పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి స్థిరమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ని తప్పనిసరి చేస్తూ పెరిగిన - ఉత్పత్తిదారుని బాధ్యత

Posted On: 23 MAR 2023 3:10PM by PIB Hyderabad

తక్కువ వినియోగంతో పాటు, ఎక్కువ చెత్తను పోగు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించిన ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను, వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ నియమాలు, 2021 ప్రకారం, 2022 జులై, 1వ తేదీ నుంచి అమలులో వచ్చే విధంగా దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ, 2021 ఆగష్టు, 12 వ తేదీన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  ఆ నోటిఫికేషన్ ప్రకారం, 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని కూడా 2021 సెప్టెంబర్, 30వ తేదీ నుంచి,  నిషేధించడం జరిగింది.   అదేవిధంగా, 120 మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, 2022 డిసెంబర్, 31వ తేదీ నుంచి,  నిషేధించడం జరిగింది.  ఒకసారి ఉపయోగపడే ప్లాస్టిక్ వస్తువులుగా గుర్తించిన 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై విధించిన నిషేధాన్ని అమలు చేయడానికి నిరంతరం తనిఖీలు చేపట్టడం జరుగుతోంది.  నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడం, జరిమానా విధించడం వంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం జరుగుతోంది. 

 

 

దేశంలో గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై నిషేధాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసం ఈ దిగువ పేర్కొన్న మూడు ఆన్‌-లైన్ ప్లాట్‌ ఫారమ్‌ లు అమలులో ఉన్నాయి:

 

(ఎ)     సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు పర్యవేక్షణ కోసం జాతీయ డాష్‌బోర్డ్;  

 

(బి)     సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలనపై సమ్మతి కోసం సి.పి.సి.బి. మానిటరింగ్ మాడ్యూల్; 

 

(సి)      సి.పి.సి.బి. గ్రీవెన్స్ రిడ్రెసల్ యాప్‌. 

 

 

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమలు దిశగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.  ప్రైవేట్ సంస్థలు పర్యావరణ ప్రత్యామ్నాయాలను తయారు చేస్తున్నాయి.  2022 సెప్టెంబర్, 26, 27 తేదీల్లో చెన్నైలో జరిగిన నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు పర్యావరణ ప్రత్యామ్నాయాలపై జాతీయ స్థాయి ప్రదర్శన, అంకుర సంస్థల సదస్సు -2022 లో దేశవ్యాప్తంగా నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు పర్యావరణ ప్రత్యామ్నాయాలను తయారు చేసే దాదాపు 150 తయారీదారులు, అంకుర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  అదేవిధంగా, 201 కంపోస్టబుల్ ప్లాస్టిక్‌ల తయారీదారులు / విక్రేతలను సి.పి.సి.బి. ధృవీకరించింది. ఈ జాబితా సి.పి.సి.బి. వెబ్‌-సైట్‌ లో అందుబాటులో ఉంది.

 

 

సవరించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2016, పర్యావరణ అనుకూలమైన నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాలను పార వేసేందుకు చట్టబద్ధమైన విధానాన్ని తెలియజేస్తుంది.  ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కోసం విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత (ఈ.పి.ఆర్) పై మార్గదర్శకాలను, 2022 ఫిబ్రవరి, 16వ తేదీన జారీ అయిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (సవరణ) నియమాలు- 2022 లో పేర్కొనడం జరిగింది.   ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం, దృఢమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ ను పునర్వినియోగం చేయడం, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ కంటెంట్‌ ను ఉపయోగించడంపై, ఈ.పి.ఆర్. లో పేర్కొన్న మార్గదర్శకాలు, తప్పనిసరి లక్ష్యాలను నిర్దేశిస్తాయి.  స్థిరమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వైపు వెళ్లడానికి, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి.  పథకం మార్గదర్శకాల ప్రకారం దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణతో సహా ఘన వ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వం అదనపు కేంద్ర సహాయాన్ని కూడా అందిస్తుంది.

 

 

ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.  

 

 

 

*****

 


(Release ID: 1910105) Visitor Counter : 238


Read this release in: English , Urdu , Gujarati