రక్షణ మంత్రిత్వ శాఖ
మాలేలో జరిగిన భారత్-మాల్దీవుల 4వ రక్షణ రంగ సహకార చర్చలు
ద్వైపాక్షిక రక్షణ రంగ కార్యక్రమాలను సమీక్షించిన భారత్, మాల్దీవుల రక్షణ శాఖ ఉన్నతాధికారులు; ప్రస్తుత విన్యాసాల సంక్లిష్టతను పెంచడానికి అంగీకారం
प्रविष्टि तिथि:
19 MAR 2023 5:26PM by PIB Hyderabad
భారత్-మాల్దీవుల 4వ రక్షణ రంగ సహకార చర్చలను (డీసీడీ) మార్చి 19, 2023న మాలేలో నిర్వహించాయి. భారత రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమణె, మాల్దీవుల ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ మేజర్ జనరల్ అబ్దుల్లా షమాల్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి.
రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో పరస్పర సహకారం పెంపొందించుకునే చర్య ఇది. ఈ చర్చలకు రెండు దేశాలు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా, రెండు దేశాల సాయుధ బలగాల మధ్య సంబంధాలను భవిష్యత్తులోనూ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఇక్కడ స్పష్టమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యకలాపాలను చర్చల సందర్భంగా ఇరు దేశాల అధికారులు సమీక్షించారు, పెరుగుతున్న సహకారంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక యుద్ధ విన్యాసాల మీద కూడా చర్చ జరిగింది, విన్యాసాల సంక్లిష్టతను పెంచడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
భారతదేశం, మాల్దీవుల సాయుధ దళాలు బహుళాంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాయి, పెరిగిన స్నేహబంధం ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తుకు సానుకూల సంకేతం. చర్చలు సఫలం కావడం పట్ల మేజర్ జనరల్ అబ్దుల్లా షమాల్, అతని బృందానికి శ్రీ గిరిధర్ అరమణె కృతజ్ఞతలు తెలిపారు. 4వ డీసీడీలో కుదిరిన ఉమ్మడి అవగాహన ఆధారంగా భారతదేశం నిరంతర స్నేహబంధం కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.
మాల్దీవుల పర్యటన సందర్భంగా, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి శ్రీమతి మరియా అహ్మద్ దీదీ, విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌తోనూ అమరణె సమావేశం అయ్యారు.
***
(रिलीज़ आईडी: 1908631)
आगंतुक पटल : 248