భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఐడీబీఐ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ నుంచి ఐడీబీఐ ఎంఎఫ్ పథకాలను ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం
Posted On:
22 MAR 2023 6:38PM by PIB Hyderabad
ఐడీబీఐ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ నుంచి ఐడీబీఐ ఎంఎఫ్ పథకాలను ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత కొనుగోలులోని అంశాలు:
- ఐడీబీఐ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు (“ఐడీబీఐ ఏఎంసీ”) చెందిన ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ (“ఐడీబీఐ ఎంఎఫ్”) పథకాల నిర్వహణ హక్కులు ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (“ఎల్‌ఐసీ ఏఎంసీ”) పొందుతుంది;
- ఐడీబీఐ ఎంఎఫ్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ("ఐడీబీఐ టీసీ") నుంచి ఐడీబీఐ ఎంఎఫ్ పథకాల ట్రస్టీ హక్కులను ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ ("ఎల్‌ఐసీ టీసీ") పొందడం;
- ఫలితంగా, ఐడీబీఐ ఎంఎఫ్ పథకాలు ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్‌లో ("ఎల్‌ఐసీ ఎంఎఫ్") భాగం అవుతాయి. ఐడీబీఐ ఎంఎఫ్ పథకాలకు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ఎల్‌ఐసీ ఏఎంసీ వ్యవహరిస్తుంది, ఐడీబీఐ ఎంఎఫ్ పథకాలకు ట్రస్టీగా ఎల్‌ఐసీ టీసీ వ్యవహరిస్తుంది;
- పైన పేర్కొన్న పేరాలోని [a – c] దశల్లో భాగంగా, ఏకమొత్తంగా కాకుండా, ఐడీబీఐ ఏఎంసీ కూడా ఎల్‌ఐసీ ఏఎంసీలో నిర్దిష్ట పరిమాణంలో నియంత్రణ హక్కు లేని వాటాను కొనుగోలు చేస్తుంది.
(ఎల్‌ఐసీ ఏఎంసీ, ఎల్‌ఐసీ టీసీ, ఐడీబీఐ ఏఎంసీలను సమిష్టిగా "కొనుగోలుదార్లు"గా లెక్కిస్తారు)
పైన (ఏ-డీ) పేర్కొన్న లావాదేవీలను సమిష్టిగా “ప్రతిపాదిత కొనుగోలు”గా భావిస్తారు.
ఎల్‌ఐసీ ఏఎంసీ/ ఎల్‌ఐసీ టీసీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ), ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్‌కు (ఎల్‌ఐసీ ఎంఎఫ్) ప్రాయోజిత సంస్థ. ఎల్‌ఐసీ ఏఎంసీ, ఎల్‌ఐసీ టీసీకి ఎల్‌ఐసీ మాతృ సంస్థ. ఎల్‌ఐసీ ఏఎంసీ, ఎల్‌ఐసీ టీసీ "ఎల్‌ఐసీ గ్రూప్"లోనివి. ఎల్‌ఐసీ ఏఎంసీ అనేది ఎల్‌ఐసీ ఎంఎఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా వ్యవహరిస్తుండగా, ఎల్‌ఐసీ టీసీ భారతదేశంలో ఎల్‌ఐసీ ఎంఎఫ్ ట్రస్టీ సంస్థగా వ్యవహరిస్తోంది. ఎల్‌ఐసీ ఎంఎఫ్‌కి పెట్టుబడి నిర్వహణ సలహాదారుగా ఎల్‌ఐసీ ఏఎంసీ వ్యవహరిస్తోంది. ఇది పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది, ఎల్‌ఐసీ ఎంఎఫ్‌కి వివిధ పరిపాలన పరమైన సేవలను అందిస్తోంది.
ఐడీబీఐ ఎంఎఫ్/ ఐడీబీఐ ఏఎంసీ/ ఐడీబీఐ టీసీ
ఐడీబీఐ ఎంఎఫ్ పథకాలు ఈ కొనుగోలులో లక్ష్యిత పథకాలు. ఐడీబీఐ ఎంఎఫ్‌కు ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ ప్రాయోజిత సంస్థ. ఐడీబీఐ ఏఎంసీ ప్రధాన పని ఐడీబీఐ ఎంఎఫ్‌కి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా వ్యవహరించడం. ఐడీబీఐ టీసీ భారతదేశంలో ఐడీబీఐ ఎంఎఫ్ ట్రస్టీ సంస్థగా వ్యవహరిస్తోంది.
సీసీఐ నుంచి వివరణాత్మక ఆదేశం రావలసివుంది.
***
(Release ID: 1909862)
Visitor Counter : 149