జల శక్తి మంత్రిత్వ శాఖ

11.49 కోట్లు (59%) గ్రామీణ గృహాలకు అందిన కుళాయి నీటి కనెక్షన్లు

Posted On: 23 MAR 2023 6:15PM by PIB Hyderabad

ఆగష్టు 2019 నుండి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో, దేశంలోని ప్రతి గ్రామీణ గృహం కుళాయి నీటి కనెక్షన్ ద్వారా తాగు నీటికి భరోసా కల్పించేందుకు జల్ జీవన్ మిషన్ (జేజేఎం)-హర్ ఘర్ జల్‌ను అమలు చేస్తోంది. ఆగస్టు 2019లో జల్ జీవన్ మిషన్ ప్రకటించే సమయానికి, 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్‌లను కలిగి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 20.03.2023 నాటికి రాష్ట్రాలు/యుటిలు నివేదించిన ప్రకారం, జేజేఎం కింద గత మూడున్నర సంవత్సరాలలో అదనంగా 8.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించారు. ఈ విధంగా, 20.03.2023 నాటికి, దేశంలోని 19.43 కోట్ల గ్రామీణ కుటుంబాలలో, దాదాపు 11.49 కోట్ల (59%) కుటుంబాలకు వారి ఇళ్లలో కుళాయి నీటి సరఫరా ఉన్నట్లు కేంద్రం నివేదించింది. రాష్ట్రం/ యుటీ వారీగా, సంవత్సరం వారీగా వివరాలు జత చేసారు. ఇప్పటివరకు, నివేదించిన ప్రకారం, 5 రాష్ట్రాలు. గోవా, గుజరాత్, హర్యానా, పంజాబ్, తెలంగాణ, 3 యూటీలు అనగా. అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి,  దాద్రా నగర్ హవేలీ & డామన్ డయ్యూ వరుసగా 'హర్ ఘర్ జల్' రాష్ట్రాలు, యుటీ లుగా మారాయి. మిగిలిన రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు 2024 నాటికి పంపు నీటి కనెక్షన్‌ను అందించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. .

జల విభాగం  రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి, నీటి సరఫరా ప్రాజెక్టుల ప్రణాళిక, రూపకల్పన, అమలు, ఆమోదం బాధ్యత రాష్ట్రాలదే. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను భర్తీ చేస్తుంది. అందుకని, మిషన్ కింద ఏర్పాటయ్యే నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్వహణ సంబంధిత అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. తదనుగుణంగా, ఫిర్యాదులు మొదలైనవి. నీటి సరఫరాలో అంతరాయాలు, నాసిరకం నీటి నాణ్యత సమస్యలతో సహా ఇతర విషయాలలో రాష్ట్రం/యూటీ స్థాయిలో పరిష్కరిస్తారు. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఇప్పటివరకు అందిన అటువంటి విషయాలు/ప్రాతినిధ్యాలు అవసరమైన చర్య తీసుకోవడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

ఇంకా, మిషన్ కింద అందించిన ట్యాప్ వాటర్ కనెక్షన్ కార్యాచరణను అంచనా వేయడానికి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ప్రామాణిక గణాంక నమూనా ఆధారంగా స్వతంత్ర మూడవ-పక్ష ఏజెన్సీ ద్వారా వార్షిక అంచనాను నిర్వహిస్తుంది. ఫిబ్రవరి, 2022 నుండి ఏప్రిల్, 2022 వరకు నిర్వహించిన ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ సమయంలో, 86% కుటుంబాలు పని చేస్తున్న కుళాయి కనెక్షన్‌లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 85% మంది తగిన పరిమాణంలో నీటిని పొందుతున్నారు, 80% మంది తమ పైపుల నీటి సరఫరా పథకానికి నీటి సరఫరా షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా నీటిని పొందుతున్నారు 87% గృహాలకు నిర్దేశించిన నీటి నాణ్యత ప్రమాణాల ప్రకారం నీరు అందుతోంది.
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్  లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 


*****



(Release ID: 1910295) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Tamil