యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఒలింపిక్స్ బంగారు పతకం విజేత నీరజ్ చోప్రా టర్కీలోని అంటాల్యలో శిక్షణ తీసుకునేందుకు టాప్స్ ఆర్థిక సాయం
Posted On:
20 MAR 2023 12:56PM by PIB Hyderabad
ఒలింపిక్స్ బంగారు పతకం విజేత నీరజ్ చోప్రా టర్కీలోని గ్లోరియా స్పోర్ట్స్ ఎరీనాలో 61 రోజుల పాటు శిక్షణ తీసుకునే ప్రతిపాదనను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఏఎస్) ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు మార్చి 16, 2023న ఆమోదం లభించింది.

టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) నిధుల కింద, నీరజ్ చోప్రా గత సంవత్సరం కూడా గ్లోరియా స్పోర్ట్స్ అరేనాలో శిక్షణ పొందాడు. ఇప్పుడు, ఏప్రిల్ 1న టర్కీ వెళతాడు, మే 31 వరకు అక్కడే ఉంటాడు.
నీరజ్‌తో పాటు అతని కోచ్ క్లాస్ బార్టోనిట్జ్, ఫిజియోథెరపిస్ట్ విమాన ఛార్జీలు, హోటల్ గది, భోజనం ఖర్చులు, వైద్య బీమా, స్థానిక రవాణా ఖర్చులను టాప్స్ చూసుకుంటుంది.
గోల్ఫ్ సెట్ పరికరాల కొనుగోలుకు ఆర్థిక సాయం & వ్యక్తిగత కోచ్ నియామకం; డెఫ్ ఒలింపిక్స్ బంగారు పతకం విజేత దీక్ష దాగర్‌కు ఫిట్‌నెస్ & న్యూట్రిషన్ ట్రైనర్; స్విస్ ఓపెన్, స్పెయిన్ మాస్టర్స్, ఓర్లీన్స్ మాస్టర్స్‌లో పాల్గొనేందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రియాంషు రజావత్‌కు ఆర్థిక సాయం; ఓర్లెన్ పోలిష్ ఓపెన్, స్లోవేనియా యోనెక్స్ ఓపెన్‌లో పాల్గొనేందుకు షట్లర్ శంకర్ ముత్తుసామికి ఆర్థిక సాయం వంటివి ఆ సమావేశంలో ఎంవోసీ సభ్యులు ఆమోదించిన ఇతర ముఖ్య ప్రతిపాదనలు.
****
(Release ID: 1908896)