ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారతదేశంలో డెంగ్యూ నియంత్రణ కోసం వ్యూహాత్మక ఫ్రేమ్ వర్క్ , రోడ్ మ్యాప్ ను అభివృద్ధి చేయడానికి రెండు రోజుల టెక్నికల్ సింపోజియంను నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


సమర్థవంతమైన నిర్వహణ , నియంత్రణ కోసం డెంగ్యూ కేసులను సకాలంలో గుర్తించడం , నివేదించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం: శ్రీ రాజేష్ భూషణ్

ఇంటర్ సెక్టోరల్ కన్వర్జెన్స్ , నిరంతర ప్రయత్నాల ద్వారా డెంగ్యూ నిర్వహణ, నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించాలని రాష్ట్రాలకు సూచన

Posted On: 22 MAR 2023 2:53PM by PIB Hyderabad

భారతదేశంలో డెంగ్యూ నియంత్రణకు వ్యూహాత్మక ఫ్రేమ్ వర్క్, రోడ్ మ్యాప్ ను అభివృద్ధి చేయడానికి రెండు రోజుల సాంకేతిక గోష్టి ని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ప్రారంభించారు.

 

నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ( ఎన్ సి వి బి డి సి), ఆరోగ్య -  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ ఎఫ్ డబ్ల్యు) నిర్వహించిన ఈ సింపోజియం ఉద్దేశ్యం - డెంగ్యూ నియంత్రణ కోసం వ్యూహాత్మక  ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేయడానికి గుర్తించిన మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి భాగస్వాములను ఒక ఉమ్మడి వేదిక కిందకు తీసుకురావడం. ఇంకా బహుళ కోణాలలో ప్రయత్నాలను ఏకీకృతం చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఒక కంట్రీ రోడ్ మ్యాప్ ను రూపొందించడం.

 

ఈ సందర్భంగా శ్రీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ, సమర్థవంతమైన నిర్వహణ , నియంత్రణ కోసం డెంగ్యూ కేసులను సకాలంలో గుర్తించడం, నివేదించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. డెంగ్యూను ఎంఓహెచ్ ఎఫ్ డబ్ల్యూ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ కింద చేర్చాలని, ఇందులో ఇప్పటికే 33 వ్యాధులు కవర్ అయ్యాయని ఆయన తెలిపారు.

 

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో తన స్వంత అనుభవాన్ని ఉటంకిస్తూ, భారతదేశంలో కాలానుగుణంగా వ్యాప్తి చెందుతున్న డెంగ్యూ వ్యాప్తిని ఎదుర్కోవటానికి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఎలా సాధించవచ్చో ఆయన వివరించారు.

 

భాగస్వాములందరి నుంచి ఇంటర్ సెక్టోరల్ కన్వర్జెన్స్, నిరంతర కృషిపై కేంద్ర కార్యదర్శి దృష్టి సారించారు. రెండు రోజుల మేధోమథనం ముగిసేలోగా అన్ని రాష్ట్రాలు కార్యాచరణ ప్రారంభించాలని ఆయన కోరారు.

 

భారతదేశంలో డెంగ్యూ నియంత్రణకు అనేక ప్రయత్నాలు చేపట్టినట్లు ఎం ఒ హెచ్ ఎఫ్ డబ్ల్యూ ఎఎస్ అండ్ ఎండి (ఎన్ హెచ్ ఎమ్) శ్రీమతి రోలీ సింగ్ తెలియజేశారు. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఇంటిగ్రేటెడ్ వెక్టర్ మేనేజ్ మెంట్ చేపడుతున్నామని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు సమర్థవంతమైన కమ్యూనిటీ భాగస్వామ్యం, ఇంటెన్సివ్ ఐఈసీ క్యాంపెయిన్ ల ప్రాముఖ్యతను ఆమె వివరించారు.

 

డెంగ్యూ నియంత్రణను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేర్చి కార్పొరేట్ రంగాన్ని కూడా భాగస్వాములను చేసినట్లు ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మే 16న జాతీయ డెంగీ నివారణ దినం గా, జూలై నెలను డెంగీ నిరోధక మాసంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 

డెంగ్యూకు మందులు, చికిత్స అందుబాటులో లేనందున, జాగ్రత్తలు తీసుకోవడం, దోమల నియంత్రణ, నివారణకు భరోసా కల్పించడం ముఖ్యమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రాజీవ్ మాంఝీ పేర్కొన్నారు.

 

డెంగ్యూను సమర్థవంతంగా నియంత్రించడానికి ఇంటిగ్రేటెడ్ వెక్టర్ కంట్రోల్, సర్వైలెన్స్అండ్  రెస్పాన్స్, క్లినికల్ డయాగ్నోసిస్ అండ్  ట్రీట్మెంట్ , బహుళ భాగస్వామ్య చొరవ అనే నాలుగు కీలక జోక్యాలను ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ను డబ్ల్యూహెచ్ఓ ఇండియా గ్రూప్ హెడ్ (ఎమర్జెన్సీ హెల్త్) డాక్టర్ ట్రాన్ మిన్ ప్రముఖంగా వివరించారు.

 

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో డెంగ్యూ నివారణ, నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఇంటర్ సెక్టోరల్ కోఆర్డినేషన్, డెంగ్యూ నియంత్రణలో సవాళ్లపై చర్చించనున్నారు. భారతదేశంలో డెంగ్యూ నియంత్రణకు పటిష్టమైన వ్యూహంతో ఒకే వేదిక విధానంతో సబ్జెక్టు నిపుణులతో భవిష్యత్ రోడ్ మ్యాప్ ను రూపొందించనున్నారు.

 

ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయాలు, దాని సంస్థలు; మెడికల్ కాలేజీలు- ఎయిమ్స్ (ఢిల్లీ, భువనేశ్వర్,జోధ్పూర్ ); ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (ఏఎఫ్ ఎంసీ), పుణె; వివిధ సంస్థలు- ఎన్సిడిసి, సిహెచ్ఇబి, ఎన్ఐహెచ్. ఎఫ్ డబ్ల్యూ; గుర్తించిన రాష్ట్రాలు; ఆర్ ఒ హెచ్ ఎఫ్ డబ్ల్యూ లు ; డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయాలు, డబ్ల్యూహెచ్ఓ-ఇండియా, సబ్జెక్టు నిపుణులు; సీజీహెచ్ఎస్ ఆస్పత్రులు, ఢిల్లీలో గుర్తించిన సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

 

నేపథ్యం:

 

ఇటీవలి సంవత్సరాలలో డెంగ్యూ వ్యాప్తి పెరుగుతోంది, అనేక రాష్ట్రాలు ,కొత్త ప్రాంతాల నుండి పదేపదే వ్యాప్తి నమోదవుతోంది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, ప్రపంచీకరణ, వాతావరణ మార్పులు, సామాజిక-ఆర్థిక అభివృద్ధి , జీవన శైలి మార్పుల కారణంగా దేశంలో డెంగ్యూ కేసులు పెరిగాయి.

 

డెంగ్యూ వ్యాప్తి ప్రధానంగా ఆరోగ్య రంగం పరిధికి వెలుపల ఉన్న కారకాల వల్ల సంభవిస్తుంది, అందువల్ల దీని నియంత్రణ కు ఆరోగ్య-  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యూ) , ఇతర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఐసిఎంఆర్ సంస్థలు, భాగస్వాములు, గుర్తించబడిన రాష్ట్రాలు,  మున్సిపాలిటీల మధ్య సమన్వయం అవసరమయ్యే సమర్థవంతమైన మల్టీ సెక్టోరల్ విధానం అవసరం.

 

****



(Release ID: 1909731) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi , Tamil