సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
దృశ్యమాధ్యమం ద్వారా 17 మార్చిన కువైట్‌లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించిన విదేశీ వ్యవహారాలు, సంస్కృతి శాఖల సహాయమంత్రి శ్రీమతి మీనాక్షీ లేఖీ
కువైట్‌లో జరుగుతున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇరు దేశాల మధ్య గల సచేతన సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందిః శ్రీమతి మీనాక్షీ లేఖి
Posted On:
20 MAR 2023 3:04PM by PIB Hyderabad
కువైట్ దేశంలో 17 మార్చి 2023న నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను భారత విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షీ లేఖీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారత్ - కువైట్‌ల మధ్య గల బలమైన చారిత్రిక సంబంధాన్ని పట్టి చూపడమే కాక, ప్రస్తుతం భారత్, కువైట్‌ల మధ్య సాగుతున్న సాంస్కృతిక బదలాయింపులను ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య గల సచేతనమైన సాంస్కృతిక సంబంధాలను కువైట్‌లో జరుగుతున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మరింత బలోపేతం చేస్తుందని ఆమె ఉద్ఘాటించారు.
భారత ప్రభుత్వపు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిన ప్రముఖ సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన మూడు బృందాలలో 1) కుత్బీ సోదరుల - కవ్వాలీ ప్రదర్శన 2) హసన్ ఖాన్ బృందం - రాజస్థానీ జానదపదం 3) అనిరుధ్ వర్మ కలెక్టివ్ - భారతీయ సంప్రదాయ, సమకాలీన సంగీతాల ఫ్యూజన్ ఉన్నాయి. ఈ బృందాలు భారతదేశంలోని విభిన్న ప్రాంతాల, సంస్కృతుల, మతాల నుంచి భారతదేశ నాగరికత చారిత్రిక మేళన చిత్రాన్ని అందించాయి.
ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను స్టేట్ ఆఫ్ కువైట్‌లో 17-18 మార్చి 2023న కువై ట్‌లోని భారతదేశ రాయబార కార్యాలయం భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించింది. కోవిడ్-19 మహమ్మారి అనంతరం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విదేశాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మొదటిది. ఈ ఫెస్టటివల్‌కు స్టేట్ ఆఫ్ కువైట్ ప్రభుత్వ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు, సంస్కృతి, కళలు, లెటర్స్ జాతీయ కౌన్సిల్ (ఎన్‌సిసిఎఎల్) తోడ్పడ్డాయి. దీని ముగింపు కార్యక్రమాన్ని యార్మౌక్ కల్చరల్ సెంటర్‌లోని దర్ అల్ అథర్ ఇస్లామియా (డిఎఐ) లో 18 మార్చి 2023న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కువైటీ మిత్రులు, భారతీయ సమాజానికి చెందిన వారు హాజరయ్యారు.
ఈ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటుగా 18 మార్చి 2023న కువైటీ మిత్రులకు, రాయబార సమాజానికీ కువైట్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఇన్‌క్రెడిబుల్ ఇండియా - టూరిజం ఎగ్జిబిషన్ ( అత్యద్బుత భారతదేశం - పర్యాటకం ప్రదర్శన), భారతీయ కాఫీ రుచి చూసే కార్యక్రమాలను నిర్వహించింది.
***
(Release ID: 1908886)
Visitor Counter : 172