కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లకు సంబంధించిన అంశాలపై సిఫార్సులను విడుదల చేసిన ట్రాయ్

Posted On: 22 MAR 2023 4:03PM by PIB Hyderabad

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈరోజు 'కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లకు సంబంధించిన అంశాల'పై తన సిఫార్సులను విడుదల చేసింది.

ఎంఐబీ  11.11.2021 మరియు 17.01.2022 నాటి సూచనలను అనుసరించి కింది వాటిపై ట్రాయ్ చట్టం, 1997 సెక్షన్ 11(1)(ఎ)(ii) మరియు 11(1) (డి) ప్రకారం దాని సిఫార్సులను అందించమని అథారిటీని కోరింది. అంశాలు:

(i) కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 కింద నమోదైన లాభాపేక్ష లేని కంపెనీలను అర్హత గల సంస్థల జాబితాలో చేర్చడం

(ii) అనుమతి వ్యవధిని 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పెంచడం

(iii) సిఆర్‌ఎస్‌లో ప్రసారమయ్యే గంటకు గరిష్టంగా ప్రకటనల వ్యవధి

(iv) బహుళ జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాభాపేక్ష లేని సంస్థల ద్వారా ప్రతి జిల్లాలో నిర్వహించబడుతున్ సీఆర్‌ స్టేషన్ల సంఖ్య

దీనికి సంబంధించి సీఆర్‌కి సంబంధించిన అంశాలపై వాటాదారుల వ్యాఖ్యలను కోరేందుకు ట్రాయ్ 21 జూలై 2022న ఒక సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది. వ్యాఖ్యలను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 17, 2022 మరియు కౌంటర్ కామెంట్‌లు ఆగస్ట్ 31, 2022గా ఉంది. ఇది కొంతమంది వాటాదారుల అభ్యర్థన మేరకు వరుసగా 31 ఆగస్టు 2022 మరియు 14 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించబడింది. ట్రాయ్ వాటాదారుల నుండి 13 వ్యాఖ్యలు మరియు 3 కౌంటర్-కామెంట్‌లను అందుకుంది. ఈ వ్యాఖ్యలు ట్రాయ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా 11 నవంబర్ 2022న బహిరంగ సభ చర్చ కూడా జరిగింది.

సంప్రదింపుల ప్రక్రియలో వాటాదారుల నుండి వచ్చిన అన్ని వ్యాఖ్యలు/ప్రతివాద-వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత మరియు అంశాలపై మరింత విశ్లేషణ చేసిన తర్వాత, అథారిటీ తన సిఫార్సులను ఖరారు చేసింది. సిఫార్సుల యొక్క ముఖ్య లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

(i) కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 కింద స్థాపించబడిన లాభాపేక్ష లేని కంపెనీలు ఇప్పటికే సీఆర్‌ఎస్‌ కోసం ఉన్న అర్హత ప్రమాణాలలో కవర్ చేయబడ్డాయి.

(ii) కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి నిర్దిష్ట రకాల ఎంటిటీలు మినహాయించి ఎంఐబీ మార్గదర్శకాలలో సూచించిన ప్రస్తుత ప్రమాణాలు సెక్షన్ 8 కంపెనీలకు కూడా సమానంగా వర్తిస్తాయి.

(iii) 12.11.2008 నాటి 'ప్రసారం మరియు పంపిణీ కార్యకలాపాల్లోకి నిర్దిష్ట సంస్థల ప్రవేశానికి సంబంధించిన సమస్యలపై సిఫార్సులలో పేర్కొన్న విధంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్‌తో సహా ప్రసార ఛానెల్‌లను కలిగి ఉండకుండా మతపరమైన సంస్థల అనర్హత గురించి సిఫార్సులను పునరుద్ఘాటిస్తుంది.

(iv) అనుమతి  ప్రారంభ వ్యవధిని ఒకేసారి ఐదు (5) సంవత్సరాల నుండి పది (10) సంవత్సరాలకు పెంచాలి.

(v) సీఆర్‌ఎస్‌ లైసెన్స్ పొడిగింపు/పునరుద్ధరణ కోసం ప్రస్తుత పాలసీ మార్గదర్శకాలు సరిపోతాయి మరియు అదే విధంగా కొనసాగాలి.

(vi) లైసెన్స్ పొడిగింపు మంజూరు కోసం కమ్యూనిటీ రేడియో స్టేషన్లు సంబంధిత జిల్లా ఎస్‌డీఎం నుండి నిరంతర సేవా నివేదికను పొందవలసి ఉంటుంది.

(vii) సీఆర్‌ఎస్‌లో ప్రకటన వ్యవధిని గంటకు ఏడు (7) నిమిషాల నుండి గంటకు పన్నెండు (12) నిమిషాలకు పెంచాలి.

(viii) బహుళ జిల్లాల్లో పనిచేస్తున్న లాభాపేక్ష లేని సంస్థలు, తమ కార్యకలాపాల ప్రాంతంలో బహుళ సీఆర్‌ఎస్‌ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలి.

(ix) దేశవ్యాప్తంగా గరిష్టంగా ఆరు సీఆర్‌ఎస్‌ని ఏర్పాటు చేయడానికి ఒక సంస్థను అనుమతించాలి.

(x) బహుళ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలనుకునే సంస్థ, ప్రోగ్రామ్‌లు స్థానికంగా తయారు చేయబడతాయని మరియు ఇతర సీఆర్‌ఎస్‌ నుండి పంపబడదని నిర్ధారిస్తూ ఒక బాధ్యతను సమర్పించాలి.

(xi) సీఆర్‌ఎస్‌ వారి స్థిరత్వంలో సహాయపడటం కోసం సీఆర్‌ఎస్‌పై మరిన్ని కార్యక్రమాలను స్పాన్సర్ చేయడానికి ఎంఐబీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో చురుకుగా కొనసాగవచ్చు.

(xii) కమ్యూనిటీ రేడియో స్టేషన్లను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాల అన్ని విశ్వవిద్యాలయాలు బడ్జెట్ మద్దతును అందించవచ్చు. అటువంటి విశ్వవిద్యాలయాలకు లైసెన్స్/స్పెక్ట్రమ్ అందించడాన్ని ఎంఐబీ చురుకుగా పనిచేయవచ్చు.

(xiii) సీఆర్‌ఎస్‌ మంజూరు కోసం అన్ని ప్రక్రియలు ఒకే విండో సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయాలి.

(xiv) దరఖాస్తు చేసిన ఒక నెలలోపు ఎస్ఏసిఎఫ్‌ఏ క్లియరెన్స్ మంజూరు చేయాలి.

(xv) డబ్ల్యూఓఎల్ లైసెన్స్ మంజూరు కూడా దరఖాస్తు చేసిన ఒక నెలలోపు సూచించిన వ్యవధిని కలిగి ఉండాలి.

సిఫార్సుల పూర్తి సారాంశం ట్రాయ్‌ వెబ్‌సైట్ www.trai.gov.inలో అందుబాటులో ఉంది. ఏదైనా వివరణ/సమాచారం కోసం, శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్, సలహాదారు (బి&సిఎస్‌)ను +91-11-23237922 నెంబర్‌ ద్వారా ఫోన్‌లో సంప్రదించవచ్చు.

***



(Release ID: 1909828) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi