కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వెట్టి చాకిరీ వ్యవస్థను నిషేధించడానికి బహుముఖ వ్యూహం అవలంబిస్తున్న ప్రభుత్వం

Posted On: 23 MAR 2023 4:56PM by PIB Hyderabad

వెట్టి చాకిరీ వ్యవస్థను నిర్ములించడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 

(i) కేంద్ర ప్రభుత్వం బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) చట్టం, 1976ని రూపొందించింది; ఈ చట్టం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లకు నేరాల విచారణ కోసం మొదటి లేదా రెండవ తరగతికి చెందిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అధికారాలను వినియోగించుకోవడానికి అధికారం ఇస్తుంది; జిల్లా, సబ్-డివిజన్ స్థాయిలలో విజిలెన్స్ కమిటీలు వెట్టి కార్మికులను గుర్తించి, పునరావాసం కల్పించాలని సూచిస్తుంది. 

(ii) వెట్టి కార్మికుల పునరావాసం కోసం సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అమలు: ఈ పథకం కింద, భారత ప్రభుత్వం ప్రతి పునరావాస కేసుకు రూ.30,000/- ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆర్థిక సహాయంతో పాటు, లబ్ధిదారులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుండి క్రింది నగదు రహిత సహాయానికి కూడా అర్హులు:

* ఇల్లు/స్థలం, వ్యవసాయ భూమి కేటాయింపు
* భూమి అభివృద్ధి
* తక్కువ ఖర్చుతో కూడిన నివాస యూనిట్ల ఏర్పాటు.
* పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పందుల పెంపకం మొదలైనవి.
* వేతన ఉపాధి, కనీస వేతనాల అమలు మొదలైనవి.
* చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్.
* లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువుల సరఫరా.
* పిల్లలకు విద్య.

సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద పునరావాసం పొందిన వెట్టి కార్మికుల వివరాలు. 2020 -21, 2021-22 మరియు 2022-23లో (ఫిబ్రవరి 2023 వరకు) రాష్ట్రం / 

సంవత్సరం 

రాష్ట్రం/యూటీ 

రక్షించబడిన/పునరావాసం పొందిన వెట్టి కార్మికుల సంఖ్య

2020-21

అస్సాం 

1

బీహార్ 

220

మధ్యప్రదేశ్ 

34

రాజస్థాన్ 

49

పశ్చిమ బెంగాల్ 

16

2021-22

బీహార్ 

360

తమిళ నాడు 

1016

రాజస్థాన్ 

50

ఛత్తీస్గఢ్ 

250

2022-23*

 

రాజస్థాన్ 

70

తమిళనాడు 

297

ఉత్తరప్రదేశ్ 

287

* 2023 ఫిబ్రవరి వరకు.

వెట్టి కార్మికుల పునరావాసం పథకం కింద 2018 నుండి కేటాయించిన నిధుల వివరాలు: 

                                                                              (రూ.కోట్లలో)

సంవత్సరం 

బడ్జెట్ అంచనా 

2018-19

10.00

2019-20

8.00

2020-21

10.00

2021-22

10.00

2022-23

10.00

 

ఈ సమాచారాన్ని కేంద్ర  కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

 ******



(Release ID: 1910296) Visitor Counter : 186


Read this release in: English , Urdu , Tamil