భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

వ్యర్థాలనుంచి సంపద మిషన్‌ కింద డిల్లీిలోని బారాపుల్లా కాలువలో 3 కిలోమీటర్ల పొడవునా,దానిని శుభ్రపరిచి, పేరుకుపోయిన మేటను తొలగించేందుకు ఏడాది కాలంగా చేపట్టిన కార్యక్రమం పూర్తి

Posted On: 21 MAR 2023 3:29PM by PIB Hyderabad

దక్షిణ ఢల్లీిలోని బారాపుల్లా కాలువను శుభ్రపరిచేందుకు, చేపటట్టిన కార్యక్రమాన్ని  భారత ప్రభుత్వ ప్రిన్సిపుల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ (పిఎస్‌ఎ)ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌ 2023 మార్చి 20న సందర్శించారు. ఢల్లీిలోని భోపాల్‌ మార్కెట్‌ సమీపంలో గల బారాపుల్లా డ్రెయిన్‌ను ఆయన సందర్శించారు. డిఎం80 డ్రెయిన్‌ మాస్టర్‌ , కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని  ఎలలా చేపడుతున్నదో ఆయన పరిశీలించారు. దీనిని మెసర్స్‌ క్లీన్‌టెక్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందిచింది. బారాపుల్లా డ్రెయిన్‌ను శుభ్రపరిచేందుకు దీనిని రూపొందించారు. వేస్ట్‌ టు వెల్త్‌ మిషన్‌ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్‌ అజయ్‌ కె.సూద్‌, బారాపుల్లా డ్రెయిన్‌ ను శుభ్రంచేసేందుకు చేపట్టిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభినందించారు. డ్రెయిన్‌మాస్టర్‌ డిఎం 80 తో ఏడాదిపాటు సాగించినపైలట్‌ ప్రాజెక్టు  పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పట్టణాలలోని డ్రెయిన్‌లను శుభ్రం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బారాపుల్లా డ్రెయిన్‌ను శుభ్రం చేయడంలో ఉపయోగించిన సాంకేతికత వల్ల ,ఇలాంటి శుద్ధికార్యక్రమాలపై నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు.

ఇరుకైన కాలువలలో శుద్ధికార్యక్రమాలు నిర్వహించడం మన దేశంలో సవాలుతోకూడిన వ్యవహారం. జొసెఫ్‌ సిరిల్‌ బామ్‌ఫోర్డ్‌ (జెసిబి) ఎక్సకవేటర్‌, ప్రొక్లెయిన్‌ వంటి వాటిని వాడడంలో కొన్నిచోట్ల ఇబ్బందులు ఉంటుంటాయి. దీనికితోడు ఈ కాలువలకు అటు, ఇటు ఒడ్డున ఆవాసాలు ఉంటుంటాయి. దీనితో కాలువనుంచి  తొలగించిన చెత్తను బయట పడవేయడం  ఇబ్బందికరం. దక్షిణ ఢల్లీిలోని బారాపుల్లా డ్రెయిన్‌ ఇలాంటిదే. ఈకాలువ చాలాచోట్ల చెత్తా చెదారం పేరుకుపోయి ప్రవాహం అడ్డుపడుతూ వస్తోంది. అలాగే  మట్టిపేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా రకరకాల వ్యాధులకు, అపరిశుభ్ర పరిస్థితులకు ఇది కారణమవుతోంది.మరోవైపు వర్షాకాలంలో ప్రవాహం అడ్డుపడి మురికి పొంగి ప్రవహిస్తోంది.

ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వేస్ట్‌ టు వెల్త్‌ మిషన్‌ దక్షిణ ఢల్లీి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ప్రస్తుత మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ డిల్లీతో)తో కలిసి పనిచేసÊఓతంది.  దేశీయంగా ఇందుకోసం రూపొందించిన చెత్త తొలగింపు పరికరం డ్రెయిన్‌మాస్టర్‌ డిఎం`80 ని మెస్సర్స్‌ క్లీన్‌టెక్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, ముంబాయి వారురూపొందించారు. డిఎం`80 ని నిర్మాణ వ్యర్థాలు తొలగించడంలో, కాలువలు శుభ్రం చేయడంలో ఉపయోగిస్తారు.
స్వతంత్ర చాలనం కలిగిన, ఎక్కడికైనా తీసుకుపోయేందుకు అనువైన, నీటిలోనూ,నేలపైనా నడపడానికి వీలైన పరికరం ఇది. ఇది రోజుకు 50నుంచి 100 ఎం3లవ్యర్థాలను తొలగించగలదు. ఇది పట్టణ ప్రాంతాలలో డ్రెయిన్లను శుభ్రంచేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.

డిఎం 80 యంత్రాన్ని 2022 జనవరి 3 వతేదీ నుంచి 2023 జనవరి 2  వ తేదీ వరకు ఉపయోగించి  బారాపుల్లా డ్రెయిన్‌ను శుభ్రం చేశారు. ఈ సమయంలో క్లీన్‌టెక్‌ ఇన్‌ఫ్రా సంస్థఈ యూనిట్‌ను ఉపయోగించి కాలువను శుభ్రం చేసింది.సుమారు 3 కిలోమీటర్ల పొడవున ఈ కాలువను శుభ్రం చేసింది. సుండియాల్‌ పార్క్‌నుంచి జంగ్‌ పుర వరకు సుమారు 3000 టన్నుల చెత్తను ఇది తొలగించింది. ఢల్లీి మునిసిపల్‌ కార్పొరేషన్‌, కాలువనుంచి తొలగించిన వ్యర్థాలను తరలించే ఏర్పాటు చేసింది.

డిల్లీలోని ఇతర డ్రెయిన్‌లను శుభ్రం చేసేందుకు డిఎం 80 యూనిట్‌ను వాడాలని డిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. భారత ప్రభుత్వ పిఎస్‌ఎ కార్యలయ సైంటిఫిక్‌ కార్యదర్శి డాక్టర్‌ (శ్రీమతి) పర్విందర్‌ మైనీ మాట్లాడుతూ, బారాపుల్లా కాలువలో చెత్తతొలగింపును పిఎస్‌ఎ, వేస్ట్‌ టు వెల్త్‌ కింద తొలగించడం అద్భుతమైన కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడానికి సంబంధిత ఏజెన్సీలతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలన్నది చూస్తామని ఆమె అన్నారు.

ఈ కాలువ పనుల సందర్శన సందర్భంగా పిఎస్‌ఎ కార్యాలయ సలహాదారు డాక్టర్‌ మనోరంజన్‌ మొహంతి, అడిషనల్‌ కమిషనర్‌,  డిల్లీ   మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసిడి) శ్రీమతి సాక్షి మిట్టల్‌, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరక్టర్‌ బినయ్‌ ., ఎంసిడి సౌత్‌ ఇంజనీర్‌ ఇన్‌ ఛీఫ్‌ పిసిమీనా, ఇంజనీర్‌ ఇన్‌ఛీఫ్‌ ఎంసిడి ఈస్ట్‌ దిలీప్‌రమనాణి, ఎంసిడి సౌత్‌ ఛీఫ్‌ ఇంజనీర్‌ సుధీర్‌ మెహతా, ఎంసిడి కి చెందిన ఇతర అధికారులు, పిఎస్‌ఎ కార్యాలయ అధికారులు, వేస్ట్‌ టు వెల్త్‌ మిషన్‌ అధికారులు పాల్గొన్నారు.

వ్యర్థాలనుంచి సంపద మిషన్‌ :

వ్యర్థాలనుంచి సంపదను సృష్టించే కార్యక్రమానికి (వేస్ట్‌ టు వెల్త్‌)ను భారత ప్రభుత్వానికిచెందిన ఆఫీస్‌ ఆఫ్‌ ద ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌అడ్వయిజర్‌ నాయకత్వం వహిస్తున్నారు.  దేశంలో వ్యర్థాల నియంత్రణను బలోపేతం చేసే ఉద్దేశంతో దీనిని చేపట్టారు. ఇందుకు వినూత్నమైన నమూనాలను ప్రదర్శిస్తున్నారు. వ్యర్థాలుఏమాత్రం లేని దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌, స్మార్ట్‌మిషన్‌ప్రాజెక్టులను శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల ద్వారా మరింత ముందుకు తీసుకుపోవడం దీని లక్ష్యం.

***

 



(Release ID: 1909446) Visitor Counter : 105


Read this release in: Hindi , English , Urdu