వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పీఎం గతిశక్తి ఆధ్వర్యంలోని నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ తన 45వ సెషన్‌లో 6 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సిఫార్సు చేసింది.


పీఎం గతి శక్తి సూత్రాల క్రింద సమీకృత, సమగ్ర విధానంలో ప్రాజెక్టుల అభివృద్ధి

Posted On: 22 MAR 2023 5:42PM by PIB Hyderabad

పీఎం గతిశక్తి ఆధ్వర్యంలోని నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పి జి) తన 45వ సెషన్‌లో 6 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పరిశీలించి సిఫార్సు చేసింది. డిపిఐఐటి లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్), పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, రైల్వేలు,పోర్ట్స్, షిప్పింగ్, జలమార్గాలు, పౌరవిమానయాన,  విద్యుత్,  రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్, పెట్రోలియం, సహజవాయువు, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, వంటి కీలక సభ్య మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల నుండి సీనియర్ అధికారులు చురుకుగా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులు సమీకృత, సమగ్ర విధానాన్ని ఉపయోగించి ప్రధానమంత్రి గతిశక్తి సూత్రాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు మల్టీమోడల్ కనెక్టివిటీని అందిస్తాయి, వస్తువులు మరియు ప్రయాణీకుల అతుకులు లేని తరలింపుతో పాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి.

కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా ఒక ప్రాజెక్ట్ ఎన్ పి జ. లడఖ్‌లోని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ కోసం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన మరియు ఒక రకమైన ప్రాజెక్ట్. 2030 నాటికి శిలాజ రహిత ఇంధనాల నుండి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2020 స్వాతంత్య్ర  దినోత్సవ ప్రసంగం సందర్భంగా, లడఖ్‌లోని  7500 మెగావాట్ల సోలార్ పార్క్, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్  ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ 5 గిగావాట్ల ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ద్వారా 13 గిగావాట్ల ఆర్ ఈ తరలింపు, గ్రిడ్ ఏకీకరణను అనుమతి స్తుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ రకమైన వ్యవస్థతో 76% ప్రసార వినియోగం అంచనా వేయబడింది. ఈ ప్రాజెక్ట్ 350 కేవీ హెచ్విడిసి లైన్‌తో పాటు పాంగ్ (లేహ్) మరియు కైతాల్ (హర్యానా) వద్ద అత్యాధునిక విఎస్సి ఆధారిత హెచ్విడిసి టెర్మినల్‌లను కలిగి ఉంది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. లడఖ్ మొత్తం ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది సంవత్సరానికి 26 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా సులభతరం చేస్తుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ సిటీ లాజిస్టిక్స్ కోసం ఒక ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదన ప్రాజెక్ట్ కాన్పూర్ అన్వర్గంజ్ - మంధాన ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ కోసం. ఇది రైల్వేల లైన్ కెపాసిటీ వినియోగాన్ని పెంచుతుంది. ఈ ప్రాంతంలో సిటీ లాజిస్టిక్స్‌ను మెరుగుపరుస్తుంది కాబట్టి ఇది సిటీ నిర్దిష్ట ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కాన్పూర్ నగరం నడిబొడ్డున ఉంది, ఇందులో 16 లెవెల్ క్రాసింగ్, 16 కి.మీ.ల విస్తీర్ణంలో ఈ ట్రాక్‌కి సమాంతరంగా జీటీ రోడ్డు ఉంది. రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాల, కార్డియాలజీ కేంద్రం, క్యాన్సర్ కేంద్రం, మంచి షెడ్, వినియోగ కేంద్రాలు, గిడ్డంగులు, వ్యవసాయ వంటి ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయి. చివరికి, ఇది ట్రాఫిక్ జామ్‌లకు దారితీస్తుంది. రైళ్లు, వాహనాల వేచి ఉండే సమయం పెరుగుతుంది.అందువల్ల ఒక సారి ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయితే 4.2 ఎంటిపిఏ రవాణా చేసేలా లాజిస్టిక్స్ మెరుగుపడుతుంది. ఇది ప్రాంతంలో కంటైనర్ ట్రాఫిక్‌ను మెరుగుపరుస్తుంది. ఫలితంగా దాదాపు రూ.0.0021 కోట్ల  ఇంధనం పొదుపు చేయవచ్చు. రూ. 0.0026 కోట్ల ఉద్గారాల వరకు లాభం చేకూరుతుంది. ప్రస్తుత రహదారి ట్రాఫిక్ కూడా 25% మెరుగుపడుతుంది, పారిశ్రామిక ఉత్పత్తి, వినియోగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. పాత ట్రాక్‌ను కూల్చివేసిన తర్వాత లభించే భూమి ఈ-బస్సు ప్రత్యేక కారిడార్, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఈ రైల్వే ట్రాక్ ద్వారా రెండు మెట్రో స్టేషన్ల ద్వారా స్కైవాక్ కనెక్టివిటీ కూడా అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ దాని సమగ్ర విధానంతో ప్రాంతంలో సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది

ఇంకా, బీహార్ రాష్ట్రంలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో విక్రమశిల - కటారియా రైల్వే స్టేషన్‌ను కలిపే కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి గంగా నదిపై రైలు వంతెన నిర్మాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రాజెక్ట్‌ను ఎన్‌పిజి పరిశీలించింది. ఈ ప్రాజెక్ట్ భాగల్పూర్ నుండి 40 కి.మీల దూరంలో గంగా నదిపై ఒక ప్రవాహం పక్కన ఉంది. ఇది ఒక క్లిష్టమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, ఇది పూర్తయిన తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఆహార ధాన్యాల ఆర్థిక నోడ్‌లకు కనెక్టివిటీని అందిస్తుంది, ఉత్తర బీహార్, ఈశాన్య ప్రాంతానికి సిమెంట్ తరలింపు, తూర్పు బొగ్గు క్షేత్రం, స్టోన్ చిప్స్ బండలు, ఇతర క్వారీ ఉత్పత్తులను రోజుకు 5 రేక్‌లకు పెంచుతుంది.

178.28 కి.మీల అజ్మీర్-చిత్తౌర్‌గఢ్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి మరో ప్రాజెక్ట్ ప్రతిపాదనను పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా రాజస్థాన్‌లోని అజ్మీర్, భిల్వారా, చిత్తౌర్‌గఢ్ జిల్లాలకు అంటే పారిశ్రామిక, గిరిజన ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతంలో అనేక మతపరమైన, పర్యాటక, చారిత్రాత్మక ప్రదేశాలను కలిగి ఉంది, అంటే పుష్కర్, అజ్మీర్, చిత్తౌర్‌ఘర్, ఉదయపూర్. ప్రాజెక్ట్ విభాగం రాణాప్రతాప్‌నగర్ ఫర్టిలైజర్స్ లోడింగ్ స్టేషన్‌ల వంటి ముఖ్యమైన ఆహార ధాన్యం అన్‌లోడింగ్ స్టేషన్‌లకు కూడా సేవలు అందిస్తుంది. దేబారి, సిమెంట్/క్లింకర్ లోడింగ్ స్టేషన్లు, జింక్ మైన్స్, స్పిన్నింగ్ మిల్లులు & టెక్స్‌టైల్ హబ్, వంటివి. లైన్‌ను రెట్టింపు చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ 18.95% ప్రయాణీకుల సమయాన్ని మెరుగుపరుస్తుంది.  సుమారుగా 40-45 నిమిషాల ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది మల్టీమోడల్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాంతంలో లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

అదనంగా పఠాన్‌కోట్ - మండి జంట ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణంతో సహా బిజిని నుండి మండి వరకు 4 లేన్‌ల నిర్మాణానికి సంబంధించిన రోడ్లు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా 2 ప్రాజెక్టులను ఎన్ పి జి పరిశీలించింది. ఇది పఠాన్‌కోట్ కాంట్‌తో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రైల్వే స్టేషన్, జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్. ఇది ముఖ్యమైన పట్టణాలను అంటే, నూర్పూర్, షాపూర్, ధర్మశాల, కాంగ్రా, పాలంపూర్, బైజ్నాథ్, మండిలను కూడా కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడం ద్వారా గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌లో సరుకు రవాణా పరిమాణాన్ని పెంచుతుంది. ఇది రైలు కనెక్టివిటీని (అంకిత సరుకు రవాణా కారిడార్‌లతో సహా), విమానాశ్రయాలు, ఎంఎంఎల్ పి లు, రోప్‌వేలను మెరుగుపరుస్తుంది. ఫార్మా, మెడికల్ సెంటర్, సెజ్, ఇండస్ట్రియల్ పార్కులు, టెక్స్‌టైల్స్ క్లస్టర్‌లు అంటే పీఎం గతిశక్తి ఎన్ఎంపి సూత్రాల క్రింద 5 ప్రత్యేక నోడ్‌లకు ఈ ప్రాజెక్ట్ మల్టీమోడల్ కనెక్టివిటీని అందిస్తుంది.

మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన రెండవ ప్రాజెక్ట్ పనాజీ - హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా బెల్గాం - హంగ్‌సుండ్ - రాయచూర్ 4 లేన్‌ల నిర్మాణం. ఈ ఎకనామిక్ కారిడార్ భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు, కర్ణాటక, గోవా, తెలంగాణాలోని భారతమాల ఆర్థిక కేంద్రాల మధ్య హై-స్పీడ్ జాతీయ రహదారులు, కర్ణాటక, భానాపూర్ - గాడెన్‌కేరి ఎక్ష్ప్రెస్స్ మార్గాల ద్వారా ఎటువంటి అడ్డంకులు లేని కనెక్టివిటీని అనుమతిస్తుంది. ఇది గోవా, బెల్గావి, బాగల్‌కోట్, రాయచూర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్‌లు, గోవా, బెల్గావి మరియు హైదరాబాద్ 3 విమానాశ్రయాలు మరియు 20+ పర్యాటక ప్రదేశాలతో బహుళ-మోడల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఆరు జిల్లాలు, ఆరు పీఎం గతిశక్తి ఎకనామిక్ నోడ్‌లను అనుసంధానం చేయడం ద్వారా అమృత్ కాల్  విజన్ అమలు చేయడంలో ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది. 

నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పి జీ) 45వ సెషన్ 2023 మర్చి 15న న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో జరిగింది.

***



(Release ID: 1909832) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi