఆధారంగా చేసుకొని దేశంలోని ఉపాధి దృక్పథం వివ‌రాల‌ను ఇందులో వెల్లడించింది.

దేశంలోని మూడు ప్రధాన పథకాలైన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌), ఉద్యోగుల రాజ్య బీమా పథకం (ఈఎస్‌ఐ), జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) కింద కొత్తగా నమోదైన చందాదారుల సంఖ్యను నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఎన్‌ఎస్‌వో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 2017 నుంచి జనవరి 2023 వరకు 6,27,08,006 కొత్త చందాదార్లు ఈపీఎఫ్‌ పథకంలో చేరారు. అలాగే, ఇదే కాలంలో 7,90,42,794 మంది కొత్త సభ్యులు ఈఎస్‌ఐ పథకం కిందకు వచ్చారు. వీరు కాకుండా, ఇదే కాలానికి 40,90,393 మంది కొత్త చందాదార్లు ఎన్‌పీఎస్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ పథకాల కింద నమోదయ్యారు. మరింత వివరణాత్మక సమాచారం ఇక్కడ జోడించడం జరిగింది.

భారతదేశంలో ఉపాధి నివేదిక: ఒక ఉపాధి దృక్పథం – జనవరి, 2023

 

*******


(Release ID: 1910504)
Read this release in: English , Urdu , Hindi