మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ప్రీ-మెట్రిక్ , పోస్ట్- మెట్రిక్ విద్యార్ధుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు, మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్‌

Posted On: 23 MAR 2023 2:31PM by PIB Hyderabad

స‌మాజంలోని అల్ప‌సంఖ్యాక వ‌ర్గాలు, ముఖ్యంగా ఆర్థికంగా బ‌ల‌హీన‌, వ‌డుగువ‌ర్గాల‌ స‌హా ప్ర‌తి స్త‌రం ఉద్ధ‌ర‌ణ‌కు, సంక్షేమానికి నైపుణ్యాల అభివృద్ధి, వ్య‌వ‌స్థాప‌క‌త‌, సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ‌, జౌళి మంత్రిత్వ శాఖ‌, సాంస్కృతిక శాఖ‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌, గ్రామీణాభివృద్ధి  శాఖ ద్వారా వివిధ ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేసింది.
వివిధ స్కాల‌ర్‌షిప్‌, ఫెలోషిప్ ప‌థ‌కాలు స‌హా ప్ర‌క‌టిత అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల సామాజిక - ఆర్థిక, విద్యా సాధికార‌త కోసం  వివిధ ప‌థ‌కాల‌ను మైనార్టీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అమ‌లు చేసింది. 
రాష్ట్రాల‌/  కేంద్ర‌పాలిత‌ప్రాంతాల వారీగా, జెండ‌ర్‌వారీగా, వ‌ర్గాల వారీగా ప్రీ- మెట్రిక్‌, పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం కింద కేంద్రం ప్ర‌క‌టించిన ఆరు మైనార్టీ వ‌ర్గాల‌కు గ‌త ఐదేళ్ళ‌లో అంటే 2017-18 నుంచి 2021-22 వ‌ర‌కు అందించిన స్కాల‌ర్‌షిప్‌ల వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.minorityaffairs.gov.inలో అందుబాటులో ఉన్నాయి. 
యుజిసి, సిఎస్ఐఆర్ అమ‌లు చేసే జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్‌) ప‌థ‌కం అన్ని వ‌ర్గాల విద్యార్ధుల‌కు వ‌ర్తిస్తుంది. అంతేకాకుండా, సామాజిక న్యాయం & సాధికార‌త మంత్రిత్వ శాఖ అమ‌లు చేసే  షెడ్యూల్డు కులాలు, ఓబిసిల జాతీయ ఫెలోషిప్ ప‌థ‌కాలు, గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ షెడ్యూల్డు తెగ‌ల కోసం అమ‌లు చేసే జాతీయ ఫెలోషిప్ ప‌థ‌కం కింద మైనార్టీ వర్గాల విద్యార్ధులు కూడా క‌వ‌ర్ అవుతారు. మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉన్న‌త విద్య కోసం వివిధ ఫెలోషిప్ ప‌ధ‌కాల‌తో ఫెలోషిప్ (ఎంఎఎన్ఎఫ్‌) ప‌థ‌కంతో అతివ్యాప్తి చెందుతున్నందున‌, ప్ర‌భుత్వం 2022-23 నుంచి ఎంఎఎన్ఎఫ్ ప‌ధ‌కాన్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది. 
ఈ స‌మాచారాన్ని కేంద్ర‌ మైనార్టీ వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ‌మ‌తి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్య‌స‌భ‌కు నేడు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో వెల్ల‌డించారు. 

 

***
 



(Release ID: 1910046) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Tamil