ఆయుష్
హెల్త్ టూరిజం ద్వారా ఆయుష్ విధానాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
Posted On:
21 MAR 2023 3:12PM by PIB Hyderabad
దేశంలో వైద్య పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 'హీల్ ఇన్ ఇండియా' పేరిట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా 'వన్ స్టెప్ హీల్ ఇన్ ఇండియా' పోర్టల్‌ను అభివృద్ధి చేయడం కోసం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ మరియు సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌తో కలిసి కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పని చేస్తున్నాయి.
ఆయుర్వేదం,ఇతర సంప్రదాయ వైద్య రంగాల్లో వైద్య ఆధారిత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి పర్యాటక అభివృద్ధి సంస్థ (ITDC), పర్యాటక మంత్రిత్వ శాఖ తో ఆయుష్ మంత్రిత్వ శాఖఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వశాఖల సహకారంతో మెడికల్ వెల్ నెస్ టూరిజం అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ కార్యక్రమాన్ని, కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
విలువ ఆధారిత వైద్య పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర పథకంగా అమలు జరిగే 'ఛాంపియన్ సర్వీస్ సెక్టార్ స్కీమ్ ఫర్ మెడికల్ వాల్యూ స్కీమ్' కు రూపకల్పన చేసింది. ఈ పథకం కింద, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM) యాక్ట్, 2020 లేదా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కమిషన్ (NCH) చట్టం, 2020 గుర్తించిన వైద్య విధానాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్/డే కేర్ సెంటర్‌లను నెలకొల్పడానికి ప్రైవేట్ పెట్టుబడిదారులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రాయితీ రూపంలో ఆర్థిక సహాయం అందించారు.
హీల్ ఇన్ ఇండియా , హీల్ బై ఇండియా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. వీటిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా పాల్గొంది. భారతదేశంలో పర్యాటక రంగం ద్వారా సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి అమలు చేయాల్సిన చర్యలను గుర్తించారు.
మెడికల్ వాల్యూ ట్రావెల్‌లో భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ ఆయుష్ సదస్సు, ఆవిష్కరణ సదస్సులో భారతదేశంలో వైద్యం- విలువ ఆధారిత పర్యాటక రంగం అభివృద్ధికి గల అవకాశాలపై రౌండ్ టేబుల్ ప్లీనరీ సదస్సు జరిగాయి.
భారతదేశంలో సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, ప్రజలకు ఈ వ్యవస్థల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆయుర్వేద దినోత్సవం, యునాని దినోత్సవం సిద్ధా దినోత్సవాన్ని నిర్వహించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆరోగ్య మేళాలు/ప్రదర్శనలను నిర్వహిస్తోంది.
గోవాలో 08 నుండి 11 వరకు జరిగిన ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్‌లో సమాచార బ్రోచర్‌లు ముద్రించారు. భారతీయ వైద్య విధానాల్లో వైద్యం అందిస్తున్న వారికి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. క
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనుబంధ ఆస్పత్రులు కలిగిన జాతీయ సంస్థల జాబితా
స.నెం.
|
ఇన్స్టిట్యూట్ పేరు
|
స్థానం
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
1
|
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ & రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద
|
జామ్‌నగర్
|
గుజరాత్
|
2
|
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్
|
జైపూర్
|
రాజస్థాన్
|
3
|
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద
|
న్యూఢిల్లీ
|
న్యూఢిల్లీ
|
4
|
నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద హోమియోపతి
|
షిల్లాంగ్
|
మేఘాలయ
|
5
|
నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్
|
పాసిఘాట్
|
అరుణాచల్ ప్రదేశ్
|
6
|
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి
|
కోల్‌కతా
|
పశ్చిమ బెంగాల్
|
7
|
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్
|
బెంగళూరు
|
కర్ణాటక
|
8
|
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి
|
పూణే
|
మహారాష్ట్ర
|
9
|
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ
|
చెన్నై
|
తమిళనాడు |
10
|
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా
|
లేహ్ |
లడఖ్
|
ఈ సమాచారాన్ని ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1909443)
Visitor Counter : 164