వ్యవసాయ మంత్రిత్వ శాఖ
గయానా, సురినామ్, జాంబియా, మారిషస్ మరియు శ్రీలంక మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్
ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సులో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమంతో కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన భారత్
Posted On:
19 MAR 2023 8:26PM by PIB Hyderabad
ప్రపంచ చిరుధాన్యాల ( శ్రీ అన్న) సదస్సులో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. సదస్సులో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం
(డబ్ల్యు ఎఫ్ పీ)తో కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (IYM) కింద శ్రీ అన్నను ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశం నిర్వహిస్తున్న ప్రపంచ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన మంత్రులకు శ్రీ తోమర్ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ శ్రీ అన్నం, శ్రీ అన్నం వంటకాలు, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ఆదరణ లభించేలా చూడాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ దేశాలతో భారత్ వ్యవసాయ సంబంధాలను మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ మరియు ఉపాధ్యక్షుడు భరత్ జగదేవ్‌ల భారత పర్యటనను గయానా వ్యవసాయ మంత్రి శ్రీ జుల్ఫికర్ ముస్తఫా తో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ తోమర్ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి వ్యవసాయం రంగం ముఖ్యమైన రంగంగా ఉంటుందన్నారు. భారతదేశం-గయానా దేశాల మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతి సాధించడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో మరింత సహకారం ఉండాలన్నారు. భారీగా ముడి చమురు నిక్షేపాలు గుర్తించిన గయానా దేశాన్ని మంత్రి అభినందించారు. ఒక ప్రధాన ఇంధన ఎగుమతిదారుగా గయానా అభివృద్ధి నిక్షేపాలు సహకరిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ముడి చమురు నిక్షేపాలు గయానా దేశ ప్రజల జీవన స్థితిగతులు మారుస్తాయని శ్రీ తోమర్ అన్నారు. వ్యవసాయం వ్యవసాయ-ప్రాసెసింగ్ పరిశ్రమల రంగంలో భారతదేశం గయానా మరింత సహకారం అందించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. గయానాలో విస్తారమైన వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి లభ్యత ఉందని భారతదేశం సాంకేతిక, నైపుణ్యం మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కలిగి ఉందన్నారు. రెండు దేశాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ పరస్పరం ప్రయోజనం పొందడానికి అనువైన పరిస్థితి ఉందన్నారు. గయానాలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధిలో తన నైపుణ్యం, అనుభవాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని, దీనికోసం త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని శ్రీ తోమర్ అన్నారు. గయానా షుగర్ కార్పొరేషన్ నిర్వహణకుసహకరించి, గయానాలోని షుగర్ ఎస్టేట్‌లు/ప్లాంట్‌లను పునరుద్ధరించడానికి మూడు సంవత్సరాల పాటు భారతదేశం నుండి ఇద్దరు ఐటీఈసీ నిపుణులను నియమించాలని గయానా చేసిన అభ్యర్థనను వీలైనంత త్వరగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సురినామ్ వ్యవసాయ మంత్రి శ్రీ పర్మానంద్ ప్రహ్లాద్ సెవ్డియన్‌తో జరిగిన సమావేశంలో శ్రీ తోమర్ భారతదేశం, సురినామ్ దేశాలు 150 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాల వల్ల మైత్రి మరింత బలపడిందన్నారు. సురినామ్‌కు భారతీయులు వచ్చి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు, 2023 జనవరిలో జరిగిన సురినామ్ అధ్యక్షుడు సంతోఖి భారతదేశ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సురినామ్‌లో హిందీ పెద్ద ఎత్తున మాట్లాడతారని శ్రీ తోమర్ గుర్తు చేశారు.సురినామ్ కూడా భారతదేశం తరహాలో బహుళజాతి భిన్నత్వం కలిగిన దేశంగా గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రజలు శాంతి, సామరస్యంతో జీవిస్తున్నారు. వ్యవసాయంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు 5 సంవత్సరాల (2023-27) పాటు అమలులో ఉండే సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ముసాయిదా త్వరలో సిద్ధమవుతుందని శ్రీ తోమర్ అన్నారు. సురినామ్ నుంచి భారతదేశానికి కలప ఎగుమతి సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. 2021-22లో భారతదేశం నుంచి సురినామ్‌కు USD 4.34 మిలియన్ అమెరికా డాల్లర్ల విలువ చేసే వ్యవసాయ సంబంధిత వస్తువుల ఎగుమతులు జరిగాయన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం ముఖ్యంగా వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్‌లో వాణిజ్యం పెట్టుబడి అవకాశాలు పెంచడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. సురినామ్‌కు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడానికి, సామర్థ్య నిర్మాణానికి మరియు మానవ వనరుల నైపుణ్య అభివృద్ధికి తోడ్పడటానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు.రెండు దేశాలను స్వావలంబన దేశాలు గా మార్చడానికి , దిగుమతి చేసుకున్న ధాన్యాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి శ్రీ అన్న ఆదర్శవంతమైన పరిష్కార మార్గంగా ఉంటుందని శ్రీ తోమర్ అన్నారు. సురినామ్ ముందుకు వస్తే వ్యవసాయ సహకార ప్రాజెక్టులను ప్రారంభించడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. సురినామ్‌లో శ్రీ అన్న సాగు కోసం అధ్యయనాలు నిర్వహించడానికి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC) ప్రోగ్రామ్‌ల క్రింద వ్యవసాయ శాస్త్రవేత్తలను నియమించవచ్చు.
జాంబియా వ్యవసాయ మంత్రి శ్రీ రూబెన్ మతోలో ఫిరీ తో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి తోమర్ మాట్లాడుతూ భారత్, జాంబియా మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. జాంబియా స్వాతంత్ర్య పోరాట నాయకులు భారతదేశ స్వాతంత్ర్య పోరాట నాయకుల నుంచి, ముఖ్యంగా మహాత్మా గాంధీ నుంచి ప్రేరణ పొందారు. గాంధీజీ జాంబియా నాయకులు యువ తరానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. భారతదేశం అందిస్తున్న అభివృద్ధి సహకార కార్యక్రమం నుంచి ప్రయోజనం పొందిన కొన్ని ఆఫ్రికా దేశాల్లో జాంబియా ఒకటని అన్నారు. ఇండియా -ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ (IAFS) కింద భారతదేశం వివిధ ఉన్నత విద్యా కోర్సులు, ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ శిక్షణ కోసం స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నదన్నారు. ఎగ్జిమ్ బ్యాంక్ క్రెడిట్, రైల్వే వ్యాగన్‌లు,వరద సహాయ నిధి లైన్ ఆఫ్ క్రెడిట్‌తో పాటు ప్రత్యేక సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను అందిస్తుంది. సహజ వనరులు కలిగి ఉన్న జాంబియాలో వివిధ రంగాల్లో భారతీయ పెట్టుబడులకు ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. జాంబియాలో $ 5 బిలియన్లకు పైగా భారతదేశం పెట్టుబడులు పెట్టింది. భారతదేశం, జాంబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వాణిజ్యం, పెట్టుబడి కోసం భారతదేశం పట్ల జాంబియా ఆసక్తి కనబరుస్తోంది. అయితే రవాణా, జాంబియా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రధాన అడ్డంకులుగా నిలుస్తూ పరిమితులు విధిస్తున్నాయి.
మారిషస్ వ్యవసాయ-పరిశ్రమ,ఆహార భద్రత మంత్రి శ్రీ మనీష్ గోబిన్‌తో జరిగిన సమావేశంలో శ్రీ తోమర్ మాట్లాడుతూ భారతదేశం చారిత్రక, జనాభా మరియు సాంస్కృతిక కారణాల వల్ల మారిషస్‌తో సన్నిహిత, దీర్ఘకాల సంబంధాలను పంచుకుంటుందని చెప్పారు. ద్వీపంలోని 1.2 మిలియన్ల జనాభా లో 70% మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. 1948లో మారిషస్‌కు స్వాతంత్ర్యం రాకముందే స్వతంత్ర భారతదేశం దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న కొన్ని ముఖ్యమైన దేశాలలో మారిషస్ ఒకటి. రెండు దేశాల నాయకత్వాల మధ్య విశ్వాసం , పరస్పర అవగాహన ఉంది. దీనివల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయి.సముద్ర భద్రత, అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్యం పెంపుదల అంతర్జాతీయ వేదికలలో రెండు దేశాలు కలిసి పనిచేస్తూ సంబంధాలను పటిష్టం చేసుకుంటున్నాయి. . భారతదేశం మరియు మారిషస్ మధ్య శాశ్వతమైన సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయి. మారిషస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ప్రపంచంలో భారతదేశం అతిపెద్దది), హిందీని ప్రోత్సహించే ద్వైపాక్షిక సంస్థ అయిన ప్రపంచ హిందీ సెక్రటేరియట్ ద్వారా సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి. . మారిషస్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఒకటి. 2021-22 లో ద్వైపాక్షిక వాణిజ్యం 69% పెరిగి $ 786.72 మిలియన్లకు చేరుకుంది.
శ్రీ తోమర్, శ్రీలంక వ్యవసాయ మంత్రి శ్రీ మహింద అమరవీర మధ్య జరిగిన సమావేశంలో వ్యవసాయానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. . భారతదేశం , శ్రీలంక లో ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువైపులా ఒకే విధమైన ప్రాధాన్యతలు ఉన్నాయని శ్రీ తోమర్ చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇరుపక్షాల మధ్య సహకారం మరింత మెరుగు పడేందుకు అవకాశం ఉందన్నారు. శ్రీలంక వాణిజ్యం సాగిస్తున్న అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఒకటిగా ఉంది సార్క్‌లో భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో శ్రీలంక ఒకటి.
అంతర్జాతీయ సదస్సు సందర్భంగా వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్ సమక్షంలో 2023-2027 మధ్య సహకారం కోసం ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం, భారతదేశం ఒప్పందంపై సంతకం చేశాయి. కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీ మనోజ్ జునేజా, భారతదేశంలో సంస్థ ప్రతినిధి, కంట్రీ డైరెక్టర్ శ్రీమతి ఎలిజబెత్ ఫౌర్ పాల్గొన్నారు.ఆహారం, ప్రజా పంపిణీ శాఖ, వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ,పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ అవగాహన ఒప్పందాన్ని అమలు చేస్తాయి. ఆహార స్వయం సమృద్ధి ప్రోత్సహించడం, ఆకలి సవాలుకు దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయడానికి, ప్రభుత్వం, ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రపంచ ప్రయత్నాలకు ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం అందిస్తున్న సహకారాన్ని శ్రీ తోమర్ ప్రశంసించారు. ప్రపంచ చిరుధాన్యాల నిర్వహణకు సహకరిస్తున్న డబ్ల్యుఎఫ్‌పికి ధన్యవాదాలు తెలిపిన ఆయన డబ్ల్యుఎఫ్‌పి, భారత ప్రభుత్వం మధ్య కుదిరిన అవగాహన వల్ల లక్ష్యాలను సాధించడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం - 2023 లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ శ్రీ అన్నతో తయారు చేసిన రుచికరమైన ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించారు. ఈ ఆవిష్కరణ కోసం స్టాల్ ఆపరేటర్. శ్రీ తోమర్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ క్యులినరీ అసోసియేషన్ లైవ్ కుకింగ్ కౌంటర్‌లో భారతీయ శ్రీ అన్నతో కలిపి ఆసియా సలాడ్‌ను మంత్రి స్వయంగా సిద్ధం చేసి రుచి చూశారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి , కార్యదర్శి శ్రీ. మనోజ్ అహుజా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర స్టాల్స్‌ను కూడా ఉన్నతాధికారులు సందర్శించారు. ఎగ్జిబిషన్ చూసేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులు తరలివచ్చారు. గత రెండు రోజులుగా వేలాది మంది చిన్నారులు ఇక్కడికి వచ్చారు.
***
(Release ID: 1908680)
Visitor Counter : 165