పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
భారత హిమాలయ ప్రాంతంలోని 13 రాష్ట్రాలలో 92 ఎకో- సెన్సిటివ్ జోన్లు (సున్నిత పర్యావరణ జోన్లు), 2 పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా ప్రకటించారు
Posted On:
23 MAR 2023 3:07PM by PIB Hyderabad
రక్షిత ప్రాంతాలలో జీవవైవిధ్యాన్ని నిర్వహించేందుకు, సంరక్షించేందుకు పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ రక్షిత ప్రాంతాల చుట్టూ ఎకో- సెన్సిటివ్ జోన్‌లు (ఇఎస్‌జెడ్ - పర్యావరణ సున్నిత జోన్)లను నోటిఫై చేసింది. వన్యప్రాణ పరిరక్షణ వ్యూహంలో భాగంగా, 2002వ సంవత్సరంలో రక్షిత ప్రాంతాల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రక్షిత ప్రాంతాల (పిఎ) చుట్టూ మరింత రక్షణను కల్పించేందుకు, రక్షిత బఫర్‌ను సృష్టించేలా ఎకో సెన్సిటివ్ జోన్‌లను నోటిఫై చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక పర్యావరణ వ్యవస్థలకు ఒకరకమైన విఘాత శోషకంగా (షాక్ అబ్సార్బర్) రక్షిత ప్రాంతాలు లేదా ఇతర సహజ ప్రాంతాలను అత్యధిక రక్షిత నుంచి తక్కువ రక్షణ అవసరమైన ప్రాంతాల మధ్య పరివర్తన జోన్‌గా సృష్టించడం అన్నది ఇఎస్‌జెడ్‌లను ప్రకటించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా, పర్యావరణ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలలో జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు, సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమైన ప్రత్యేక జీవ వనరులు ఉన్నందున మంత్రిత్వ శాఖ పర్యావరణపరంగా సున్నిత ప్రాంతాలు (ఇఎస్ఎ)లను నోటిఫై చేసింది.
పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు (ఎంఒఇఎఫ్ & సిసి) మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు జాతీయ పార్కులు, వన్యప్రాణ ఆశ్రయాలు చుట్టూ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఇఎస్‌జెడ్‌లుగా ప్రకటించేందుకు సర్వేను, గుర్తింపును నిర్వహించాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, సూచనల ఆధారంగా, పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 లోని సెక్షన్ 3లోని ఇఎస్‌జి నోటిఫికేషన్ కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జోనల్ మాస్టర్ ప్లాన్ (జెడ్ఎంపి)ను రూపొందించేందుకు మార్గదర్శకాలను అందిస్తుంది. దీనితోపాటుగా, సంబంధిత ఇఎస్‌జెడ్‌కి సంబంధించి జోనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పర్యాటక మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయడం తప్పనిసరి చేస్తుంది. ఇప్పటివరకూ, భారత హిమాలయ ప్రాంతం విషయానికి వస్తే 13 రాష్ట్రాలలో 2 ఇఎస్ఎలను, 92 ఇఎస్‌జెడ్‌లను నోటిఫై చేయడం జరిగింది.
.ఈ సమాచారాన్ని పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు శాఖల సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే బుధవారంనాడు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1910021)
Visitor Counter : 194