భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గత మూడేళ్ళలో అంటే 2020 నుంచి 2023 మార్చి 15 వరకు ఇండియాలో 2,56,980 విద్యుత్ వాహనాలు నమోదయ్యాయి.
Posted On:
21 MAR 2023 2:58PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ-వాహన్ పోర్టల్ లో పొందుపరచిన వివరాల ప్రకారం ఇండియాలో 2020 నుంచి 2023 (15-03-2023 నాటికి) వరకు నమోదైన (రిజిస్టర్ చేసుకున్న) వాహనాల వివరాలు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జార్ లోకసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ప్రకారం ఈ కింది విధంగా ఉన్నాయి.
సంవత్సరం మొత్తం సంఖ్య
2020 1,23,092
2021 3,27,976
2022 10,15,196
2023 (15-03-2023 నాటికి) 2,56,980
విద్యుత్ వాహనాల కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ దిగువ పేర్కొన్న మూడు స్కీముల ద్వారా ప్రోత్సాహకాలను అందజేసింది.
ఇండియాలో మిశ్రజాతి మరియు విద్యుత్ వాహనాల తయారీ టెక్నాలజీని త్వరితంగా స్వీకరించి ఆచరణలో పెట్టడం మరియు ఉత్పత్తి చేయడం (ఫేమ్ ఇండియా) : ఫేమ్ ఇండియా స్కీము రెండవ దశను తొలుత ప్రభుత్వం 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఐదేళ్ల కాలానికి ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 10,000 కోట్లను కేటాయించింది.
ఫేమ్ ఇండియా స్కీము రెండవ దశ కింద విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు ఇచ్చే ప్రోత్సాహకంగా కొనేధరలో తగ్గింపు ఇచ్చారు. వాహనం బ్యాటరీ సామర్ధ్యం ఆధారంగా ప్రోత్సాహకం ఉంటుంది. అంటే ప్రతి కెడబ్ల్యుహెచ్ ఒక్కంటికి రూ. 10,000 చొప్పున ఈ - 3డబ్ల్యు మరియు ఈ - 4డబ్ల్యు వాహనాలకు రాయితీ గరిష్టంగా వాహనం ఖరీదులో 20% ఇస్తారు. అంతేకాక ఈ-2డబ్ల్యు వాహనాలకు ఇచ్చే ప్రోత్సాహకం /సబ్సిడీ ప్రతి కెడబ్ల్యుహెచ్ ఒక్కంటికి రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచారు. అదికాక 2021 జూన్ 11వ తేదీ నుంచి రాయితీని గరిష్టంగా వాహనం ఖరీదులో 20% నుంచి 40 శాతానికి పెంచారు.
మోటారు వాహనాల రంగానికి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకం (పి ఎల్ ఐ): మోటారు వాహనాల రంగానికి పి ఎల్ ఐ స్కీమును ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 15వ తేదీన ఆమోదించింది. ప్రధానంగా దేశీయంగా ఉత్పత్తయిన వాహనాలకు మద్దతు ఇచ్చేందుకు ఈ స్కీముకు బడ్జెట్ లో రూ. 25,938 కోట్లు కేటాయించింది. విద్యుత్ వాహనాలకు పి ఎల్ ఐ స్కీము వర్తిస్తుంది.
ఉన్నతస్థాయి రసాయన ఘటకాల (ఏసిసి)కు పి ఎల్ ఐ స్కీము : ఏసిసి ఉత్పత్తికి ప్రభుత్వం 2021 మే 12వ తేదీన పి ఎల్ ఐ స్కీము ఆమోదించింది. ఇందుకోసం బడ్జెట్ లో 18,100 కోట్లు కేటాయించింది. దేశంలో 50జిడబ్ల్యుహెచ్ సామర్ధ్యంగల ఏసిసి బ్యాటరీ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడం ఈ స్కీము ఉద్దేశం. అదనంగా 5జిడబ్ల్యుహెచ్ సామర్ధ్యంగల ఏసిసి టెక్నాలజీలకు కూడా ఈ స్కీము వర్తిస్తుంది.
****
(Release ID: 1909454)
Visitor Counter : 177