గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మార్చి 31 వరకు మిశ్రమ విధానంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వేతన చెల్లింపులు


- ఏబీపీఎస్, ఎన్ఏసీహెచ్ రూపంలోనూ వేతనాల చెల్లింపులు

- ప్రతి లబ్ధిదారునికి వేతన చెల్లింపులను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది

Posted On: 19 MAR 2023 8:49PM by PIB Hyderabad

 రాష్ట్రాల అభ్యర్థన మేరకు ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్వేతన చెల్లింపులకు 31 మార్చి, 2023 వరకు మిశ్రమ నమూనాను కొనసాగించాలని కేంద్ర  ప్రభుత్వం నిర్ణయించిందిఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రతి లబ్ధిదారునికి వేతన చెల్లింపు ‘ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎప్అలాగే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్ఉపయోగించి జరపబడుతుంది. లబ్ధిదారుడి ఏబీపీఎస్ స్థితిని బట్టి ఈ చెల్లింపులు జరుగుతాయి.

వేతనాల చెల్లింపులో రెండు మార్గాలు ఉన్నాయి:

a.                ఏబీపీఎస్లబ్ధిదారుడు ఏబీపీఎస్ విధానంతో  లింక్ చేయబడితేఏబీపీఎస్ ద్వారా మాత్రమే చెల్లింపు చేయవచ్చు చేయవచ్చు.

b.                ఎన్ఏసీహెచ్ - కొన్ని సాంకేతిక కారణాల వల్ల లబ్ధిదారుడిని ఏబీపీఎస్ తో లింక్ చేయకపోతే, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ఏసీహెచ్ వేతనాల చెల్లింపు విధానంగా ఎంచుకోవచ్చు.

మహాత్మాగాంధీ ఎన్‌ఆర్‌ఈజీ పథకం కింద చురుకైన కార్మికుల సంఖ్య 14.96 కోట్లు. మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీ పథకం కింద ప్రతి కార్మికునికి సకాలంలో వేతనం చెల్లించేలా భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. 14.96 కోట్ల మంది కార్మికులలో, 14.27 కోట్ల మంది కార్మికుల (95.4%) ఆధార్ సీడింగ్ న్‌ఆర్‌ఈజీఏసాఫ్ట్లో జరిగింది, ఇందులో మొత్తం 10.05 కోట్ల మంది కార్మికులు ఏబీపీఎస్ కింద నమోదు చేయబడ్డారు. వేతన చెల్లింపు కోసం ఫిబ్రవరి 2023 నెలలో మొత్తం 4.60 కోట్ల లావాదేవీలు జరిగాయి, వాటిలో 3.57 కోట్ల లావాదేవీలు (77.6%) ఏబీపీఎస్ ద్వారా జరిగాయి. మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీ పథకం కింద వేతన చెల్లింపు మార్గాలలో ఒకటిగా ఏబీపీఎస్ కొనసాగుతోంది. సకాలంలో వేతనాలను చెల్లించడానికి ఇది ప్రవేశపెట్టబడింది. బ్యాంక్ ఖాతా సంబంధిత సమస్యల కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. ఈ వ్యవస్థ కార్మికుల చెల్లింపుల పట్ల పారదర్శకతను కూడా నిర్ధారిస్తుంది. ఆధార్ సీడింగ్ మరియు ఏబీపీఎస్ పథకం కింద 2017 నుండి అమలులో ఉన్నాయి. పథకం యొక్క ప్రతి లబ్ధిదారునికి వేతన చెల్లింపును నిర్ధారించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.


(Release ID: 1908674)
Read this release in: English , Urdu , Hindi , Punjabi