బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల అభివృద్ధి, నిర్వహణ ఒప్పందాల కేటాయింపు
प्रविष्टि तिथि:
20 MAR 2023 5:31PM by PIB Hyderabad
గనుల అభివృద్ధి, నిర్వహణ ఒప్పందాల (ఎండీవో) ప్రక్రియను పారదర్శకంగా మార్చడానికి 2020లో నీతి ఆయోగ్ సమీక్షించింది. ఉక్కు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆదాయ విభాగంతో సంప్రదింపుల ద్వారా ఈ సమీక్ష జరిగింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్L), ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఐఎల్) ఎండీవో కాంట్రాక్టులను కేటాయించడం కోసం ఓపెన్ టెండర్ ద్వారా పారదర్శక ప్రక్రియను అనుసరిస్తాయి.
తాజా వేలం నిర్వహించకుండా ఎండీవో ఒప్పందాలను సీఐఎల్, ఎస్‌సీసీఎల్, ఎన్‌ఎల్‌సీఐఎల్ పునరుద్ధరించలేదు.
బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 2015లోని సెక్షన్ 11 (1)ని సవరించే ప్రతిపాదన లేదు.
ఏ ప్రభుత్వ గనుల సంస్థకు సీఐఎల్/ఎన్‌ఎల్‌సీఐఎల్ ఎండీవో కాంట్రాక్టు ఇవ్వలేదు.
బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 1908986)
आगंतुक पटल : 167