ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో వైద్య పర్యాటకం వృద్ధిపై సమాచారం
2020-2021లో, వైద్య పర్యాటకం సూచీలోని (ఎంటీఐ) 46 ప్రపంచ గమ్యస్థానాల్లో 10వ స్థానంలో భారతదేశం
వైద్య అవసరాల కోసం వచ్చిన విదేశీయుల సంఖ్య 2020లోని 1.83 లక్షల నుంచి 2021 నాటికి 3.04 లక్షలకు పెరిగింది
Posted On:
21 MAR 2023 3:02PM by PIB Hyderabad
2020-2021కి సంబంధించి, వైద్య పర్యాటకం సంస్థ ప్రకటించిన వైద్య పర్యాటకం సూచీలోని (ఎంటీఐ) 46 ప్రపంచ గమ్యస్థానాల్లో భారతదేశం 10వ స్థానంలో ఉంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, వైద్య అవసరాల కోసం భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది:
సంవత్సరం
|
వైద్య అవసరాల కోసం వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య
|
2020
|
1.83 లక్షలు
|
2021
|
3.04 లక్షలు
|
దేశంలో వైద్య పర్యాటకాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో, 2022లో, 'నేషనల్ స్ట్రాటెజీ అండ్ రోడ్‌మ్యాప్ ఫర్ మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజం'ను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ వ్యూహంలో భాగంగా, దేశంలో విలువ ఆధారిత వైద్య ప్రయాణాల అభివృద్ధికి ఈ క్రింది కీలకాంశాలను గుర్తించారు:
- భారతదేశం కోసం ఒక వెల్‌నెస్ డెస్టినేషన్ బ్రాండ్‌ను అభివృద్ధి చేయడం
- వైద్యం, వెల్‌నెస్ పర్యాటకం కోసం వ్యవస్థను బలోపేతం చేయడం
- ఆన్‌లైన్ విలువ ఆధారిత వైద్య ప్రయాణాల (ఎంవీటీ) పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా డిజిటలీకరణను ప్రారంభించడం
- విలువ ఆధారిత వైద్య ప్రయాణాలను సులభతరం చేయడం
- వెల్‌నెస్ పర్యాటకాన్ని ప్రోత్సహించడం
- పరిపాలన, సంస్థాగత విధివిధానాలు
దేశంలో వైద్య విలువ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి హోం శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత వర్గాలతో కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటోంది. విలువ ఆధారిత వైద్య ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత వర్గాలతో ఒక సంస్థాగత విధానాన్ని మంత్రిత్వ శాఖ అవలంబిస్తోంది. ఈ రంగంలో సవాళ్లను, అవకాశాలను గుర్తించేందుకు మంత్రిత్వ శాఖలు, ఆసుపత్రులు, ఎంవీటీ నిర్వాహకులు, బీమా కంపెనీలు, 'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్‌కేర్ ప్రొవైడర్స్'తో (ఎన్‌ఏబీహెచ్)తో అనేక దఫాల చర్చలు జరిగాయి.
కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.
****
(Release ID: 1909433)
Visitor Counter : 150