రక్షణ మంత్రిత్వ శాఖ
వార్షిక ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం కొంకణ్ 2023
Posted On:
23 MAR 2023 3:50PM by PIB Hyderabad
భారతీయ నావికాదళం, రాయల్ నేవీ మధ్య వార్షిక ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు కొంకన్ 2023 మార్చి 20 నుంచి 22 వరకు అరేబియా సముద్రంలోని కొంకణ్ తీరంలో జరిగాయి.
గైడెడ్ క్షిపణుల యుద్ధ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్, 23వ తరహా గైడెడ్ క్షిపణుల యుద్ధనౌక హెచ్ఎంఎస్ లాంకెస్టర్ ఈ ఎడిషన్‌లో పాలుపంచుకుని, పరస్పర సహకార కార్యాచరణ, ఉత్తమ అభ్యాసాలను గ్రహించేందుకు బహుళ సముద్ర కసరత్తులను చేపట్టాయి. ఈ విన్యాసాలు నావికాదళ విమాన, ఉపరితల, ఉప-ఉపరితల ఆపరేషన్లను, ఉపరితలంపై గాలితో నింపిన లక్ష్యమైన కిల్లర్ టమేటోపై కాల్పులు, హెలికాప్టర్ ఆపరేషన్లు, విమాన విధ్వంసక, జలాంతర్గముల విధ్వంసక యుద్ధ కసరత్తులు, విజిట్ బోర్డ్ సెర్చ్ అండ్ సీజర్ (విబిఎస్ఎస్- నౌకపై సోదా, స్వాధీనం), నౌకా విన్యాసాలు, సిబ్బంది బదలాయింపు వంటి అనేక రంగాలను ఆవరించి ఉన్నాయి.
ఇరు నావికాదళ సిబ్బందికి ఈ శిక్షణ అద్భుతమైన విలువను ఈ విన్యాసాలు అందించాయి. ఉన్నతస్థాయి వృత్తి నైపుణ్యం, ఉత్సాహం ఈ కార్యక్రమ నిర్వహణ సమయంలో కనిపించాయి.
సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు, ఈ ప్రాంతంలో నియమాల ఆధారిత క్రమాన్ని నిలబెట్టేందుకు భారతీయ నావికాదళం, రాయల్ నేవీ సంయుక్త ప్రయత్నాలను బలోపేతం చేసేందుకు కేంద్ర సిబ్బంది ఆపరేషన్ల సంసిద్ధత, పరస్పర కార్యకలాపాలను పెంచడం వంటి చర్యలను ప్రదర్శించింది.
***
(Release ID: 1910243)
Visitor Counter : 210