ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుష్ పరిశ్రమ వృద్ధి

Posted On: 21 MAR 2023 3:11PM by PIB Hyderabad

2020లో ఆయుష్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం $ 18.1 బిలియన్లు (ప్రస్తుత రూపాయి డాలర్ రేటు ప్రకారం) రూ 1,49,451 కోట్లు.  2014-15లో అయితే $ 2.85 బిలియన్ (ప్రస్తుత రూపాయి-డాలర్ రేటు ప్రకారం రూ 23,532 కోట్లు) (గోరయా మరియు వేద్) రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (RIS) కింద ఫోరమ్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ (FITM) ద్వారా ఆయుష్ సెక్టార్‌పై పరిశోధన నివేదిక ప్రకారం. 

 

ఆయుష్‌లో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌ను అభివృద్ధి చేసింది (IC స్కీమ్) దీని కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతీయ ఆయుష్ తయారీదారులు/ఆయుష్ సర్వీస్ ప్రొవైడర్‌లకు ఆయుష్ ఉత్పత్తులు మరియు  సేవల ఎగుమతిని ప్రోత్సహించడానికి మద్దతునిస్తుంది; ఆయుష్ ఔషదాలకు అంతర్జాతీయ ప్రమోషన్, అభివృద్ధి మరియు గుర్తింపును సులభతరం చేయడం; వాటాదారుల పరస్పర అనుసంధాన ప్రక్రియను ప్రోత్సహించడం మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ యొక్క మార్కెట్ అభివృద్ధి; అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ వైద్య విధానం గురించి అవగాహన మరియు ఆసక్తిని పెంపొందించడం మరియు బలోపేతం చేయడం కోసం విదేశాలలో ఆయుష్ అకడమిక్ చైర్‌లను ఏర్పాటు చేయడం మరియు శిక్షణ వర్క్‌షాప్/సింపోజియంలు నిర్వహించడం ద్వారా విద్యావేత్తలు మరియు పరిశోధనలను ప్రోత్సహించడం.

 

వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, సోవా రిగ్పా మరియు యునాని వైద్య విధానాలు మరియు ఆయుష్ వ్యవస్థల యొక్క ఔషధాలు మరియు ఉత్పత్తుల కోసం ఆయుష్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.

 

రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (RIS)  'భారతదేశంలో ఆయుష్ రంగం: అవకాశాలు మరియూ సవాళ్లు'నివేదిక ప్రకారం మూలికా ఔషధాల రంగం యొక్క ప్రపంచ మార్కెట్ మొత్తం పరిమాణం 2020లో $657.5 బిలియన్ (రూ 54,28,977 కోట్లు)గా అంచనా వేయబడింది. ప్రస్తుత రూపాయి-డాలర్ రేటుకు) .  ఎగుమతుల పరంగా, భారతదేశం యొక్క మొత్తం ఆయుష్ ఎగుమతి 2014లో $ 1.09 బిలియన్ల (ప్రస్తుత రూపాయి-డాలర్ రేటు ప్రకారం రూ 9,000 కోట్లు) నుండి 2020లో   $ 1.54 బిలియన్లకుపెరిగింది. ప్రస్తుత రూపాయి-డాలర్ రేటు ప్రకారం 12,715 కోట్లు.

 

ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులను పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ క్రింది చర్యలు తీసుకుంది:

 

విదేశాలతో సాంప్రదాయ వైద్యం మరియు హోమియోపతి రంగంలో సహకారం కోసం మంత్రిత్వ శాఖ 24 దేశాల మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

సహకార పరిశోధన / విద్యా సహకారాన్ని చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలతో 40 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

విదేశీ దేశాల్లో ఆయుష్ అకడమిక్ చైర్‌ల ఏర్పాటు కోసం అంతర్జాతీయ సంస్థలతో 15 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ 35 విదేశీ దేశాలలో 39 ఆయుష్ సమాచార కేంద్రాల స్థాపనకు సహాయాన్ని అందించింది.

“ఆయుష్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్” విదేశాలలో ఆయుష్ ఉత్పత్తుల రిజిస్ట్రేషన్ కోసం అడ్డంకులను పరిష్కరించడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మద్దతుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 04.01.2022న కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8(4) కింద నమోదు చేయబడింది. విదేశాలలో మార్కెట్ అధ్యయనాలు మరియు పరిశోధన కార్యకలాపాలు.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ & ట్రాపికల్ మెడిసిన్ (LSH&TM), యూ కే మరియు ఫ్రాంక్‌ఫర్టర్ ఇన్నోవేషన్స్‌జెంట్రమ్ బయోటెక్నాలజీ GmbH (FIZ), ఫ్రాంక్‌ఫర్ట్ జర్మనీతో ఆయుర్వేదం ద్వారా కోవిడ్-19ని తగ్గించడంపై క్లినికల్ రీసెర్చ్ అధ్యయనాల కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని మరియూ హోమియోపతి ఔషధాల ఎగుమతిని సులభతరం చేయడానికి 31 ఆయుర్వేద ఔషధ తయారీదారులకు డబ్ల్యూ హెచ్ ఓ - జీ ఎం పీ సీ ఓ పీ పీ ఇవ్వబడింది.

ఈ విషయాన్ని ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

***


(Release ID: 1909448) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Kannada